Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda



                                        రెండవ పర్యాయ సూక్తము - 6

    వినియోగము :-


    అభిచార కర్మమున 2-5 నాలుగు పర్యాయ సూక్తములచే శత్రువును పాశములతో బంధించి అభిమంత్రించి నిఖననము చేయునది. ఆ కర్మమునందే 5వ సూక్తపు 3, 4 మంత్రములను వదిలి మిగిలిన సూక్తములచే అడుగడుగున పాశములను ఛేదించునది. అదేవిధముగ, అదే కర్మయందు అధిపాశ బాధక శంకువులను సంక్షుదించి భ్రష్ట్రమున అభ్యసనము చేయునది. అట్లే, అదే కర్మమున ఎర్రబియ్యపు క్షీరాన్నమును అభిమంత్రించి ఇచ్చునది.

    ఈ కర్మమునందే ఈ పర్యాయ సూక్తములచే వృషభమును మంత్రించి శత్రువు ఇంటి మీదకు విడుచునది. ఈ సూక్తములతోనే గుంతలోని నిప్పులో "వలేఖనీం" స్థాణవునకు కట్టి పన్నెండు రాత్రులు సంపాతములను తెచ్చునది.

    అన్నమంత్రములందును 5వ సూక్తపు యొక్క 3, 4 మంత్రములచే ఆదిత్యుని దర్శించునది.

    1. మేము గెలుతుము గాక. భూమిని కలుగుదుము గాక. పాప రహితులము అగుదుము గాక.

    2. మేము చెడుకల కని భీతిల్లినాము. ఆ భయము వదలును గాక.

    3. ఈ భయమును మమ్ము ద్వేషించువారియందు మమ్ము శపించు వారియందు చేర్చుము.

    4. మమ్ము ద్వేషించువారిని, మేము ద్వేషించువారిని ఆ భయము చేరును గాక.

    5. ఉషోదేవి వాక్కుతో కూడి - వాక్కు ఉషోదేవితో కూడి.

    6. ఉషస్పతి వాచాస్పతితో కూడి - వాచస్పతి ఉషస్పతితో కూడి.

    7, 8. వారు ఈ శత్రువు మీదకు దుర్నామ, సదాన్వ, కుంభీక, దూషీక, పీయకులను పంపుదురు గాక.

    9, 10. మేలికతో ఉన్నప్పటి దుస్వప్నములను, కలలో కన్న దుస్వప్నములను, దారిద్ర్యమును, ఫలించని వరములను, ద్రోహుల పాశములను విడుచుచున్నాను.

    11. దేవతలందరు ఆ శత్రువునకు హాని కలిగించవలెను. అతడు షండుడు, భయభీతుడు అగును గాక. సాధువు కాకుండును గాక.


                                        మూడవ పర్యాయ సూక్తము - 7

    1. అభిచారముచే అతనిని అణచుచున్నాను. ఆభూతిచే అణచుచున్నాను. నిర్భూతిచే అణచుచున్నాను. పరాభూతిచే అణచుచున్నాను. గ్రాహ్య పిశాచిచే అణచుచున్నాను. తపస్సుచే అణచుచున్నాను.

    2. వీనిని దేవతల ఘోర, భయంకర ఆజ్ఞల ముందుకు త్రోయుచున్నాను.

    3. వీనిని వైశ్వానరుని కోరలందు పెట్టుచున్నాను.

    4. వారు ఇతనిని అన్నము వలె మ్రింగుదురు గాక.

    5. మమ్ము ద్వేషించు వాని ఆత్మ వానిని ద్వేషించును గాక. మేము ద్వేషించువాని ఆత్మను వాడు ద్వేషించును గాక.

    6. మమ్ము ద్వేషించువారిని ద్యులోక, భూలోక, అంతరిక్షముల నుండి గెంటివేయుచున్నాను.

    7. ఫలానా వాని పుత్రుని, ఫలానావాని దుస్వప్న దోషమును నివారించుచున్నాను.

    8-11. గతరాత్రి చేసిన - జాగ్రదవస్థ, సూప్తావస్థలో చేసిన - పగలు, రాత్రి చేసిన కర్మములచే అతనిని బాదుచున్నాను.

    12. వానిని వధించుము. మందించుము. ప్రక్కటెముకలు విరుచుము.

    13. సమా జీవత్ తం ప్రౌణోజహాతు.

    వాడు జీవించకుండును గాక. వానిని ప్రాణములు విడుచును గాక.


                                     నాలుగవ పర్యాయ సూక్తము - 8

    1.  జితమస్మాక ముద్భిన్న మస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవో స్మాకం ప్రజా అస్మాకం వీరా అస్మాకం.

    జితము మాది. ఉద్భిన్నము మాది. సత్యము మాది. తేజస్సు మాది. మంత్రము మాది. స్వర్గము మాది. పశువులు మావి. యజ్ఞము మాది. ప్రజమాది. వీరులు మావారలు.

    2.  తస్మాదముం నిర్భజామోముమాష్యాయణమముష్యాః పుత్రమసౌయః ||

    అముక గోత్రజుడు అముకుని పుత్రుడగు వానిని ఈ లోకము నుంచి సాగనంపుచున్నాను.

    3.  స గ్రాహ్యాః పాశాన్మా మోచి || వాడు గ్రాహ్య పాశముల నుండి బయట పడకుండును గాక.

    4.  తస్యేదం వర్చస్తేజః ప్రాణమాయుర్ని వేష్టయా మీద మేనమధరాంచం సాదయామి.

    వాని వర్చస్సును, ప్రాణములను, ఆయువును చుట్ట చుట్టుచున్నాను. వానిని బోర్ల పడవేయుచున్నాను.

    5.  1, 2 మంత్రముల తరువాత

    వాడు నిరృతి పాశముల నుండి బయటపడకుండునుగాక. తదుపరి 4వ మంత్రము.

    6.  5 వలెనే - వాడు అభూతి పాశములనుండి విడివడకుండును గాక.

    7.  5 వలెనే - వాడు నిర్భూతి పాశములనుండి బయటపడకుండును గాక.

    8.  5 వలెనే - వాడు పరాభూతి పాశములనుండి బయటపడకుండును గాక.

    9.  5 వలెనే - వాడు దేవజామీన పాశమునుండి విముక్తుడు కాకుండును గాక.

    10.  5 వలెనే - వాడు బృహస్పతి పాశ విముక్తుడు కాకుండును గాక.

    11.  5 వలెనే - ప్రజాపతి పాశ విముక్తుడు కాకుండును గాక.

    12.  5 వలెనే - ఋషుల పాశ విముక్తుడు కాకుండును గాక.

    13.  ఆర్షేయుల పాశ విముక్తుడు కాకుండును గాక.

    14. అంగిరసుల పాశ విముక్తుడు కాకుండును గాక.

    15.  అంగిరుల పాశ విముక్తుడు కాకుండును గాక.

    16.  అథర్వుల పాశ విముక్తుడు కాకుండును గాక.

        13 - 16 - 5 వలెనే

    17.  5 వలెనే -  అథర్వణుల పాశ విముక్తుడు కాకుండును గాక.

    18.  5 వలెనే -  వనస్పతుల పాశ విముక్తుడు కాకుండును గాక. 

    19.  5 వలెనే -  వానస్పతుల పాశ విముక్తుడు కాకుండును గాక.

    20.  5 వలెనే -  ఋతువుల పాశ విముక్తుడు కాకుండును గాక.

    21.  5 వలెనే -  ఆర్తవముల పాశ విముక్తుడు కాకుండును గాక.

    22.  5 వలెనే -  మాసముల పాశ విముక్తుడు కాకుండును గాక.

    23.  5 వలెనే - పోర్ధమాసానాం పాశాన్మా మోచి.

    24.  5 వలెనే -  అహోరాత్రి పాశ విముక్తుడు కాకుండును గాక.

    25.  5 వలెనే -  రాత్రింబవళ్ల సంయుక్త పాశ విముక్తుడు కాకుండును గాక.

    26.  5 వలెనే - పద్యావాపృథివ్యోః పాశాన్మా మోచి.

    27.  5 వలెనే - సఇంద్రాగ్నయోః పాశాన్మా మోచి.

    28.  5 వలెనే - సమిత్రావరుణయోః పాశాన్మా మోచి.

    29.  5 వలెనే - సరాజ్ఞో వరుణస్య పాశాన్మా మోచి.

    30.  5 వలెనే వాడు మృత్యువు పాదబంధక పాశములనుండి విముక్తుడు కాకుండును గాక.


                                అయిదవ పర్యాయ సూక్తము - 9

    1.  గెలిచినది మాది. ఉద్భిన్నము చేసినది మాది. సమస్త శత్రుసేన మా అధీనము అగును గాక.

    2. అగ్ని అదే అనుచున్నాడు. సోముడు అదే అనుచున్నాడు. పూష మాకు పుణ్యలోకములు కలిగించును గాక.

    3. మాకు స్వర్గము కలుగును గాక. కలుగును గాక మాకు స్వర్గము. మాకు సూర్యుని జ్యోతిష్పదము కలుగును గాక.

    4. ధనవంతుడనగు నేను ప్రతిష్ఠ కలుగుటకు గాను మరింత పరమ ధనికుడను అగుదును గాక. ధనమును వశపరచుకొని ధనికుడను అగుదును గాక. దేవా! నాకు ధనము ప్రసాదించుము.

                      దాశరథి రంగాచార్య రచించిన
            శ్రీమదాంధ్రవచన అథర్వవేద సంహితయందలి
                       పదహారవకాండ సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.