Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



                                                      శ్రీ సుబ్బన్న, సి.వి.

    చైనా తిరోగతి

    గగనోద్ఘర్షి తుషార శేఖరము
        గంగా మంగళాంభః ప్రచా
    ర గరీయః పటు జటా జూట
        విలసత్ప్రాలేయ రుక్ఖండ స
    మ్య గహీనాభరణుండు శంకరుడు
        గేస్తైకాపురంబున్న చో
    టు గణేయంబగు దేవతాత్మ
        గిరి తట్టుంజేరె రక్షస్తతుల్.

    పరమ నిర్వృతి వైభవ స్ఫురితవృత్తి
    మురిసి స్వారాజ్య సౌఖ్యానుభూతి బెరసి
    స్థిర సమాధి నిర్మగ్నుడై తేజరిల్లు
    స్వామి శాంత గంభీర భావమును దలచి.

    కవిసిన ఆద్యపుం బొరల గన్నులు
        నెత్తికి వచ్చి కొమ్ము టే
    న్గువలె జెలంగి, మంచు మలకున్
        వెనుకం బడియున్న రక్కసుల్
    బవరమొసంగి, యామికుల
        బాఱగద్రోలి, శతఘ్ని నాళికా
    గ్ర వమ దనర్గళాగ్ని విధురమ్ముగ
        నార్చి పరాక్రమించినన్.

    పరమంబైన ప్రశాంత భావ మెడగా
        ఫాలమ్మునం దాగ్న వి
    స్ఫురణం బేర్పడి కన్బొమల్
        ముడివడన్ జూచెన్ త్రిశూలాయుధుం
    డరదౌ స్వామి సమాధి భంగ కలనా
        వ్యగ్రస్వనం బేదెసన్
    విరిసెన్ దద్దిశ జూచె నందియు
        సమానీతాద్భు తాక్ష్యుద్ధతిన్.

    మఱియును జూచె దృష్య దభిమాన
        పురస్కృత హుంకృతి ప్రచం
    డరవ విధూత శార్వర గణాల్ప
        వలాహక లేఖగా జెవుల్
    పొరి బొరి నిక్క, గిట్టలను భూమి
        చలింపగ నేల రాయుంచున్
    తిరుగుచు గన్గెలంకుల
        నుదీర్ణ మసృగ్రుచి బింక మొప్పగన్.

    ఇంతలో మఱింత బలమ్మునేచి యెఱచి
    తిండిమూక వికటహాస చండిమ నెస
    రేగి పైపై శతఘ్నులు ప్రేల్చికొంచు
    గడచిరా నంతకంతకు గడుసుదేలి.

    ఖర ఖుర పుట ఘట్టనముల
    భరితః పరివల్ల దుగ్ర వాలాగ్రమునన్
    దురితోద్యములన్ జమరుచు
    దిరుగంగొట్టుచును నంది తీండ్రించుటయున్.

    శక యవన బర్బర పులిం
    ద కిరాతాభీర ముఖ్య నానా విలయ
    ప్రకట కృపీట భవాకృతు
    లు కోటులు జనించి దిక్కులు గదల నడరెన్.

    అడరిన విశ్వతోముఖ మహాయుధ
        పాణి చమూ సమూహపుం
    బొడవును గాంచి, డొంకలను బొంచిన
        దుర్జనసేన వెన్కకున్
    నడచినదయ్యె, నద్ధతి చన్ దనయంత;
        నదేమి చిత్రమో!
    పడుట నిజంబకాదె మితిపట్టని
        యుచ్చ్రయభావ మందినన్.

                                            *  *  *  *




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.