Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ సీతారామశర్మ, కోట
ప్రళయోర్మి
చలిమల చెంతగాదె సుమ
సాయకు డేచి యురుల్ బిగించబోన్
నిలువున బుగ్గియయ్యెను త్రి
నేత్రుడు నిప్పులు గుప్పునంత ఆ
తొలికత మాదు డెందముల
దొర్లె సరే, చయినా పిశాచి 'చౌ'
తలువకు పండె పాప మిక
ధూర్త దురంత దురాశ త్రెళ్లగన్!
నలుబదికోట్ల పైబడు జ
న మ్మొకటాయెను భారతాత్మగా
నిలచె మహోద్ధతిన్ పెలుచ
నింగిని ముట్టు మహాబ్దవీచియై
నలుగడ చుట్టి "దుష్ట చయి
నా" తుదముట్టగ మట్టుబెట్టు ఈ
ఇల కలుషాత్ము చైదముల
కెల్ల వినాశము తప్ప దెప్పుడున్.
'ఒక్కని కెన్మిదై' మడియ
ఉగ్ర భయావహకేళి సల్పు మా
నిక్కపు టుక్కువీరులు - ఘ
నీభవ ధైర్యతరోరు మూర్తులై
ఉక్కణగింత్రు గ్రక్కున -మ
హోద్ధతి నెక్కొని తుక్కుతుక్కుగా
ప్రక్కలు ముక్క చెక్కలుగ
పాపపు పుట్టుల మిమ్ము చైనియా!
తరతరాల నరనరాల తగులుకొన్న
నల్లమందు మత్తులు నెత్తి నల్లుకొనెనె?
హద్దు పద్దులేని కుటిల క్రుద్ధబుద్ధి!
మచ్చరాల మ్రుచ్చా! ఇంక చచ్చితివిలె.
బారుల మోహరిం చరుల
మార్కొని-మూర్కొని వారి రక్తముల్
పారగ జేసి మీరు చని
వారిత సాహస శక్తియుక్తు లే
పారగ ప్రాణ మాన ధన
మాత్మలనెల్ల పణమ్ము బెట్టుచున్
భారతికిన్ స్వరాజ్య పరి
పాలన నిల్పెడు భారతీయులున్.
ఆభరణము లేవి? ఆయుధముల బూని
తే! వీరనారి! ఇదేమి కతము?
అనురాగ మేదయ్య? ఆగ్రహావేశ పూ
రితుడవో యువకుడ! కత మదేమి?
బోసినవ్వు లెచట? ఫూత్కార భీకరా
కార తాతయ్య! ఏకతమొ ఏమొ
తప్పుటడుగు లేవి? ధర క్రుంగ చెంగు చెం
గన వత్తె పాపకతన మదేమి?
ధర్మవీర రసస్ఫూర్తి తాండవించు
కర్మభూమిపై ఊర్జితోగ్రాగ్రహమ్ము
ప్రళయ విలయాత్త నాట్య సంరంభ మిద్ది
దుష్టచైనా నికృష్టుపై దూకు డూర్మి.
* * * *





