Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
పదునాల్గవ అధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
శ్రీ భగవానువాచః
పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్
యజ్ జ్ఞాత్వా మునయ స్సర్వే పరాం సిద్ధిమితో గతాః 1
జ్ఞానములందు ఉత్తమమైన పరమ జ్ఞానమును ఇప్పుడు నీకు ఉపదేశించుచున్నాను. దానిని తెలిసిన మునులందరు పరమ సిద్ధిని పొందినారు.
ఇదం జ్ఞాన ముపాశ్రిత్య మమ సాధర్మ్య మాగతాః
సర్గే -పి నోపజాయంతే ప్రళయే న వ్యథంతి చ 2
ఈ జ్ఞానమును ఆశ్రయించినవారు నాకు సారూపులు అగుచున్నారు. వారు సృష్టి మొదట పుట్టరు. ప్రళయమున నశించరు.
మమ యోని ర్మమద్ర్భహ్మ తస్మిన్ గర్భం దధామ్యహమ్
సంభవ స్సర్వ భూతానాం తతో భవతి భారత! 3
నా మూలము మహద్బ్రహ్మమగుచున్నది. సమస్త ప్రకృతిని నేనే బీజమగుచున్నాను అర్జునా! అందువల్లనే సకల భూతసృష్టి జరుగుచున్నది.
సర్వయోనిషు కౌంతేయ! మూర్తయ స్సంభవన్తి యాః
తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా 4
కౌంతేయా! సమస్త యోనులందు జన్మించు ప్రాణులకు నేను మహద్యోనిని అగుచున్నాను. బీజము వేయుచున్నాను కావున, తండ్రిని అగుచున్నాను.
సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః
నిబధ్నంతి మహాబాహూ! దేహే దేహిన మవ్యయమ్ 5
సాత్విక రాజస తామస గుణములు, ప్రకృతి నుండి సంభవించుచున్నవి. అవి దేహమును, ఆత్మను బంధించుచున్నవి.
తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశక మనామయమ్
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ! 6
అర్జునా! వానిలో సత్త్వము నిర్మలము. ప్రకాశవంతము, వికార రహితము అది సత్సాంగత్యము, జ్ఞాన సాంగత్యము వలన కలుగుచున్నది.
రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవమ్
తన్నిబధ్నాతి కౌంతేయ! కర్మసంగేన దేహినమ్ 7
రజోగుణము రాగాత్మకము. కామము ఆసక్తుల నుండి పుట్టినది. అది కర్మ సంగముచేత కల్గుచున్నదని అర్జునా! తెలియుము.
తమ స్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్
ప్రమాదాలస్య నిద్రాభిఃతన్నిబధ్నాతి భారత! 8
తామసము అజ్ఞానమున పుట్టినది. సమస్త జనులకు మోహనము, అర్జునా! ఇది ప్రమాదము, ఆలస్యము, నిద్రల వలన కలుగుచున్నది.
సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత!
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత 9
అర్జునా! సత్త్వము సుఖములందు, రజోగుణము కర్మల యందు కలుగుచున్నవి. తమోగుణము అజ్ఞానము వల్లను కల్గుసున్నది.
రజ స్తమశ్చాభిభూయసత్త్వం భవతి భారత!
రజ స్సత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా 10
ఓ అర్జునా! రాజస్తమోగుణములను అధిగమించి సత్త్వము కల్గుచున్నది. సత్త్వ తమోగుణములను అధిగమించి రజోగుణము కల్గుచున్నది. సత్త్వ రజోగుణములను అధిగమించి తమోగుణము కలుగుచున్నది.
సర్వాద్వారేషు దేహే -స్మిన్ ప్రకాశ ఉపజాయతే
జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్త్వమిత్యుత 11
అత్యుతా! ఈ దేహపు సర్వ ద్వారములందు ప్రకాశము కలుగును. జ్ఞానము కలిగినంత సత్వగుణము వృద్ధి చెందును.
లోభః ప్రవృత్తి రారంభః కర్మణా మశమః స్పృహా
రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ! 12
భరతర్షభా! రజోగుణము వృద్ధి చెందినపుడు లోభము, విషయాసక్తి సకామ కర్మాచరణము, అశాంతి లాలస కల్గుచున్నవి.
అప్రకాశో - ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన! 13
కురునందనా! తమోగుణము పెరిగినపుడు, చీకటి, వివేశ శక్తి నాశనము, ప్రమాదము, మోహము కల్గుచున్నవి.
యదా సత్త్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహాభృత్
తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే 14
సత్వగుణము వృద్ధి చెందినపుడు దేహము చాలించినచో ఉత్తమ విద్వాంసులు చేరు నిర్మలములగు లోకములకు చేరును.
రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే
తథా ప్రలీన స్తమసి మూఢయోనిషు జాయతే 15
రజోగుణమున మరణించిన కర్మసంబంధులలో పుట్టును. అట్లే తమోగుణమున మరణించినచో, మూఢయోనులందు పుట్టుచున్నాడు.
కర్మణః సుకృతస్యాహు సాత్త్వికం నిర్మలం ఫలమ్
రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలమ్ 16
సాత్విక జనులకు సుకృతకర్మల నిర్మల ఫలము లభించును. రజోగుణము వారికి దుఃఖము, తమోగుణముల వారికి అజ్ఞానము ఫలములుగా లభించును.
సత్త్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ
ప్రమాదమోహో తమసః భవతో -జ్ఞాన మేవ చ 17
సత్వము వలన జ్ఞానము రజస్సు వలన లోభము, మోహము; తమోగుణము వలన అజ్ఞానము కల్గుచున్నవి.
ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః
జఘన్య గుణవృత్తిస్థాః అధో గచ్ఛంతి తామసాః 18
సత్వగుణము వారు పైన, రాజసులు మధ్యన, తామసులు క్రిందకు దిగజారుతున్నారు.
నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టా -నుపశ్యతి
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో -ధిగచ్ఛతి 19
గుణములే కర్తలని, త్రిగుణములు తప్ప వేరు కర్తలు లేరని తెలియువాడు నా స్వరూపమునే పొందుచున్నాడు.
గుణానేతా నతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్
జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తో మృత మశ్నుతే 20
ఇట్టి త్రిగుణములను అధిగమించి సంభవించిన వాడు జన్మ మృత్యు జరా దుఃఖముల నుండి విముక్తుడై అమృతమును అనుభవించు చున్నాడు.
అర్జున ఉవాచః
కైర్లింగై స్త్రీన్ గుణా నేతాన్ అతీతో భవతి ప్రభో!
కిమాచారః కథం చితాన్ త్రీన్ గుణా నతివర్తతే 21
ప్రభూ! యీ త్రిగుణాతీతుని లక్షణములేవి? అతని వ్యవహార రీతి ఎట్లుండును? త్రిగుణాతీతుడగుటకు ఉపయమెయ్యది?





