Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ హనుమచ్ఛాస్త్రి, ఇంద్రగంటి
దొంగలున్నారు జాగ్రత్త!
కన్నతల్లి కైశ్యంలో
కడిముపూవు కైలాసం-
అమలామల మందాకిని
అమ్మహార సువిలాసం-
చీనా దుశ్శాసనునకు
చిక్కిందా తల్లివేణి;
కుటిలవైరి కోరచూపు
కోరిందా మణిహారం.
శాంతి ధర్మ సూత్రాలకు
సత్యాహింసల నీతికి
కట్టువడిన భరతజాతి
వట్టి భీరులనుకుందా?
పిరికి కండలేని నరుల
పురిటిగడ్డ యీ దేశం
పూని 'సాదురేగిన తల
పొలముననే' నిలుచునా?
నెత్తు రుడికెనేని గుండె
నొత్తి మంట లెగసెనేని
నలుబదికోట్ల భుజా లొక
నాడు కత్తులై లేచును.
* * * *





