Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



                                పదకొండవ అధ్యాయము

                                     విశ్వరూపదర్శన యోగము

    అర్జున ఉవాచః

        మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితమ్
        యత్త్వ యోక్తం వచస్తేన మోహూ -యం విగతో మమ  1

    కృష్ణా! నన్ను అనుగ్రహించినావు. రహస్యములైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించినావు వానివలన నా మోహము తొలగిపోయినది.

        భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా
        త్వత్తః కమలపత్రాక్ష! మహాత్మ్య మపి చావ్యయమ్  2

    కృష్ణా! సమస్త ప్రాణుల ఉత్పత్తిని విన్నాను. ప్రళయమును విన్నాను. శాశ్వతమైన నీ మహిమలను విన్నాను.

        ఏవమేతద్యథా - త్థత్వం ఆత్మానం పరమేశ్వర!
        ద్రష్టు మిచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ!  3

    పరమేశ్వరా! నీవు చెప్పినదంతయు సత్యము ఇందు సందేహమునకు తావు లేదు. ఐనను పురుషోత్తమా! జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్యతేజో మహితమైన నీ షడ్గుణ ఐశ్వర్య, సంపన్న రూపము ప్రత్యక్షముగా దర్శించదలచినాను.

        మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో!
        యోగేశ్వర! తతో మే త్వం దర్శయాత్మాన మవ్యయమ్  4

    యోగీశ్వరా! ప్రభూ నన్ను అర్హునిగా భావించినచో శాశ్వతమైన నీ దివ్య రూపమును నాకు దర్శింప చేయుము.

    శ్రీ భగవానువాచః

        పశ్య మే పార్థ! రూపాణి శతశో - థ సహస్రశః
        నానావిదాని దివ్యాని నానావర్ణాకృతీని చ  5

    పార్థా! నా రూపమును దర్శింపుము. అది వందలు వేలు నానా విధములు, దివ్యములు, నానా వర్ణాకృతులు.

        పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్విన్ మరత స్తథా
        బాహు న్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత!  6

    భారతా! ఆదిత్యులను, వసువులను, రుద్రులను, ఆశ్వనులను మరి యింతకు పూర్వము చూడని వానిని అనేకములను ఆశ్చర్యకరములను దర్శింపుము.

        ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్
        మమ దేహే గుడాకేశ! యచ్చాన్య ద్ద్రష్టుమిచ్ఛసి  7

    ఇదిగో యిక్కడ ఒకేచోట జగత్తును, సమస్త చరాచర సృష్టిని దర్శించుము. అర్జునా! నా దేహమున మరియేమి దర్శించదలచినావో వాటిని దర్శించుము.

        న తు మాం శక్యసే ద్రష్టుం అనేనైన స్వచక్షుషా
        దివయం దదామి తేచక్షుః పశ్యమే యోగమైశ్వరమ్  8

    నీ దృష్టితో నా రూపమును దర్శింపలేకున్నావు. నీకు దివ్యదృష్టిని ప్రసాదించుచున్నాను. ఈశ్వరీయమగు యోగశక్తిని దర్శించుము.

    సంజయ ఉవాచః

        ఏవముక్త్వా తతో రాజన్! మహాయోగేశ్వరో హరిః
        దర్శయామాస పార్తాయ పరమం రూపమైశ్వరమ్  9

    రాజా! మహాయోగీశ్వరుడగు హరి యిట్లు అన్నాడు. పరమ, రూప, ఐశ్వర్యమగు రూపమును పార్థునకు దర్శింపచేసినాడు.

        అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనమ్
        అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్  10

    అనేక ముఖములు, అనేక నేత్రములు,అనేక అద్భుత దర్శనములు, అనేక దివ్యా భరణములు, అనేక దివ్యాయుధములు ధరించినవాడు.

        దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనమ్
        సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖమ్  11

    అనేక దివ్యమాలలు ధరించినవాడు. దివ్యగంధమును పులుముకున్నవాడు, దైవము సర్వాశ్చర్యమయుడు. అనంతుడు. విశ్వతోముఖుడు.

        దివిసూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా
        యదిభాస్సదృశీ సా స్యాద్భాస స్తస్య మహాత్మనః  12

    ఆ మహాత్ముని తేజస్సు, ఆకాశమందు వేయిమంది సూర్యులు ఒకేసారి ఉదయించి, ప్రకాశించినట్లుగా యున్నది.

        తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్త మనేకధా
        అపశ్యద్దేవ దేవస్య శరీరే పాండవ స్తదా  13

    అర్జునుడు దేవదేవుని దేహమున సమస్త జగత్తు ఒకేచోట కూదినట్లును, అనేక విధములుగా విభజింపబడినట్లును దర్శించినాడు.

        తత స్స విస్మయావిష్టః హృష్టరోమా ధనంజయః
        ప్రణమ్య శిరసా దేవం కృతాంజలి రభాషత  14

    అంతట ధనంజయుడు ఆశ్చర్యచకితుడైనాడు. ఆ దేవునికి శిరసా నమస్కరించి, అంజలి ఘటించి పలికినాడు.

    అర్జున ఉవాచః

        పశ్యామి దేవాంస్తవ దేవ! దేహే సర్వాం స్తథా భూతవిశేష సంఘాన్
        బ్రహ్మాణ మీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చదివ్యాన్  15

    స్వామీ! మీ దివ్యదేహమున సమస్త భూత, విశేష సంఘములను దర్శించుచున్నాను. కమలమున కూర్చున్న దేవుడైన బ్రహ్మను, ఋషులను, సర్వదివ్య సర్పములను దర్శించుచున్నాను.

        అనేక బహూదర వక్త్రం నేత్రం పశ్యామి త్వాం సర్వతో -నంత రూపమ్
        నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర! విశ్వరూప!  16

    సర్వత్ర అనంతమగు నీ రూపమును దర్శించుచున్నాను. అందు అనేక బాహువులు అనేక ముఖములు, అనేక నేత్రములు దర్శన మిచ్చుచున్నవి. స్వామీ! నీవు ఆది మధ్యాంత రహితుడవు, విశ్వేశ్వరుడవు. నీ విశ్వరూపమును దర్శించుచున్నాను.

        కిరీటినం గదినం చక్రిణం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతమ్
        పశ్యామిత్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్క ద్యుతిమప్రమేయమ్  17

    స్వామీ నీ శిరసున కిరీటము, హస్తము నందు గదాచక్రములు, తేజోరాశివై సర్వత్రా దీప్తిమంతుడవు. నిన్ను చూడలేనట్లు వున్నావు, అగ్ని మండుతున్నట్లు, సూర్యుడు వెలుగుచున్నట్లును ప్రకాశించుచున్నావు.

        త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానమ్
        త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే  18

    స్వామీ! నీవు అక్షరమవు. పరముడవు. తెలియదగినవాడవు. ఈ సమస్త విశ్వమునకు ఆశ్రయమైన వాడవు. నీవు అవ్యయుడవు, శాశ్వతుడవు, ధర్మమవు గోప్తవు, సనాతన పురుషుడవు. అట్లని నా అభిప్రాయము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.