Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



    శ్రీ రామానుజ చరితామృతం నుండి భక్తిగాథ

    విజ్ఞాపనం యదిద మెద్యతు మామకినం అజ్గీకురుష్వ యతిరాజ! దయామ్బురాశే|
    అజ్ఞోయ మాత్మగుణలేశ వివర్జితశ్చ తస్మా దనన్యశరణో భవతీతి మత్వా ||

    ప్రేమ - భక్తి

    ప్రేమ భగవత్ స్వరూపం. ఈశ్వర స్వరూపం విశ్వ స్వరూపం.
    నేటి సాహిత్యంలో - సినిమాల్లో, టీవీల్లో కనిపించేది 'లవ్' మాత్రమే. ప్రేమ మాత్రం కాదు. అది కామం, అవసరం, సెక్సు, మోసం.
    భారత సంప్రదాయం మహత్తరం. ఇంత బూతు వ్యాపారం జరుగుతున్నది.
    అయినా భారత యువతలో - అధిక సంఖ్య - నిగ్రహం కలిగి ఉంది!
    పాశ్చాత్యం పచ్చి బూతు. తల్లి బిడ్డను ప్రేమించదు!
    పాశ్చాత్యం పశు పక్ష్యాదుల నుంచి చాలా నేర్చుకోవలసి ఉంది!
    తెల్లనివి అన్నీ పాలు కావు.
    చిన్నల విషయంలో ప్రేమ వాత్సల్యం అవుతుంది. సత్యము = దూడ, పశువులు దూడను మాత్రమే ప్రేమించగలవు - ప్రాణాలు ఇవ్వగలవు!
    అందునుంచే వాత్సల్యం.
    సమానులైన వారిలోనిది ప్రేమ ఇది కేవలం స్త్రీ పురుషల మధ్యనే కానక్కరలేదు. సోదర ప్రేమను భరత లక్ష్మణులు ఆదర్శం. పంచపాండవులు అంతే పెద్దల విషయం ప్రేమ భక్తి నూతన భక్తి దైవ భక్తి. దేశభక్తి.
    బంగారం ఒకటే - రూపాలు అనేకం. ప్రేమ సహితం అంతే!
    సృష్టి ప్రేమ మీద ఆధారపడి వుంది.
    ప్రేమ త్యాగం ఆశిస్తుంది. పశుపక్ష్యాదులు సహితం సంతానం కోసం త్యాగాలు చేస్తాయి. ప్రతిఫలం ఆశించవు.    
    తల్లి ప్రేమకు అవధులు ఉండవు!
    ప్రేమయే ఆనందం పరిధి పెరుగుతుంది. కుటుంబం - ప్రాంతం - దేశం - మానవాళి ఒకదినిని మించినది మరొకటి. చివరిది పరమానందం!
    పరమాత్ముని విషయంలో నిష్కామ భక్తి బ్రహ్మానందం!
    శ్రీమద్రామానుజ ముని ఒక ప్రేమ జంటను శ్రీరంగనాథుని భక్తాగ్రేసరులనుగా మార్చారు. ఆ మధుర గాథయే హేమవతీ - ధనుర్దాసులు, అమల అమరగాథ!

           

    హేమవతి - ధనుర్దాసు
        
    నిచులాపురం తమిళ ప్రాంతంలోని ఒక రాజ్యం. ధనుర్దాసు ఆ రాజ్యంవాడు. అతడు యువకుడు. స్ఫురద్రూపి, బలశాలి. మల్లయుద్ధ ప్రవీణుడు.
    రాజు ధనుర్దాసు బలాన్ని - గుణగణాలను చూశాడు. తనకు అంగరక్షకుడుగా నియమించుచున్నాడు.
    ధనుర్దాసు రాజు ఉద్యోగి అయినాడు. రాజ్యంలో మంచి పేరు తెచ్చుచున్నాడు. 'మంచివాడు' అనిపించుకున్నాడు.
    నిచులాపురంలో ఒక వేశ్య. ఆమె కూతురు హేమవతి. ఆమె అందాలరాశి పుత్తడిబొమ్మ. వేశ్యమాతది అందపు వ్యవహారం - వర్తకం. కూతురు హేమవతి అందాన్ని పసిడిగా మార్చుకుందామని గంపెడు ఆశ పెంచుకుంది.
    హేమకు ఉండకూడని - మనసు ఎదలో చేరింది. వృత్తిలోనికి దిగదలచలేదు. ఒకే పురుషునితో జీవితం పంచుకోవాలని ఆశపడింది.
    కాని వేశ్యకు అంతటి అదృష్టం అందదు. సమాజం వప్పదు. సభ్య సమాజం నుండి ఏ మగాడు సాహసించడు.
    హేమ మీద తల్లి ఒత్తిడి కొండయై కూలుతున్నది.

    శ్రీ రంగనాథుడే అనుగ్రహిస్తే అందనిదేది?

    ఒక శుభదినాన వేశ్యమాత హేమను రాజప్రసాదానికి తీసుకెళ్ళింది. ఆమెను ధరుర్దాసు చూశాడు. హేమ సౌందర్యానికి - ముఖ్యంగా విశాల నేత్రాలు -చూశాడు మూర్చపోయాడు.
    అతనికి హేమయే! అన్యం కనిపించనే లేదు.
    ఆమె తిరిగి వస్తుంది. అట్లని కళ్ళలో వత్తులు వేసుకొని వేచినాడు.
    పున్నమి వలె - వసంతం వలె - మలయమారుతం వలె హేమ వచ్చింది. ధనుర్దాసు ప్రాణం లేచి వచ్చింది.
    హేమ అతన్ని చూసింది. మల్లెలు రాలాయి!
    అతడు మల్లెలు ఏరలేదు. చూపుల పూలబాణం విసిరాడు.
    ఆమె మురిసింది. చిరునవ్వు నవ్వింది. వెన్నెల కురిసింది.
    వారి చూపులు మాట్లాడుకున్నాయి. వ్రాసుకున్నాయి. ఆ భాష మనకు తెలియదు. ఆ లిపికి అక్షరం లేదు.
    ఇరువురి మనసులు వికసించాయి.
    ఆమె తన మనసు వదిలి వెళ్ళింది. అతని మనసును కొంగును కట్టుకుంది.
    గెలుపు ఎవరిది? ఇద్దరిదీ కాదు! ఇద్దరిదీ ఓటమియే!




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.