Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ శ్రీరామమూర్తి, చిమ్మపూడి
హెచ్చరిక!
కన్నుల ప్రేమ జూపితివి, కత్తికి తేనెలు బూసి, పైన, మా
యన్నల మీరెయం చెద తలంచిన ద్రోహపుబుద్ధి యిట్టులన్
అన్నిట హద్దుమీరె, సరిహద్దుల దాటిన నేస్తగాడ, ముం
దున్నవి చైనియాసుర! సముద్ధతి నొచ్చు ముసళ్ళపండుగల్!
తియ్యని తేనియల్ చిలుకు దీటగు నల్బదికోట్ల గుండియల్
కయ్యము గుర్తెరింగినవి, కావరమెక్కిన కడ్పుమంటతో
వీయ్యపుమాటల న్బలుకు వెన్నుల పోటుల ద్రోహి! నీకు మా
నెయ్యము చేదుమయ్యె, సరె! నీల్గెడు నీ బ్రతుకింక బుగ్గియౌ!
రక్తపుకూటి యాసతొ కరాలను సాచిన రాజ్యకాంక్ష, నీ
శక్తుల చేదుకొన్నది విసమ్ముల గ్రుక్కెడు పాము బుద్ధి, నీ
యుక్తులు మండ-చైనియ! పయోముఖపున్ విషకుంభమా! త్వదా
సక్తి పిశాచతత్వము విషాద నిషూదనమే, నిశాచరా!
సరదాయం చరుదెంచి, యింట తిని వాసాలన్ని లెక్కింతె, మా
సరదార్లద్దియ చూచినారు, తమ మీసమ్ముల్ దగన్ దువ్వి, భీ
కర తేజోమయమూర్తులింక మిము ముక్కల్ముక్కలున్ జేయ, మా
కరవాలంబుల ధాటి జూచెదవులే, కర్కోటకా! చైనియా!
* * * *





