Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
పదహారవ అధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
శ్రీ భగవానువాచః
అయం సత్త్వ సంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవమ్ 1
భయము లేకుండుట, అంతఃకరణశుద్ధి జ్ఞాన యోగము నందు నిలచియుండుట, దానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయ తపము, సరళత్వము.
అహింసా సత్య మక్రోధః త్యాగ శ్శాంతి రపైశునమ్
దయాభూతే ష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ 2
అహింస, సత్యము, అకోధము, శాంతి, నిందించకుండుట, భూతముల విషయములో అనాసక్తి, మెత్తదనము, చాపల్యము, అస్థిరము లేకుండుట.
తేజః క్షమా ధృతి శ్శౌచం అద్రోహో నాతిమానితా
భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత! 3
తేజస్సు, క్షమా, ధైర్యము, శుచి, అద్రోహము, అహంభావ రాహిత్యము, అర్జునా, ఇవి దైవీసంపద లక్షణములు అగుచున్నవి.
దంభో దర్పో -భిమానశ్చ క్రోధః పౌరుష్యమేవ చ
అజ్ఞానం చాభిజాతస్య పార్థ! సంపద మాసురీమ్ 4
కపటము, అహంభావము, దురభిమానము, క్రోధము, పౌరుషము, అజ్ఞానము, ఆసురీ సంపద లక్షణాలు.
దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా
మాశుచ స్సంపదం దైవీం అభిజాతో -సి పాండవ! 5
దైవీ సంపద మోక్షమును ఆశించును. ఆసురీ సంపద బంధ హేతువు అగును. అర్జునా! నీవు దైవీ సంపదలో జన్మించినవాడవు. కాబట్టి శోకించకుము.
ద్వౌ భూతసర్గౌ -స్మిన్ దైవ ఆసుర ఏవ చ
దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ! మే శృణు 6
అర్జునా! లోకమున భూతసర్గములు రెండు అగుచున్నవి.
1. దైవము 2. ఆసురము. దైవీ సర్గమును గురించి విస్తరముగా చెప్పియున్నాను. ఇప్పుడు ఆసురమును గురించి చెప్పుచున్నాను. వినుము.
ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః
న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే 7
పునర్జన్మ మోహమును గురించి, ఆసురీ జనులు ఎరుగరు. వారిలో శుభ్రత, ఆచారము, సత్యము వుండవు.
అసత్య మప్రతిష్ఠంతే జగదాహు రనీశ్వరమ్
అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకమ్ 8
అసత్యము అప్రతిష్ఠ, జగత్తు నిరీశ్వరమనుట, రతియే సృష్టికి కారణమనుట, కామము జగత్తుకు హేతువు అనుట.
ఏతాం దృష్టి మవష్టభయ నష్టాత్మానో -ల్పబుద్ధయః
ప్రభవంత్యుగ్రంకర్మాణః క్షయాయ జగతో -హితాః 9
వీరి దృష్టి అసంబద్ధము వీరు ఆత్మలు లేనివారు. అల్పబుద్ధులు - క్రూరకార్యములకు, క్షయత్వమునకు, జగత్తుకు ఆపదలు తెచ్చుటకు పుట్టుచుందురు.
కామామాశ్రిత్య దుష్పూరం దంభ మాన మాదాన్వితాః
మోహాద్గృహీత్వా - సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః 10
కామము, దుర్మార్గము, దంభము, మదము, మోహమును ఆశ్రయింతురు. తమ వాంఛలను తీర్చుకొనుటకు ప్రయత్నింతురు. అశుచిగా వ్యవహరింతురు.
చింతా మపరిమేయాం చ ప్రలయాంతా ముపాశ్రితాః
కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః 11
చచ్చేవరకు చింతలందే మునిగిపోవుదురు. కామభోగపరులు అదే నిశ్చితమని భావిస్తారు.
ఆశాపాశ శతైర్బద్దాః కామక్రోధ పరాయణాః
ఊహంతే కామభోగార్ధం అన్యాయే నార్థసంచయాన్ 12
వందల ఆశాపాశ బద్ధులు కామక్రోధపరాయణులు కామ భోగము కొరకు అన్యాయముగా ఆర్జింతురు. కూడబెట్టుదురు.
ఇదమద్య మయా లబ్దం ఇమం ప్రాప్స్యే మనోరథమ్
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ 13
ఇది నేను ఆర్జించినది. దీనితో నా కోర్కెలను తీర్చుకొందును. నా వద్ద కావలసినంత ధనమున్నది.
ఇంకను సంపాదించగలను.





