Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



                                                       శ్రీ శివశంకరస్వామి

    చీనాకథ
    
    చిన్నతనములో చీనా నామము
    చెవిబడినంతనే చీనాంబరములు
    కౌశేయంబులు జ్ఞప్తికి వచ్చును
    ఊటలూరగా నోటను పిమ్మట
    మెత్తని చక్కర స్మృతిలో మెలగును
    కౌమారంబున 'కంగ్' 'ఫంగ్' 'చంగ్'
    సూక్తి పఠనమున బొక్కెడివారము
    మింగు నాయధర మేదినీశ్వరుల
    రంగుల మేలిమి పింగాణీలకు
    ముగ్ధ మనస్సుల మురిసిపోయితిమి
    పటచిత్రంబుల, పంచలోహంబుల
    బహువిగ్రహముల పచ్చల సొబగులు
        ప్రశంసించితిమి.
    నల్లమందు తిను నరులని ఎంతో
        జాలి చెందితిమి.
    శత్రుదేశములు చీనా భూమిని
        చీల్చుచున్నపుడు
    ఆక్రోశించిరి యన్యాయంబని,
    ఎట్టెట్టులో తెప్పిరిల్లి కుదుటంబడ్చు
    చల్లచల్లగా శక్తి సామర్థ్యముల్ పొంది
    కాంచీ 'రూసీ' అండ క్రమముగా వర్ధిల్లి
    మరచిపోయిరి వెనుకమాట చీనావారు
    బలవిహీనుడు సురా
        పానంబు చేయుచో
    తక్షణంబే కైపు తలకెక్కెడి విధాన
    అభినవోత్వాహాన ఆవేశవశులైరి,
    చీని చీనాంబరమ్ము లవి యెల్లను
    తేళ్ళునై జెర్రులై దుష్టసర్పమ్ములై
    చీనా చక్కర అంతయు చేదై విషమైపోయెను.
    మనసే విషమైపోయెను మరి కాని
        దికేముండును?
    చూచి చూచి చతురమ్ముగ
        చుట్టుప్రక్క ప్రదేశములో
    కబళింపన్ జొచ్చినారు
        కప్పవోలె మెలమెల్లన
    'తిబ్బతి' దేశంబన్నను
        దేవభూమి వంటిదండ్రు
    అమాయకులు జనులు; దాని
        నాక్రమించి వేసినారు
    మంచి మంచి మాటలతో
        మనసుగూడ మోసగించి
    'లడహా'దికమైన హిమా
        లయము ఆక్రమించినారు,
    'అసము' దేశభాగము పై
        నాక్రమణము చేసినారు,
    భారత భాగములు కొన్ని
        పట్టుకొనం దలచినారు
    లోకమంత వారికి వ్యతి
        రేకంబగు కారణమున
    కుటిలనీతి పూర్వకముగ
        కొంత వెనుక కరిగినారు
    శీఘ్రముగా చైనీయులు
        చేరవలయు యధాస్థితికి
    వ్యవహరించు చుండవలయు
        న్యాయ బుద్ధితోడ నింక,

                                        *  *  *  *




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.