Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
పద్దెనిమిదవ అధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
అర్జున ఉవాచః
సంన్యాసస్య మహాబాహో! తత్త్వమిచ్ఛామి వేదితుమ్
త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశి నిషూదన! 1
మహాబాహో! కేశవా! మధుసూదనా! సన్యాసతత్వమును త్యాగ తత్వమును తెలియగోరుచున్నాను.
శ్రీ భగవానువాచః
కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం కవయో విదుః
సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః 2
కామ్యకర్మలను వదలుటను, సన్యాసమని విద్వాంసులు తనుచున్నారు. సర్వకర్మలను వదలుటను త్యాగమని విచక్షణులు అనుచున్నారు.
త్యాజ్యం దోషవది త్యేకే కర్మ ప్రాహు ర్మనీషిణః
యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే 3
విద్వాంసులలో కొందరు కర్మలన్నియు దోషయుక్తములే అనియు. త్యజించదగినవే అనియు అనుచున్నారు. యజ్ఞ, దాన, తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరి వాదన.
నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ!
త్యాగో హి పురుష వ్యాఘ్ర! త్రివిధ స్సంప్రకీర్తితః 4
భారత సత్తమా! త్యాగమును గురించి నిశ్చయముగా వినుము. పురుష వ్యాఘ్ర త్యాగము మూడు విధములని చెప్పబడినది.
యజ్ఞ దానం తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్
యజ్ఞో దానం తపశ్చెవ పావనాని మనీషిణైకు 5
తప కర్మలు కార్యములు. అందువల్ల త్యజింపరానివి. మానవులకు యజ్ఞము, దానము, తపస్సు పవిత్రములు.
ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ
కర్తవ్యానీతి మే పార్థ! నిశ్చితం మతముత్తమమ్ 6
పార్థా! ఈ కర్మలు గూడా సంబంధము, ఫలములను త్యజించి చేయవలయునని, నా యొక్క నిశ్చిత ఉత్తమ అభిప్రాయము.
నియతస్య తు సంన్యాసః కర్మణో నోపపద్యతే
మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తత 7
శాస్త్ర విహిత కర్మాచరణమును, వదలుట ఉచితము కాదు. మోహవశమున త్యజించుట తామస త్యాగము అనబడును.
దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్షేశ భయాత్ త్యజేత్
స కృత్వా రజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ 8
కర్మలన్నియు దుఃఖములే అనియు, కాయకష్టఫలమున, వదలినది రాజ సత్యాగము అనబడుచున్నది. దానివలన త్యాగ ఫలము లభించదు.
కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియ - తేర్జున!
సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్త్వికో మతః 9
శాస్త్ర విహితకర్మలను, కర్తవ్యములుగా భావించవలెను. వాటి యందలి ఆసక్తిని ఫలమును త్యజించవలెను. అది సాత్విక త్యాగమని అభిప్రాయము.
సద్వేష్ట్య కుశలం కర్మ కుశలే నానుషజ్జతే
త్యాగీ సత్త్వసమావిష్టః మేధావీ ఛిన్నసంశయః 10
అకుశల కర్మలను ద్వేషించడు. కుశల కర్మలను అనుష్టించును. అట్టివాడు త్యాగి, సత్వగుణ సంపన్నుడు, మేధావి, సంశయ రహితుడు అగుచున్నాడు.
న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీ త్యభిధీయతే 11
మానవులకు కర్మలను పూర్తిగా వదలుట శక్యము కాదు. కర్మఫల త్యాగియై కర్మలను అనుష్టించువాడు, త్యాగి అనబడుచున్నాడు.
అనిష్ట మిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సంన్యాసినాం క్వచిత్ 12
అనిష్టము, ఇష్టము, మిశ్రమము అను మూడు కర్మఫలములుండను. కర్మఫల త్యాగము చేయనివారు, దేహ త్యాగము తర్వాత ఫలమును అనుభవించి తీరవలయును. కర్మఫల త్యాగ మొనరించిన వారికి ఫలముతో నిమిత్తముండదు.
పంచైతాని మహాబాహో! కారణాని నిబోధ మే
సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ 13
మహాబాహో! సర్వకర్మల సిద్ధికి ఐదు కారణములు వున్నవని సాంఖ్యశాస్త్రమున చెప్పబడినది. వాటిని వినుము.
అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్
వివిధాశ్చ పృథక్చేష్టాః చైవాత్ర పంచమమ్ 14
కర్మలు సిద్ధించుటకు స్థానము, కర్త, కారణములు వివిధ చేష్టలు అను నాలుగు. ఐదవది దైవము. ఈ ఐదును హేతువులు అని చెప్పబడినవి.
శరీర వాఙ్మనోభిః యత్కర్మ ప్రారభతే నరః
న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః 15
మానవుడు శరీరము, వాక్కు, మనసులతో కర్మను ప్రారంభించును. అది శాస్త్ర విహితము లేక విపరీతము కావచ్చును. అది సిద్ధించుట ఐదు హేతువులే అగుచున్నవి.
తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః
పశ్య త్యకృతబుద్ధిత్వాత్ న పశ్యతి దుర్మతి 16
అట్లు ఐనప్పటికి కర్త కేవలము తనను నామ మాత్రముగా భావించువాడు జ్ఞాని యగుచున్నాడు. భావించనివాడు అజ్ఞాని.
యస్య నాహం కృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే
హత్వా - పి స ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే 17
అహంకారము లేనివాని బుద్ధి, దేనినీ చేరుకొనదు. ఈ లోకములన్నింటిని హతమార్చినను అతడు బంధరహితుడు అగుచున్నాడు.
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః 18
తెలియుట, తెలియదగినది, తెలిసినవాడు ఈ మూడు కర్మ ప్రేరకములు, కరణం, అక్రమ, కర్త - యీ మూడును కర్మ సంగ్రహములు.
జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి 19
జ్ఞానము, కర్మ, కర్త - యీ మూడు గుణభేదములు ఉన్నవని సాంఖ్య శాస్త్రమున చెప్పబడినది. వానిని వివరించెదను వినుము.
సర్వభూతేషు యేనైకం భావమవ్యయ మీక్షతే
అవిభక్తం విభక్తేషు తజ్ జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ 20
భూతములు విభక్తములు. సర్వభూతములందు అవిభక్తముగా నున్నవాడొక్కడేనని తెలియుట సాత్విక జ్ఞానము అనబడుచున్నది.





