Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ సాంబశివరావు, పోతుకూచి
నేటి మన కర్తవ్యం
చైనా పద్మవ్యూహాలు
జగత్తుకే ఒక సవాలు
ఆయుధం చేపట్టి గట్టి పట్టుతో
ఆహవానికి సిద్ధపడేవాని
మానసిక బలాన్ని
మరలించే యత్నమే
మారణ యుద్ధం
మానేశా మనడం -
రాజనీతి గాజునీతిలా
రాయిదెబ్బకే రాలిపోతే
నక్కజిత్తుల నంగనాచి దేశం
ఎక్కడికి పోతుంది చిక్కకుండా?
కోటికి పడగలెత్తడం
కాదు మన కర్తవ్యం
కోటలా నేడు దేశాన్ని
రక్షించడం మన కర్తవ్యం
చైనా పద్మవ్యూహాలు
జగత్తుకే ఒక పెద్ద సవాలు.
* * * *





