Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda



              యస్య నిఃశ్వసితం వేదా యోవేదేభ్యోఖిలం జగత్ |
                నిర్మమే తమహం వన్దే విద్యాతీర్థ మహేశ్వరమ్ ||


                                  పదహారవ కాండము

                                మొదటి అనువాకము

                           మొదటి పర్యాయ సూక్తము - 1


   

     అతిసృష్టో అపాం వృషభో2తిపృష్టా అగ్నయో దివ్యాః ||

 

1.  జలములందు వృషభములు అతిసృష్టములు. అగ్నులందు దివ్యాగ్నులు అతిసృష్టములు అగుచున్నవి.

    వినియోగము :-


    కొన్ని కర్మలందు శాంత్యుదకము చేయు విధానమున్నది. అచట ఆచమనము. ప్రోక్షణము, అవసేచనము, అస్లావనాదులు చేయబడుచున్నవి. ఇది కొన్ని శాంతి సూక్తములచే చేయబడుచున్నది. దానిని కంచుపాత్రచే చేయవలసి ఉన్నది. దీనిని చేయుటకు ముందు ఈ సూక్తముచే జలమును అతిసర్జన చేసి అవకర విసర్జన చేయునది. కాంస్య పాత్రలోని జలమును అవసేచన చేసి దానిచే కాంస్యపాత్రలోపలి మలినములు తొలగించునది. ఇది సాంప్రదాయికాః |

    2.  జరుములందు భంగము చేయునవి, ఎక్కువ భంగము చేయునవి. నశింపచేయునవి, మరింత నశింపచేయునవి కలవు.

    3.  మనసును క్రుంగదీయునవి, త్రవ్వుట వలన లభించునవి, దాహము కలిగించునవి, ఆత్మ దూషితములు, తనూ దూషితములు కలవు.

    4.  నేను వానిని అతిసర్జన చేయుచున్నాను. తాకకున్నాను.

    5.  వానిని మేము ద్వేషించువారి మీదకు మమ్ము ద్వేషించు వారి మీదకు వదులుచున్నాను.

    6. జలములందున్న శ్రేష్ఠ భాగమును సముద్రమునకు పంపుచున్నాము.

    7. బాధకలిగించు, క్షీణింపచేయు, తనూ దూషితమగు జలములందలి అగ్నిని అతిసర్జన చేయుచున్నాను.

    8. జలమా! నీయందు ప్రవేశించిన అగ్ని 'ఘోరంతదేతత్'

    9. ఇంద్ర సంబంధమగు ఇంద్రియములను జలము అభిషించన చేయును గాక.

    10. జలము పాపములను తొలగించును గాక. పాపము మా నుండి తొలగును గాక.

    11. జలము మా పాపములను ప్రవహింపచేసి తీసికొని పోవును గాక. దుస్వప్నములను పూర్తిగా ప్రవహింప చేసికొని పోవును గాక.

    12. జలమా! నన్ను శివేన చక్షుషాపశ్య. శివంకరివై నా దేహము త్వచను తాకుము.

    13. జలములందు గల శుభంకర అగ్నులను ఆహ్వానించుచున్నాము. దేవీ! మా యందు క్షాత్రమును, వర్చస్సును ప్రవేశ పెట్టుము.


                                   రెండవ పర్యాయ సూక్తము - 2

    వినియోగము :-


    అన్యులకు నష్టము కలిగించు అభిచార కర్మ తరువాత అవభృత స్నానము చేసి ఈ సూక్తముచే ఓషధి విశేషములచే తనను అభిమర్శన చేసి కొనునది.

    ఆయుష్కామి ఉపనయనమునందు కుంకుమ, చందన, సర్వ ఓషధ్యాదులచే అలంకరించుకొని అభిమంత్రించునది.

    నేత్రాది అవయవముల దృఢత కోరువాడు అరణ్యము నుండి ఓషధులు తెచ్చి ఈ సూక్తముచే పై నుంచి క్రిందకు లేపనము చేయునది. వికలేంద్రియుడు దీనిని ఆచరించిన సకలేంద్రియుడు అగుచున్నాడు.

    1. దూషిత అక్షి రోగమగు "అర్మ" నుండి విముక్తుడను అగుదును గాక.

    2. నేను మధుమంతుని, నా వాక్కు మధుమతి అగును గాక.

    3. మనసును ఆహ్వానించుచున్నాను. కంఠమును ఆహ్వానించుచున్నాను.

    4. నా చెవులు చక్కగా వినును గాక. భద్రములు వినును గాక. ప్రశంసలు వినును గాక.

    5. నా చెవులు దూరము నుంచి వినును గాక. దగ్గరనుండి వినును గాక. నా నేత్రములు గరుడ నేత్రములు అగును గాక. నిరంతరము జ్యోతిని దర్శించును గాక.

    6. నీవు ఋషుల ప్రస్తరమవు. దైవ ప్రస్తరమునకు నమస్కారము.


                                     మూడవ పర్యాయ సూక్తము - 3

    వినియోగము :-


    బాలకుని ఆయుర్వృద్ధికి 3, 4 సూక్తములచే ఉదయ సూర్యుని ఉపస్థానము చేయునది.

    1. ధనములకు శీర్షమై ఉన్నాను. సమానులందు శీర్షమును అగుదును గాక.

    2. రుజము, యజ్ఞము, మూర్థ, విధర్మ నన్ను విడువకుండును గాక.

    3. ఉర్వము, చమసము, ధరుణ, ధర్తలు నన్ను విడువకుందురు గాక.

    4. విమోకము, ఆర్ద్రసవి, ఆర్ద్రదాను, మాతరిశ్వలు నన్ను విడువకుందురు గాక.

    5. హృదయమును ప్రసన్నము చేయువాడును, మానవులను అనుగ్రహించువాడును అగు బృహస్పతి నా ఆత్మయగుచున్నాడు.

    6. నా హృదయము అసంతప్తమగును గాక. దరిదాపుల భూమి నాది అగును గాక. నేను సముద్రగంభీరుడను అగుదును గాక.


                                       నాలుగవ పర్యాయ సూక్తము - 4

    1. నేను ధనములకు నాభిని అగుచున్నాను. సమానులందు నాభిని అగుదును గాక.

    2. ఉష సుందరముగా ఉన్నది. ఉష మర్త్యులకు అమృతము అగుచున్నది.

    3. ప్రాణములు నన్ను విడువకుండును గాక. అపానములు నన్ను విడిచి దూరము పోకుండును గాక.

    4. సూర్యుడు దినమున, అగ్ని పృథ్విమీద, వాయువు అంతరిక్షము నుండి, యముడు నరుల నుండి, సరస్వతి పార్థివముల నుండి రక్షించును గాక.

    5. ప్రాణాపానములు నన్ను విడువకుండును గాక. నేను పతనము కాకుందును గాక. వ్యక్తమగుదును గాక.

    6. నేడు ఉషస్సు, రాత్రి నాకు శుభప్రదలు అగును గాక. జలములను, సర్వగణములను నేను అనుభవింతును గాక.

    7. పశువులు బలసంపన్నులు అగును గాక. మిత్రావరుణలు నా ప్రాణాపానములకు పుష్టి కలిగింతురు గాక. అగ్ని నాకు దక్షత నిచ్చును గాక.


                                       రెండవ అనువాకము

                                        మొదటి సూక్తము - 5

    వినియోగము :-


    దుస్స్వప్న శాంతికి ఈ పర్యాయ సూక్తముచే ముఖమును శుద్ధము చేయునది. దుస్వప్నము కన్నపుడు దీనిని చదివి మరొక ప్రక్కకు తిరిగి పడుకొనునది. అతి ఘోర దుస్స్వప్నమును చూచినపుడు దీనిచే మిశ్రధాన్య పురోడాశ ఆహుతి ఇచ్చునది. స్వప్నమున అన్నము చూచినపుడు ఈ సూక్తమును చదువునది.

    1.  స్వప్నమా! నీ పుట్టుక నాకు తెలియును. నీవు గ్రాహ్య పిశాచ పుత్రుడవు. యముని చేతివి.

    2.  నీవు అంతకమవు. మృత్యువవు.

    3.  స్వప్నమా! నిన్ను మేము ఎరుంగుదుము. నీవు మమ్ము దుస్వప్నము నుండి రక్షింపుము.

    4.  స్వప్నమా! నీ పుట్టుకను తెలియుచున్నాము. నీవు నిరృతి పుత్రుడవు. యముని కరణమవు.

    5.  స్వప్నమా! నీ పుట్టుకను తెలియుచున్నాము. నీవు అభూతి పుత్రుడవు. యమస్య కరణః.

    6.  స్వప్నమా! నీ పుట్టుకను తెలియుచున్నాము. నీవు నిర్భూతి పుత్రుడవు. యమస్య కరణః.

    7.  స్వప్నమా! నీ పుట్టుకను తెలియుచున్నాము. నీవు పరాభూతి పుత్రుడవు. యమస్య కరణః.

    8.  స్వప్నమా! నీ పుట్టుకను తెలియుచున్నాము. నీవు దేవజామియుల పుత్రుడవు. యమస్య కరణః.

    9.  అన్త కోసి మృత్యురసి ||

    10.  స్వప్నమా! నీవు అటువంటి దానవని మేము ఎరుంగుదుము. మమ్ము దుస్వప్నము నుండి రక్షింపుము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.