Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



        బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప!
        కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః    41

    పరంతపా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల కర్మములను స్వభావ గుణములను బట్టి విభజించబడినవి.

        శమో దమ స్తప శ్శౌచం క్షాంతి రార్జవ మేవ చ
        జ్ఞానం విజ్ఞాన మాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్    42

    అంతఃకరణ, బాహ్యఇంద్రియ నిగ్రహము, శుచిత్వము, క్షమా గుణము, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము బ్రాహ్మణుల స్వభావ కర్మములు.

        శౌర్యం తేజో ధృతి ర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్
        దాన మీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్    43

    శౌర్యము, తేజస్సు స్థిరత, దక్షత యుద్ధమునందు పారిపోకుండట, దానము, ఈశ్వర స్వభావము క్షత్రియుల స్వభావ కర్మలు.

        కృషిగోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్
        పరిచార్యాత్మకం కర్మ శూద్రస్వాపి స్వభావజమ్    44

    వ్యవసాయము, పశుపోషణ, వర్తకము, వైశ్యుల స్వభావ జన్మలు, పరిచర్యలు చేయుట శూద్రుల స్వభావజ కర్మలు.

        స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః
        స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్చృణు    45

    నరులు తమ తమ విధులను చేయుచూ సిద్ధి పొందుదురు. స్వకర్మ నిరతుడు సిద్ధిని పొందు విధమును వినుము.

        యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్        
        స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః    46

    ఎవనిచే జనించు జగము, ఎవని వల్ల నిలచియున్నది. స్వకర్మలు చేసి అతనిని అర్చించి మానవుడు సిద్ధిని పొందుచున్నాడు.

        శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్    
        స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్    47

    పర ధర్మమూ మించినదైనను స్వధర్మమే శ్రేయస్కరము స్వభావమును అనుసరించి చేసిన కర్మల వలన ఎట్టి పాపములు తాకకున్నవి.

        సహజం కర్మ కౌంతేయ! సదోషమపి న త్యజేత్
        సర్వాంభా హి దోషేణ ధూమేనాగ్ని రివావృతాః    48

    కౌంతేయా! సదోషమైనను సహజ కర్మను త్యజించరాదు. అగ్నిని పొగకప్పి యుండును. అట్లే అన్నింటా ఏదో యొక దోషము వుండకమానదు.

        అసక్త బుద్ధిస్సర్వత్ర జితాత్మా విగతస్పృహః
        నైష్కర్మ్య సిద్ధిం పరమా సంన్యాసే నాధిగచ్ఛతి    49

    సర్వత్రా అనాసక్తి తనను గెలుచుట, సన్యాసము వలన నిష్కర్మ సిద్ధిని పొందుచున్నారు.

        సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథా ప్నోతి నిబోధమే
        సమాసేనైన కౌంతేయ! నిష్ఠా జ్ఞానస్య యా పరా    50

    కౌంతేయా! జ్ఞానము యొక్క ఆధిక్యమును, దానివలన బ్రహ్మసిద్ధిని పొందుటను గురించి చెప్పుచున్నాను. వినుము.
    
        బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృతాత్మానం నియమ్యచ
        శబ్దాదీన్ విషయాంస్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్యచ    51
        వివక్తసేవీ లఘ్వాశీ యత వాక్కాయ మానసః
        ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః    52
        అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్
        విముచ్య నిర్మమశ్శాంతః బ్రహ్మభూయాయ కల్పతే    53

    శుద్ధ బుద్ధియుక్తుడు ధైర్యముగా తనను నియంత్రించువాడు. శబ్దాది విషయాలను, రాగద్వేషములను వదలినవాడు.
    ప్రశాంత ప్రదేశవాసి, వియతాహారి. వాక్కు, కాయము, మానసమును నియంత్రించువాడు. ధ్యానయోగపరుడు. నిత్యము వైరాగ్యమును ఆశ్రయించువాడు.
    అహంకారము, బలము, దర్పము, కామక్రోధములను త్యజించి నిర్మమము, శాంతుడు ఐనవాడు బ్రహ్మను పొందుచున్నాడు.

        బ్రహ్మభూతః ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి
        సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్    54

    బ్రహ్మభూతుడగు ప్రసన్మాత్మ శోచింపడు, కోరడు. అన్ని భూతములయందు సమభావము కలిగియున్నవాడు నా భక్తుడు పరమును పొందుచున్నాడు.

        భాక్త్వా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః
        తతో మాంతత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్    55

    భక్తితో నన్ను తెలియుము. తాత్వికముగా తనను తెలియును. అప్పుడు తాత్వికముగా నన్ను తెలిసినవాడు నాలో లీనమగుచున్నాడు.    

        సర్వకార్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్య పాశ్రయః
        మత్ప్రసాదా దవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్    56

    సర్వకర్మలను సదా చేయుచూ నన్ను ఆశ్రయించినవాడు, నా అనుగ్రహము వలన శాశ్వత పదమును చేరుతున్నాడు.

        చేతసా సర్వకర్మాణి మయి సంన్యస్య మత్పరః
        బుద్ధియోగ ముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ    57

    మనసా, సర్వకర్మలను వదలుము. మత్పరుడవు అగుము. బుద్ధియోగమును ఆశ్రయించుము. సతతము నన్నే చిత్తమందు నిలుపుము.

        మచ్చిత్త స్పర్వదుర్గాణి మత్ ప్రసాదాత్ తరిష్యసి        
        అథ చేత్త్వ మహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి    58

    నన్నే చిత్తమందు నిల్పుము. నేను అనుగ్రహింతును. అన్ని ఆటంకములను దాటగలవు. అట్లుగాక అహంకారమున నా మాట వినకున్న నశింతువు.

        యద హంకార మాశ్రిత్య న యోత్ప్య ఇతి మన్యసే
        మిథ్వైవ వ్యవసాయసై ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి    59

    అహంకార వశమున యుద్ధము చేయను అనుకొంటావు. అది మిధ్య నీ స్వభావమే యుద్ధము చేయుట ప్రకృతియే పురికొల్పును.

        స్వభావజేన కౌంతేయ! నిబద్ధః స్వేన కర్మణా
        కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశో పి తత్    60

    కౌంతేయా! స్వభావము స్వకర్మ నిన్ను నిబద్ధించును. నీవు మోహముచే చేయనందువు. అవశుడవయ్యు చేయుదువు.

        ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశే ర్జున! తిష్ఠతి!
        భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా                61

    ఈశ్వరుడు సమస్త భూతముల హృదయాంత రాళములందున్నాడు. అతని మాయచేత సమస్త భూతాలు రంగుల రాట్నము వలె తిరుగుతున్నవి.

        తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత!
        తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్    62

    భారతా! సర్వభావములతో అతనినే శరణువేడుము. అతని అనుగ్రహమున పరమశాంతి స్థానమును శాశ్వతముగా చేరుకొనగలవు.

        ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుణ్యోద్గుహ్యతరం మయా
        విమృశ్యై తదశేషేణ యథేచ్చసి తథా కురు    63

    నీకు రహస్యాతి రహస్యమైన జ్ఞానమును ఉపదేశించినాను. దానిని సంపూర్ణముగా అర్థము చేసుకొనుము. నీకు ఇష్టమైనది చేయును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.