Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ సుబ్బరామశాస్త్రి, పైడిపాటి
నెత్తుటేరు
నెత్తురు టేరులు పారనీ
కుత్తుకలే తెగిపోవనీ
మా దేశం మేం రక్షిస్తాం
మా దేశం మేం రక్షిస్తాం.
కొండలలో చలిబండలలో
ఎండలలో మరి ఏడనైన
గుండెలు తీసిన బంటులనైన
గుండెలు చీల్చి దండిస్తాం
గుండుదెబ్బకు లొంగం - వైరుల
గుండెలొ గుండులు ప్రేలుస్తాం
ఎత్తుగ జెండా ఎగరేస్తాం
మొత్తం వైరుల మొత్తేస్తాం
మా దేశం మేం రక్షిస్తాం
మా దేశం మేం రక్షిస్తాం.
ముందు మొనను నిలువరా
పందవోలె పారకురా
బందిపోటు దొంగ వట్టి
బందీగా చేయరా
భారతీయ సోదరా!
పరుగిడి వే పదవేరా
వీరుడవై ధీరుడవై
ధీరుడవై శూరుడవై.
విజయము నీదేరా
వీరస్వర్గ మున్నదిరా
గజగజ లాడించి వైరి
గజిబిజి గావించవేర?
ఝణతు ఝణాం
ఝణతు ఝణాం
ఝణ ఝణ యని
సాగరా?
గణ గణ గణ
గణ గణ గణ
గంటలు మ్రోగేనురా! ||ముందు||
మేటి భారతీయుడా! కి
రీటి వౌచు సాగరా
దేవదత్త మొత్తరా
నీ వైరి మొత్త మొత్తరా!
ఉత్తరమున పగఱజూచి
హుంకరించి నడువరా!
ఎత్తి వచ్చువారి నిట్టె
ఉత్తరించరా!
గాండీవమె చాలునో
కావలెనో పాశుపతము
గండరించినట్టి యరుల
చెండి చెండి విడువరా!
కండ కలిగి నడువరా!
కొండ పిండి సేయరా!
నీ కెదురటరా- అడ్డ
మాక లేక సాగరా! ||మేటి||
* * * *





