Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



                                      తొమ్మిదవ అధ్యాయము

                                             రాజవిద్యా రాజగుహ్య యోగము

    శ్రీ భగవానువాచ:

        ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే
        జ్ఞానం విజ్ఞానసహితం యజ్ జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్  1

    నీవు అసూయలేని వాడవు. ఇది రహస్యతమము. జ్ఞానము విజ్ఞాన సహితము దీనిని నీకు ఉపదేశించుచున్నాను. తెలుసుకొనుము. అశుభము నుండి విముక్తుడవు అగుము.

        రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిద ముత్తమమ్
        ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్  2

    ఇదియే రాజ విద్యా రాజగుహ్యం. ఇది పవిత్రము ఉత్తమము. ప్రత్యక్ష ఫలదము, ధర్మము, శుభప్రదము అవ్యయము.

        అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప
        అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని  3

    అర్జునా ఇది ధర్మము. అశ్రద్ధగలవారికి అందదు. అందువలన నన్ను పొందజాలరు. జననమరణ సంసారమున తిరుగుచుందురు.

        మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా
        మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః  4

    నేను అవ్యక్తమూర్తిని. దిశాంతము నేనే సృష్టించినాను. యీ భూతములు అన్నియు, ప్రాణులు అన్నియు నాలోనే వున్నవి. నేను వానిలో లేను.

        న చ మత్ స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్
        భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః  5

    నా యొక్క ఈశ్వరీయమైన యోగమును దర్శించుము. ప్రాణులన్నియు నాలో లేవు. నేనే వాటిని పోషించుచున్నాను. ఐనను వాటి యందు నేను లేను.

        యథా కాశ స్థితో నిత్యం వాయు స్సర్వత్రగో మహాన్
        తథా సర్వాణి భూతాని మత్ స్థానీత్యుపధారయ  6

    ఆకాశమున గాలి పుట్టును. సర్వత్ర వ్యాపించును. ఇట్లే సర్వ భూతములు నాయందేయున్నవి అని తెలిసికొనుము.

    దీపిక:

    4, 5 శ్లోకములలో నేను భూతములలో లేను అని చెప్పినాడు. 6వ శ్లోకములో నాలోనే వున్నవని తెలియుము అనుచున్నాడు. ఉపమానము 'గాలి'ని యిచ్చినాడు. గాలివలె సమస్త భూతములు స్వామి యందు వున్నవని తెలిసికొనవలెను.

        సర్వభూతాని కౌంతేయ! ప్రకృతిం యాంతి మామికామ్
        కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్  7

    సమస్త భూతములు నా ప్రకృతి యందే యున్నవి. కల్పాదిలో వానిని సృజిస్తాను. కల్పాంతములో వానిని లీనము చేసుకొంటాను.

        ప్రకృతిం స్వామవష్టభయ విసృజామీ పునః పునః
        భూతగ్రామ మిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్  8

    ఈ భూతజాలము సాంతము వాని వశమున లేదు. ప్రకృతి వశముననున్నది. ప్రకృతి ననుసరించి వానిని నేను మరల మరల సృజించుచున్నాను.

        న చ మాం తాని కర్మాణి నబధ్నంతి ధనంజయ
        ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు  9

    సృష్టి ఆదికర్మలయందు నాకు ఆసక్తి లేదు. నేను ఉదాశీనుడను. నన్ను ఆ కర్మలు బంధించవు.

        మయా-ధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్
        హేతునా - నేన కౌంతేయ జగద్విపరివర్తతే  10

    నా అధ్యక్షతన ప్రకృతి చరాచరములను సృష్టించుచున్నది అర్జునా! అదే కారణము జగత్తు సాగుతున్నది.
    
        అవజానంతి మాం మూఢాః మానుషీం తను మాశ్రితమ్
        పరం భావ మజానంతః మమ భూత మహేశ్వరమ్  11

    నాది భూతమహేశ్వరమ్. పరమభావము మూఢులైన మనుష్యులు దీనిని ఎరుగకున్నారు. వారు నన్ను సాధారణ దేహముగల వానినిగా భావించుచున్నారు.

        మేఘాశీ మోఘశర్మానః మోఘజ్ఞానా విచేతనః
        రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః  12

    వారివి వ్యర్థ ఆశలు, వ్యర్థకర్మలు, వ్యర్థ జ్ఞానములు. వారు రాక్షసి, ఆసురి, ప్రకృతి, మోహినిని ఆశ్రయించుచున్నారు.

        మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః
        భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాది మవ్యయమ్  13

    పార్థా! మహాత్ములు నన్ను ఈశ్వరీయుడుగాను, ప్రకృతికి ఆశ్రయునిగను భావించుచున్నారు. భూతాదీయుడను అవ్యయుడను అగు నన్ను తెలిసి అనన్యమనస్కులై భజిస్తున్నారు.

        సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః
        సమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే  14

    దృఢవ్రతులైనవారు నిరంతరము నన్నే కీర్తింతురు. నన్ను చేరుటకు ప్రయత్నింతురు. సర్వదా నాకు ప్రణమిల్లుదురు. నా ధ్యానమందే నిమగ్నులగుదురు. అనన్య భక్తితో నన్ను ఉపాశింతురు.

        జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే
        ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్  15

           

    ఇతరులు జ్ఞాన యజ్ఞమున నన్ను యజింతురు. ఉపాసింతురు. ఇంకొందరు ఏకముగను, వేరుగను, బహు విధములుగను, విశ్వరూపముగను నన్ను ఉపాసింతురు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.