Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ సత్యనారాయణమూర్తి, బూరెల
హల్లో మిష్టర్ చైనీ!
హల్లో! మిష్టర్ చైనీ!
చవ్వన్ లై సైతానీ!
పొగరుబోతు దీవానీ!
పోరా ఓ బెయ్ మానీ! ||హ||
పరాయిరాజుల దోస్తీ
మరగి, పట్టితివి మస్తీ;
పొరుగువారితో కుస్తీ
జరిపితివీ జబర్దస్తీ ||హ||
వెఱ్ఱి ముదిరెనా నేస్తం?
ఎందుకురా చాదస్తం?
ఆలోచించుము దూరం
తెలిసిపోవు నీ నేరం ||హ||
శత్రుకూటమును చేరీ,
మిత్రద్రోహం కోరీ
మీద బడితివా వారీ!
మించిపోయె నీ "సారీ" ||హ||
దురాక్రమణ తలపెట్టీ
దౌత్యమార్గమును పట్టీ
భరతభూమి కాలెట్టీ
బ్రతికిపోవుదే పొట్టీ? ||హ||
హఠో, చైనా గద్దార్!
అరే! చైన దుర్మార్గా! హఠో! ఖబర్దార్!
క్రూరమానసా! పోఫో! పోరా గద్దార్!
నీచుడ, కుటిలాత్ముడ! దుర్నీతివి; 'డాకూ!'
కాచుకోర! మా శక్తిని! గజిబిజి పడకూ! ||అ||
నరహంతక! చవ్వనులై! నమ్మకద్రోహి!
దురితాత్మా! చైనాసుర! థూ! దుర్మోహీ! ||అ||
రజాకార్ల ముఠా రీతి! రణరంగమునా
'హజామత్తు' కాగలరు! అరుగుము చీనా ||అ||
గర్వంబున నొడలు మఱచి! కన్ను బ్రామి, మా
ఉర్విపైన కాలు మోపితే? పన్నగమా! ||అ||
దురితాత్ముల, దుర్మార్గుల! దుష్టమైత్రిచే
అరయవైతి ముందుచూపు! అత్యాశలచే ||అ||
వీరమాత భరతమాత! మాదు తల్లిరా!
ధీరాత్ములు భారతీయ శూరులు గనరా! ||అ||
ఉఱుము ఉఱిమినట్లు ఉఱిమి! తఱుముదు రోరీ!
అఱయవేమిరా! వినలేదా? రణభేరి! ||అ||
తరతరాల మా వారల దండి శౌర్యమూ
నరనరాల మాలో నుండె, సత్యము గనుమూ ||అ||
కర్మభూమి మా దేశము ధర్మభూమిరా!
మర్మము విడనాడి మంచి మతిని పెంచరా!
అరే! చైన దుర్మార్గా! హఠో! ఖబర్దార్;
క్రూరమానసా! పోఫో! పోరా గద్దార్!
* * * *





