Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ శ్రీవత్సం
లేవవోయ్!
లేవవోయ్! లేవవోయ్!
లేచి నడుం కట్టవోయ్!
భారత భూభాగంపై
దురాక్రమణ సాగించే
చైనా నెదిరించవోయ్!
జయపాతాక నిలపవోయ్!
హిమాలయపు చఱియల్లో
హిమవంతపు జాడల్లో
సరిహద్దు నతిక్రమించి
సాహసించి పైకి వచ్చి
సింహనాద మొనరించే
భారతీయ వీరులపై
గుండ్లవాన కురిపించీ
నెత్తురు చిందించిందీ; ||లే||
సత్యాగ్రహ సమరంలో
సాహసించి యెదురు నిల్చి
ఆంగ్లేయుల గుండెలలో
అదరును కల్గించినావు
నీ ధైర్యం నీ స్థైర్యం
నిశ్చలమై పొంగిపోవ
తుపాకీల కెదురు నిల్చి
విజయం స్థాపించాలి! ||లే||
నెహ్రూజీ ఆశయాలు
నిండారిన కోరికలు
నిత్య నూత్న పథకాలు
నైర్మల్య వికాసాలు
నీవే నిలబెట్టాలోయ్!
నీవే పోషించాలోయ్!
నీవే రక్షించాలోయ్!
నీవేనోయ్! పౌరుడా!
లేవవోయ్! లేవవోయ్!
లేచి నడుం కట్టవోయ్!
* * * *





