Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
అహం క్రతురహాం యజ్ఞః స్వధా హామహా మౌషధమ్
మంత్రో హ మహమేవాజ్యం అహమగ్ని రహం హుతమ్ 16
నేనే క్రతువును, యజ్ఞమును, స్వధను, నేనే ఔషధమును - అంతమును నేనే. ఆజ్యమును నేనే/ అగ్నిని నేనే. హుతమును నేనే.
పితా హమస్య జగతః మాతా ధాతా పితామహః
వేద్యం పవిత్రమోంకారః ఋక్సాను యజురేవ చ 17
ఈ జగత్తునకు తండ్రిని నేనే. తల్లిని, దాతను, తాతను, వేద్యుని, పవిత్రము, అహంకారము, ఋక్సామ యజుర్వేదములు నేనే అగుచున్నాను.
గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసః శరణం సుహృత్
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ 18
మార్గమును, భర్తను, ప్రభువును, సాక్షిని, నివాసమును, శరణ్యమును, మిత్రమును, ప్రభవమును, ప్రళయమును, స్థానమును, నిధానమును, అవ్యయమైన బీజమును నేనే అగుచున్నాను.
తపామ్యహమహం వర్షం నిగృహ్ణా మ్యుత్సృజామి చ
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహ మర్జున 19
తపించుట, నీటిని గ్రహించుట, వర్షమై కురిపించుట, అమృతము, మృత్యువు, సత్యము నేనే అగుచున్నాను.
త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః
యజ్ఞెరిష్ట్యా స్వర్గతిం ప్రార్థయంతే
తే పుణ్య మాసాద్య సురేంద్ర లోకం
అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్ 20
మూడు వేదములను ఆచరించువారును, సోమ పానము చేయువారును, పాపములు చేయని వారును, యజ్ఞయిష్టిని ఆచరించువారును, నన్ను స్వర్గమునే ప్రార్థించుచున్నారు. పుణ్యవంతులైన వారు చంద్రలోకమునే చేరుచున్నారు.
అచ్చట దివ్యములగు దేవ భోగములను అనుభవించు చున్నారు.
తే తం భుక్త్వాస్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి
ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః
గతాగతం కామకామా లభన్తే 21
విశాలమైన స్వర్గలోకముననుభవించి, వేద విద్యా ప్రపన్నులై స్వర్గమునకు వచ్చిపోవువారలై, కామములను, ఆకామములను అనుభవించు చున్నారు. పుణ్యము క్షీణించగనే భూలోకమున ప్రవేశించుచున్నారు.
అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యు పాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ 22
అనన్యముగా నన్ను ఆశ్రయించి, ఎవరు నన్ను ఉపాసించుచున్నారో అట్టి నిష్కామ కర్మల యోగక్షేమములను నేనే వహించుచున్నాను.
యే - ప్యన్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధ యాన్వితా
తే - పి మామేవ కౌంతేయ యజంత్యవిధి పూర్వకమ్ 23
కొందరు అన్యదేవతలను భక్తిశ్రద్ధలతో పూజించుచున్నారు. వారు కూడా నన్ను అతిథిపూర్వకముగా యజించుచున్నారు.
అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ
న తు మామభిజానంతి తత్త్వే నాతశ్చ్యవంతి తే 24
నేనే సర్వయజ్ఞములకు భోక్తను. నేనే ప్రభువును. అట్లు నన్ను తెలియనివారు జననమరణ చక్రమున భ్రమించుచున్నారు.
యాంతి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాంతి పితృవ్రతాః
భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినో పి మామ్ 25
దేవవ్రతులకు దేవతలు, పితృవ్రతులకు పితరులు, భూత వ్రతులకు భూతములు,నన్ను యజించుచున్న వారికి నేను లభించుచున్నాను.
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః 26
పత్రం, పుష్పం, ఫలం, జలము భక్తితో ఎవరు సమర్పించినను దానిని నేను స్వయముగా ప్రీతితో ఆరగింతును.
యత్కరోషి యదశ్నాసి యజ్ఞుహోషి దదాసి యత్
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ 27
అర్జునా! నీవు చేయు కర్మలను, భుజించు ఆహారమును, హవ్యమును, దానమును, తపస్సును నాకే అర్పించుము.
శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః
సన్న్యాసయోగ యుక్తాత్మా విముక్తో మాముపైష్యసి 28
శుభాశుభ కర్మలనుండి విముక్తుడైనవాడు సన్యాస యోగమున నన్నే చేరుచున్నాడు.
సమో - హం సర్వభూతేషు నమో ద్వేష్యో - స్తి న ప్రియః
యే భజంతి తు మాం భక్త్వా మయి తే తేషు చాప్యహమ్ 29
నేను సర్వభూత సముడను. ఒకరిని ద్వేషించను, మరొకరిని ప్రేమించను. నన్ను భక్తితో పూజించువారు, వారి యందు నేను, నాయందు వారు ఉంటున్నాము.
తపిచేత్ సుడురాచారః భజతే మామనవ్య భాక్
సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః 30
దురాచారుడైనను అనన్యముగా నన్ను భజించువాడు సాధువే అగుచున్నాడు. అతడు చక్కగా భజించినట్లే ఆగును.
అజామీళుని కథ
కన్యాకుబ్జమున అజామీళుడను ఒక బ్రాహ్మణుడు ఉండువాడు. అతడు ఉత్తముడు. శాస్త్రజ్ఞుడు, సదాచార సంపన్నుడు. సద్గుణరాశి. వినయవంతుడు. జితేంద్రియుడు. సత్యవాది. పవిత్రుడు. అతిథులను, అగ్నులను, వృద్ధులను సేవించువాడు. పరోపకార శీలుడు, మితభాషి.
ఒకరోజు అతడు తండ్రి ఆజ్ఞను అనుసరించి అడవికి వెళ్ళినాడు. పుష్పములు, ఫలములు, కుశలు మున్నగునవి పట్టుకొని ఇంటికి తిరిగి వచ్చుచుండగా, మార్గమధ్యమున మనసునకు వికారము కలిగించు ఒక దృశ్యము అతనికి కన్పించినది.
ఒక రంకుటాలు మద్యము త్రాగి మత్తులో ఉన్నది. కళ్ళు మత్తున ఎరుపెక్కినవి. మొలన బట్ట వూడిపోయి నగ్నముగా ఉన్నది. ఒక పురుషుడు తప్పతాగి ఉన్నాడు. మైకమున అతనికి కళ్ళు కనిపించుట లేదు. వారిరువురు దారిలో బహిరంగ ప్రదేశమున సంగమక్రియ జరుపుచున్నారు.
అజామీళుడు వారిని చూచినాడు. వారు అజామీళుని చూచు స్థితిలో లేరు. పురుషుడు ఆమెను గట్టిగా కౌగిలించుకొని పరవశుడగుచున్నాడు. అతడుగాని, ఆమెగాని గమనించలేదు. వారు రతిక్రీడ మానలేదు.
అజామీళుడు కామపరవశుడైనాడు. అతడు జ్ఞాని, శుచి, జితేంద్రియుడు. మనసును అదుపులో పెట్టుటకు ఎంతో ప్రయత్నించినాడు. చాలా బాధపడినాడు. కాని మనసును గెలవలేకపోయినాడు. మన్మథుని ముందు నిలువలేకపోయినాడు.
అజామీళుడు ఓడినాడు. మన్మథుడు గెలిచినాడు. అతని జితేంద్రియత్వము అడుగంటినది. శాస్త్రజ్ఞానము మంటగలసినది. ధర్మము గాలికి ఎగిరిపోయినది. ఆ రంకుటాలు వద్దకు చేరినాడు. తన దేహమును దానికి అర్పించినాడు. తన సంపద యావత్తు ఆవిడకు ధారపోసినాడు. ఆమె కడగంటి చూపు కొరకు ఆత్మార్పణ చేయుటకు సిద్ధపడినాడు. అగ్నిసాక్షిగా పెండ్లాడిన భార్యను వదలినాడు. రంకుటాలుకు బానిసయై సదాచారమును మంటకలిపినాడు. దారులు కాచి బాటసారులను దోచుకున్నాడు. మోసము చేసి, దొంగతనము చేసి డబ్బు సంపాదించినాడు. ఇతరులను నానా హింసలు పెట్టినాడు. ఉంపుడుకత్తె వలన అనేకమంది పిల్లలను కన్నాడు.
కాలచక్రము గిరగిర తిరిగినది. అజామీళునకు ఎనుబది సంవత్సరముల వయస్సు వచ్చినది. వెంట్రుకలు నెరిసినవి. పండ్లు ఊడినవి. కనుచూపు మందగించినది. జఠరాగ్ని తగ్గినది. తల వడకసాగినది. అట్టిదశలో సహితము ఉంపుడుకత్తె చివరి పుత్రుడనిన అతనికి అపారమగు అనురాగము. వాని చిలుకపలుకులు విని ఆనందించువాడు. ఆటలు పాట చూచి మురిసిపోవువాడు. అన్నము స్వయముగా తినిపించువాడు. ఉంపుడుకత్తె పిల్లలంటే ప్రాణము విడుచువాడు. ఆ జంజాటమున తన తలపైనున్న మృత్యువును గమనించలేకపోయినాడు.





