Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ సుప్రసన్నాచార్యులు, కోవెల
రక్ష
ఈశ్వరుని ఇంటిపైకి దండెత్తియున్న
క్రొత్త దానవు నిర్జించుకొరకు నవ వ
ధూనయన దీప్తి కెడమైన దోర్బలునకు
పార్వతీదేవి నయన దీపములు రక్ష!
మనుజుల పురాణ సంస్కృతి మధువు లొలికె
అటకు దండెత్తివచ్చె నీ యాత్మహంత
అతని నిలువున దహియింప నరుగునీకు
భారతీదేవి వాగ్వజ్రభాతి రక్ష!!
వృత్రుడేచును మహిషుడై యితడు మరల
వచ్చె నీతని హరియించువరకు సర్వ
సౌఖ్యములు వీడి అనిసేయు సాహసునకు
భార్గవీదేవి స్మితకాంతి పరిధి రక్ష!!!
* * * *





