Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ సింగరాచార్య, శేషభట్టర్
లేరా భారత వీరా!
లేరా భారత వీరా! లేరా భారత పోరా!
లే-లేరా భారత పోరా!
దురాశతోడుత చైనా జరిపెడి
దురాగతాలను రూపుమాపి యా
పరాయిదేశపు కిరాతమూకల
బిరానపోయి తరిమికొట్టగా ||లేరా||
ధారాళముగా విరాళములను
రక్షణనిధికై తక్షణ మిచ్చి
నరాల రక్తపు కణాల నిచ్చి
నిరూపింపు నీ దేశపు భక్తిని ||లేరా||
వెలగల బంగరు నగలనుగాని
చలి పోగొట్టెడు వలువలు గాని
పలురకముల నీ కొలది సహాయము
సల్పినిల్పు నీ దేశపు హద్దుల ||లేరా||
వీరులెందరో పుట్టినారు మన
భారతదేశపు పవిత్రభూమిలో
కురుక్షేత్రమున గూల్చెను పగతుర
వెఱపు లేక వీరాభిమన్యుడూ ||లేరా||
బలిగొనె శత్రుల
బాలచంద్రుడు
ఏకఛత్రమున నేలె శివాజీ
రణవీరుడు మన రాణా ప్రతాపు
మరచిపోకు మన అజేయశక్తిని ||లేరా||
* * * *





