Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



        పృథక్త్వేన తు యద్ జ్ఞానం నానా భావాన్ పృథగ్విధాన్
        వేత్తి సర్వేషు భూతేషు తద్ జ్ఞానం విద్ధి రాజసమ్    21

    సమస్త ప్రాణులందును బహు విధములుగా చూచినది రాజస జ్ఞానము.

        యత్తుకృత్స్నవ దేకస్మిన్ కార్యే సక్త మహైతుకమ్
        అతత్త్వార్థ వదల్పం చ తత్తామస ముదాహృతమ్    22

    శరీరమే సర్వస్వము అనుకొనుట హేతు, తత్వార్థ హితము. అల్పము దానిని తామసమని చెప్పబడినది.

        నియతం సంగరహితం అరాగద్వేషతః కృతమ్        
        అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్త్విక ముచ్యతే    23

    శాస్త్ర విహితము, ఆసక్తి, రాగద్వేషరహితము, ఫలాపేక్ష లేని కర్మ సాత్వికమనబడును.

        యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః
        క్రియతే బహుళాయాసం తద్ రాజస ముదాహృతమ్        24

    సకామము, అహంకారము, అతి ఆయాసమున చేయబడు కర్మ రాజసమన బడుచున్నది.

           

        అనుబంధం క్షయం హింసాం అనపేక్ష్య చ పౌరుషమ్
        మోహాదారభ్యతే కర్మ యత్తత్తామస ముచ్చతే    25

    పరిణామము, హాని, హింస, సామర్థ్యములను తెలియక మంకుగా చేయు కర్మ తామసము.

        ముక్తసంగో - నహింవాదీ ధృత్యుత్సాహ సమన్వితః
        సిద్ధ్యసిద్ధ్యోర్ నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే    26

    అనాసక్తుడు, నిరహంకార భాషి, ధైర్య ఉత్సాహములు గలవాడు, సిద్ధి అసిద్ధిని లెక్కచేయనివాడు సాత్వికకర్త అనబడుచున్నాడు.

        రాగీ కర్మఫలప్రేప్సు లుబ్దో హింసాత్మకో -శుచిః
        హర్షిశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః    27

    అసక్తుడు, కర్మఫలాపేక్షి, లోభి, హింసకుడు, అశుచి, హర్షశోకాన్వితుడు,రాజసకర్త అగుచున్నాడు.

        అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నిష్కృతికో -లసః
        విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే    28

    అసక్తుడు, అశిక్షితుడు, మూర్ఖుడు, లుబ్ధుడు, ఆటంకి, చింతాగ్రస్తుడు, సోమరి, ఆకతాయి, తామసకర్త అనబడుచున్నాడు.

        బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణత స్త్రివిధం శృణు
        ప్రోచ్చమాన మశేషేణ పృథక్త్వేన ధనంజయ!    29

    ఓ ధనంజయా! బుద్ధి, ధృతి, గుణ భేదముల ననుసరించి మూడు విధములు. వానిని విభావములుగా సంపూర్ణముగా చెప్పుచున్నాను. వినుము.

        ప్రవృత్తించ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే
        బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి స్సా పార్థ! సాత్త్వికీ       30

    పార్థా! ప్రవృత్తి నివృత్తులను కార్యాకార్యములను భయాభయములను బంధ మోక్షములను, తెలియునది సాత్వికి బుద్ధి.

        యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ
        అయథావత్ప్రజానాతి బుద్ధి స్సా పార్థ! రాజసీ    31

    ధర్మాధర్మములు కార్యాకార్యములను నిధి రహితముగ తెలియనిది రాజస బుద్ధి.

        అధర్మం ధర్మమితి యా మన్యతే తమసా -వృతా
        సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి స్సా పార్థ! తామసీ    32

    తామసమూర్తి అధర్మమును ధర్మమునును అన్నింటికి విపరీతార్థములు చెప్పును. పార్థా! ఇది తామస బుద్ధి.

        ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియక్రియాః
        యోగీనావ్యభి రిణ్యా ధృతి స్సా పార్థ! సాత్త్వికీ    33

    మనసు ప్రాణేంద్రియ క్రియలను, ధృతివలన ధరించువాడు నిష్కల్మషయోగిది సాత్విక ధృతి.

        యయా తు ధర్మకామార్థన్ ధృథ్యా ధారయతే -ర్జున!
        ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి స్సా పార్థ! రాజసీ    34

    ధర్మార్థ కామములను ధృతివలన ధరించువాడు, ఫలాకాంక్ష గలవాడు రాజసధృతి యగుచున్నది.

        యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ
        న విముంచతి దుర్మేధా ధృతి స్సా పార్థ! తామసీ    35

    దుర్మతియగువాడు స్వప్పము, భయము, శోకము, విషాదము, మదము, వదలనిది తామసీ ధృతి అందురు.

        సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ!
        అభ్యాసా ద్రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్ఛతి    36
        యత్తదగ్రే విషమివ పరిణామే -మృతోపమమ్
        తత్సుఖం సాత్త్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజమ్    37

    భరతర్షభా సుఖము మూడు విధములు. దానిని గురించి వినుము. అభ్యాసము వలన ఆనందిస్తాడు. దుఃఖము యొక్క అంతమును చూస్తాడు. ఏది మొదలు విషము వలె కనుపించి పరిణామమున, అమృతము వంటిదగునో దానిని సాత్విక సుఖము అంటారు. అది స్వబుద్ధి వలననే కలుగుతుంది.

        విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే -మృతోపమమ్
        పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్    38

    ఇది విషయ, ఇంద్రియ సంయోగము వలన కలుగుతుంది. మొదలు అమృతము వలె కన్పించి, పరిణామములో విషమగును. ఇది రాజస సుఖము అగును.

        యదగ్రే చానుబంధే చ సుఖం మోహన మాత్మనః
        నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామస ముదాహృతమ్    39

    ఇది అనుభవించినపుడును, తరువాతను మోహింపచేయునది. నిద్ర, ఆలస్య ప్రమాదములతో గూడిన దానిని తామస సుఖము అనుచున్నారు.

        న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః
        సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్త్రిభిర్గుణైః    40

    భూలోకమున గాని, దేవలోకమున గాని, దేవతలందు గాని ప్రకృతి వలన కలిగిన యీ మూడు గుణములు లేనివాడు ఉండడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.