Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



                                   శ్రీ శ్రీరామారావు, శంకర

    ఒకరి సమస్య కాదిది

    అవిగో! యుద్ధపు కాలమేఘముల సంఖ్యామ్ముగా క్రమ్ముకొ
    న్నవి; చైనీయులు దారుణారుణవిధాన ప్రక్రియన్ విశ్వ వి
    ప్లవ దావాగ్నుల భారతావని హరింపన్ జూచుచున్నారు శా
    త్రవజీమూతము రూపుమాపి మన స్వాతంత్ర్యమ్ము రక్షింపుడీ!

    ఎన్నో కష్టపరంపరల్ గడచి, యెన్నెన్నో మహాత్యాగపుం
    దెన్నుల్ దాటి గడించుకొంటిమి స్వశక్తిన్ నేటి స్వాతంత్ర్యమున్
    ఛిన్నాభిన్న మొనర్పజూచెడు నిదే చీనామహాభూత మ
    న్నన్నా దౌష్ట్యము రూపుదాల్చినవిధానన్: దీని జెండాడుడీ!

    పశువో? మానవుడో? ప్రపంచమున సర్వశ్రేష్ఠుడెవ్వాడో? ఈ
    దృశమౌ రాక్షసకృత్యమెవ్విధి ధరిత్రీ సంస్కృతుల్ సైచునో?
    వశముందప్పిన మానవత్వమిలపై వర్ధిల్లునో? చచ్చునో?
    యషమో? మృత్యువొ? తేల్చుకోవలయునయ్యా లోక మిప్పట్టునన్.

    ఒకదేశమ్ము ప్రపంచశాంతికొర కుద్యోగించి, తన్మార్గమం
    దొక భల్లూకముచేత జిక్కుకొని కన్నుల్ మూసెనేనిన్ వికా
    వికలై కూలదె సభ్యతానిలయముర్విన్! సర్వదేశప్రజల్
    ప్రకటోత్సాహముపూని మేలుకొనుడీస్వాతంత్ర్యసంరక్షకై.

    ఒకరి సమస్య కాదిది మహోన్నత మానవతాసమస్య; నై
    తిక సమరాంగణంబిది; మదించిన మానవజాతి ఆత్మ హ
    త్యకు విషపాత్రబూనినది; తద్విషమున్ పడద్రోసి మానవా
    ళికి నిజధర్మనిర్వహణలేశము నేర్పుడు సభ్యదేశముల్.

                                         *  *  *  *




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.