Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ చంద్రమౌళిశాస్త్రి, బెల్లంకొండ
పదండి ముందుకు
ఎవడాద్రోహి!? సుపర్వ పర్వత శిఖాహీరంబు పైచేయి వై
చి వివాదించెడివాడు! మైత్రవమనే చేసాచి నీచాతినీ
చవిధిన్ శాత్రవమూని కయ్యముకు కాల్జాచున్ గృతఘ్నుండెవం
డు! విదారింపుదు చీనిఘోణి మదకండూతిన్ మహాభారతుల్-
సీమాక్షామముపట్టి ద్వేషమున
వచ్చెన్ నల్లమందున్నదన్
ధీమాతో! పరికింపుడీ ఎవరిదో
ధీ రేఖయున్ దాఖలా
నామాల్!! మానవ మానసంబు పయినా,
నాదన్న సోదన్నవా
దామోదంబులు?! దేవతాత్మపయినా,
దర్పాంధ సంబంధముల్?
నలుగురు నోటిలో నుమిసినన్ బిడియం పడ డీత డేతడో
ఖలుడు! పదండి ముందునకు! కండలు చెండిననాడుగాని చెం
పలు చెడవేసికోజనడు! భారత శాంతి భుజంగమేచి నా
ల్కలు వెడరోజు రోజువర కాతడు బోడు! పదండి ముందుకున్!!
కొలువై భారతమాత కోట్లవుశిరాల్, కోటాన కోట్లౌకరాల్
జిలుగుంబంగరు గుండెదండి తనముల్, చిద్రూప కోపోగ్రరే
ఖలవే! ఏకముఖాకృతిన్ బొలిచె దుర్గాదేవియై శత్రుర
క్తలతాంతమ్ములు విచ్చు వెచ్చని అలంకారమ్ము నేడై వడిన్!!
ఏ బౌద్ధం బిది! ఏమి మార్కృజము!
సుంతేనిన్ దయాధర్మక
ర్మాబాధంబులబోని హీనులకు!
దుర్ధర్పంబు దీర్పంగ చీ
నా బాణాసురహస్తముల్ నరుకు
సన్నద్ధుల్ మహారుద్రులై
జీబుల్ గట్టి పురోగమింపుడు
జయశ్రీ దెండు లెండో ప్రజల్!
సభ్యతలేని మానవుడు చచ్చిన, నున్నను, నొక్కటే! దురూ
హేభ్యుని తోడివానిగ సమీక్ష యొనర్చిన భారతీయ వా
ల్లభ్యము గేలికొట్టిన అరాతికిరాత విఘాతుకంబు సం
క్షుభ్యముజేసి తీరువరకున్ విరమింపకురా ధృతవ్రతా!
* * * *





