Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
వాయుర్యమో -గ్నిర్వరుణ శ్శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ!
నమో నమస్తే స్తు సహస్రకృత్వః పునశ్చభూయో -పి నమోనమస్తే 39
నీవు వాసుదేవుడవు. యముడవు. అగ్నివి. వరుణుడవు. చంద్రుడవు. ప్రజాపతి బ్రహ్మవు. బ్రహ్మకు జనకుడవు. నీకు వేలకొలది నమస్కారములు. మరల మరల నమస్కారములు.
నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమో -స్తుతే సర్వత ఏవ సర్వ
అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వ సమాప్నోషి తతో - సి సర్వః 40
స్వామీ! నీకు ఎదుటి నమస్కారము. వెనుక నమస్కారము. నీవే సర్వత్ర వున్నవాడవు. అనంతుడవు. బలశాలివి. అమిత విక్రముడవు. నీవు సర్వము పోషించుచున్నావు. నీవే సర్వము అగుచున్నావు.
సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ! హే యాదవ! హే సఖేతి!
అజానతా మమిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి 41
యచ్చాపహాసార్థ మసత్కృతో -సి విహార శయ్యాసన భోజననేషు
ఏకో -థవాప్యచ్యుత తత్సమక్షం తత్ క్షామయేత్వామహమప్రమేయమ్ 42
మిత్రుడవని పొరపాటునగాని, నీ మహిమలు తెలియకగాని, ప్రమాదమునగాని, ప్రణయమునగాని నేను హే కృష్ణా! హే యాదవా! హే సఖా అని యుండవచ్చును.
అపహాస్యమున గాని, విహార, శయ్యా, భోజన వేళలగాని అట్లని అని వున్నచో దానిని క్షమించుము. నీవు అప్రమేయుడవు.
పితా - సి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్
నత్వత్సమో - స్త్యభ్యధికః కుతో - న్యః లోకత్రయే - ప్యప్రతిమప్రభావ! 43
చరాచర లోకమునకు తండ్రివి. పూజ్యుడవు. గురువులకు గురువుడవు నీతో సమానుడుగాని అధికుడుగాని ఎట్లుండును? ముల్లోకములలో నీ ప్రభావము కనిపించుచునేయున్నది.
తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయకాయం ప్రసాదయే త్వామహ మీశమీడ్యమ్
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ 44
అదృష్టపూర్వం హృషితో స్మి -దృష్ట్యా భయేన చ ప్రవ్యథితం మనో మే
తదేవ మే దర్శయ దేవ! రూపం ప్రసీద దేవేశ! జగన్నివాస! 45
ఈశ్వరా! మహాత్మా! అందువలన నమస్కరించి, సాష్టాంగపడి, అర్థించుచున్నాను. తండ్రి కుమారునివలె, పితృ మిత్రునివలె, ప్రియుడు ప్రేయసిని వలె క్షమింపుము.
పూర్వము దర్శించనిది దర్శించి సంతోషించినా భయమున నా మనసు ఊగిస లాడినది. కావున దేవేశా! జగన్ని వాసా! నీ దేవ రూపమును నాకు దర్శింపచేయుము.
కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామిత్వాం ద్రష్టుమహం తథైవ
తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో! భవవిశ్వమూర్తే! 46

కిరీటివి, గదా చక్రహస్తుడవు అగు నిన్ను దర్శించుటకు ఆతురత పడుచున్నాను. సహస్ర బాహు! విశ్వమూర్తీ! నీ చతుర్బుజ రూపమును చూచుటకు గూడా తొందరపడుచున్నాను.
శ్రీ భగవానువాచః
మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్
తేజోమయం విశ్వమనంత మాద్యం యన్మే త్వదన్యేన న దృష్ట పూర్వమ్ 47
అర్జునా! నేను ప్రసన్నుడనైతిని. ఆత్మయోగమున నీకు పరమ రూపమును దర్శింపచేసినాను. అది తేజోమయము. విశ్వము అనంతము, ఆద్యము ఇంతవరకు అన్యులు దర్శింపనిది.
న వేద యాజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః
ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర! 48
వేద యజ్ఞముల వలన గాని, దానము, కర్మలు, తపస్సులు చేసిన వారికిగాని లభించని నా రూపమును, నరలోకములో దర్శింపచేసినాను. అర్జునా! నీకు తప్ప మరొకరికి అట్టి అవకాశము లభించదు.
మా తే వ్యథా మా చ విమూఢభావః దృష్ట్యారూపం ఘోరమీదఙ్మమేదమ్
వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్యం తదేవ మే రూపమిదం ప్రపశ్య 49
నా భయంకర రూపమును చూచి, నీవు బాధపడరాదు. మోమపడరాదు. ప్రియతమ నస్కుడవగుము. భయము వీడము మరల అదే రూపమును దర్శించుము.
సంజయ ఉవాచః
ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్యా స్వకం రూపం దర్శయామాస భూయః
అశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునస్సౌమ్యవపుర్మహాత్మా 50
వాసుదేవుడు, అర్జునునితో ఆ విధముగా అన్నాడు. తన స్వరూపమును మరల దర్శింపజేసినాడు. మహాత్ముడైన కృష్ణుడు మరల సౌమ్యుడు అయినాడు. భయపడిన అర్జునుని ఓదార్చినాడు.
అర్జున ఉవాచః
దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన!
ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః 51
జనార్ధనా! సౌమ్యమగు నీ మానుష రూపమును దర్శించినాను. మనస్సు స్థిమితపడినది. నా సహజ రూపమునకు చేరుకున్నాను.





