Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ సత్యనారాయణ, విశ్వనాథ
యుద్ధమేనా!
నెత్తురుల న్విసంబులను
నింపెడు జీవములందు ప్రాణ సం
సత్తులు నిల్వనీని ఖని
జంబుల నిప్పుల నీదు గుండులున్
హత్తిన మంచుకొండ చరి
యల్పడి పాఱెడి గంగ ఱేపులో
కోత్తర సస్యధాత్రి యగు
నో యఘముల్ హరియింప గల్గునో.
చీనావా డొకరుండు పొడ్చుకొని వ
చ్చె న్నేడు పైపైకి మా
లోనన్ మేముగ చాలమన్నటుల నా
లో రావణుల్ కంసులున్
వేనుల్ హిట్లరు లెంతమంది పృ
థ్విన్ చాపగా చుట్టలే
దైనన్ వారెవరోను వీడెవడొ ఆ
హా! నూత్న కర్మాకృతిన్.
ఒక్క ప్రాణమ్ము కాక వేఱొక్క డేది
చౌకగా లేనియట్టి యీ సమయమందు
ప్రాణములుకూడ ప్రియముగా నాచరించు
నట్టి చైన్లు ప్రశంసల కర్హుడగును.
మా మంత్రుల మార్పించెడి
ధీమంతుడు క్రుస్సుఛేవు తెలివి నెఱుగడో
ధీమన్మఱియగు చైన్లూ
మా మంచితనమ్ము నింక మన్నించ డహో!
నీ వొక్కండవు నీవుగా నిలువగా
నేర్పంగ లేవందుచే
రావయ్యా మము చేరనంచు పిలువన్
రా చీనివా డయ్యయో
నీవున్ యుద్ధమటంచు నెంచెదవు కా
నేకాదు యుద్ధంబు నీ
వేవైపో యొకవేపు మొగ్గుము మఱిం
దే వీ మహాయుద్ధముల్.
ఐనను యుద్ధంబే యిది
రానీయము చీనివాని రాడున్ వాడున్
కానిమ్మని వచ్చినచో
లేనే లే మిద్దఱమును లీలగదయ్యా!
* * * *





