Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



                                     పదమూడవ అధ్యాయము

                                               క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

    అర్జున ఉవాచః

        ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ మేవ చ
        ఏత ద్వేదితు మిచ్ఛామి జ్ఞాన జ్ఞేయం చ కేశవ    1

    ప్రకృతి పురుషులు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము కూడా కేశవా! వీనిని గురించి తెలియదలచినాను.

    శ్రీ భగవానువాచః

        ఇదం శరీరం కౌంతేయ! క్షేత్ర మిత్యభిదీయతే
        ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః    2

    అర్జునా! యీ శరీరాన్ని క్షేత్రము అనుచున్నారు. యీ విషయము తెలిసినవారిని, క్షేత్రజ్ఞుడు అని విద్వాంసులు అంటున్నారు.

        క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత!
        క్షేత్ర క్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ    3

    అర్జునా! నన్ను సర్వక్షేత్రములందు, క్షేత్రజ్ఞునిగ తెలియుము. క్షేత్ర క్షేత్రజ్ఞుల జ్ఞానమే జ్ఞానము అని నా అభిప్రాయము.

        తత్ క్షేత్రం యచ్ఛ యాదృక్చ యద్వికారి యతశ్చయత్
        స చ యో తత్ర్పభావశ్చ తత్సమాసేన మే శృణు    4

    క్షేత్రము అనగానేమి? అది ఎట్టిది? దాని వాకారములు ఏవి? అవి దేని నుండి ఏర్పడినవి? క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు? వీటిని సంగ్రహముగా తెలిపెదను వినుము.
    
        ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్
        బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః    5

    ఋషులు అనేక రీతులుగా చెప్పినారు. వేదములు బహు విధములుగా చెప్పినవి. బ్రహ్మసూత్రములు సైతము హేతుబద్ధముగా నిశ్చయించినవి.
    
        మహాభూతా న్యహంకారః బుద్ధిరవ్యక్త మేవ చ
        ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియ గోచరాః    6

    మహాభూతములు, అహంకారము, బుద్ధి, వ్యక్తము, ఇంద్రియాలు 5+ ఇంద్రియ గోచరాలు 5+ మనసు 1 మొత్తము పదకొండు.

        ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః
        ఏతత్ క్షేత్రం సమాసేన సవికార ముదాహృతమ్    7

    ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, చేతన, ధృతి అను వికారములతో కూడునది సంగ్రహక్షేత్ర స్వరూప.

        అమానిత్వ మదంభిత్వం అహింసా క్షాంతి రార్జవమ్
        అచార్యోపాసనం శౌచం స్థైర్య మాత్మవినిగ్రహః    8

    అహంకారలేమి, డాంబికలేమి, అహింస, క్షమ, ధృతి, గురుపూజ, శౌచము, అంతఃకరణ స్థిరత్వము, మనస్సు, ఇంద్రియ నిగ్రహము.

        ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ
        జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనమ్    9

    ఇంద్రియ వైరాగ్యము, అహంకార రాహిత్యము, జన్మమృత్యు జర వ్యాధులందలి దుఃఖదోషములను దర్శించుట.

        ఆసక్తి రనభిష్వంగః పుత్రదార గృహాదిషు
        నిత్యం చ సముచిత్తత్వం ఇష్టానిష్టోప పత్తిషు    10

    పుత్ర, దార, గృహాదులందు నిత్య అనాసక్తత, ఇష్టానిష్టాదులతో సముచిత్తత్వము.

        మయి చానన్యయోగేన భక్తి రవ్యభిచారిణీ
        వివిక్త దేశ సేవిత్వం అరతి ర్జనసంసది    11

    నాయందు అనన్యయోగ అవ్యభిచారిణీ భక్తి కలిగియుండుట. ప్రశాంత ప్రదేశములో ఉండుట. జన సంపర్కమున అనాసక్తత.

        అధ్యాత్మ జ్ఞాననిత్యత్వం తత్త్వ జ్ఞానార్థ దర్శనమ్
        ఏతజ్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో -న్యథా    12

    నిత్య ఆధ్యాత్మిక జ్ఞానము. తత్వజ్ఞానార్థా దర్శనము - ఇవి జ్ఞానమని చెప్పబడినవి. ఇవి కానిది అజ్ఞానము.

        జ్ఞేయం యత్తత్ర్పవక్ష్యామి యద్ జ్ఞాత్వా -మృతమశ్నుతే
        అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే    13

    అనాది మత్పరం బ్రహ్మ సదసత్తుడు కానిది, తెలియదగినది నీకుపదేశించుచున్నాను. అది తెలిసి అమృతత్వమును అందుకొనగలవు.

        సర్వతః పాణిపాదం తత్ సర్వతో -క్షిశిరోముఖమ్
        సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి    14

    ఆ పరమాత్ముని చేతులు, కాళ్ళు, కనులు, చెవులు, శిరస్సులు ముఖములు సర్వత్ర స్థితములైయున్నవి. స్వామి సర్వవ్యాపి.

        సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితమ్
        అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ    15

    స్వామి సరేంద్రియ వివర్జితుడైనను, సరేంద్రియ గుణగ్రాహి. ఆసక్తిరహితుడు ఐనను సర్వమును పోషించువాడు. నిర్గుణుడు అయినను గుణములు గలవాడు.

        బహిరంతశ్చ భూతానాం ఆచరం చరమేవ చ
        సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాన్తికే చ తత్    16

    చరాచర ప్రాణులందరిలోను బైటను ఉన్నవాడు, సూక్ష్మరూపుడు. కావున తెలియరానివాడు, దూరము నుండియు దగ్గర నుండియు కనుపించనివాడు.

        అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్
        భూతభర్తృ చ తద్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ    17

    స్వామి అవిభక్తుడు, ఐనను సమస్త భూతములందు విభక్తుడై నున్నవాడు. అతడు సమస్త భూతములను పోషించువాడు. లయ కారకుడుగా తెలిసికొనుము.

        జ్యోతిషామషి తజ్జ్యోతిః తమసః పరముచ్చతేస
        జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్    18

    సూర్యుని మించిన జ్యోతి. అంధకారమును దూరము చేయువాడు. జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యము అందరి హృదయములందు వుండువాడు.

        ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః
        మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే    19

    ఇంతవరకు క్షేత్రము, జ్ఞానము, జ్ఞేయము గురించి సంక్షిప్తముగా చెప్పినాను. దీనిని గురించి గ్రహించిన నా భక్తుడు నా స్వరూపమునే పొందుచున్నాడు.

        ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి
        వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసంభవాన్    20

    ప్రకృతి పురుషుడు అనునవి పురాతనములు. సనాతనములు. వికారాది గుణములు ప్రకృతి నుండియే ఉత్పన్నము ఐనవి అని తెలియుము.

        కార్యకారణ కర్తృత్వే హేతుః ప్రకృతి రుచ్యతే
        పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురచ్యతే    21

    కార్యకారణముల ఉత్పత్తితో ప్రకృతియే సాధనము. సుఖదుఃఖములు అనుభవించుటకు జీవాత్మయే కారణము కాదు.

        పురుషః ప్రకృతి స్థోహిభుంక్తే ప్రకృతి జాన్ గుణాన్
        కారణం గుణ సంగో -స్య సదసద్యోని జన్మసు    22

    పురుషుడు ప్రకృతి నుండి పుట్టుచున్నాడు. అతడు ప్రకృతి గుణాలనే అనుభవించు చున్నాడు. ప్రకృతి, పురుషుడు వీటి గుణసాంగ్యమే ఉత్తమ, అధమ జన్మలకు కారణము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.