Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ శివరామారావు, వింజమూరి
యుద్ధగీతి
ఈ దేశము భారతమ్ము
నీదే సుమ వీరుడా!
స్వాతంత్ర్యము సాధించిన
ఖ్యాతి నీది ధీరుడా!!
పంటకు నే లోటులేదు
పాడి కేది సాటిరాదు
బంగరు మాగాణి నీది
పొంగి పాట పాడవోయ్!!
ఎవ్వరినీ ద్వేషించక
ఎవ్వరిపై రోషించక
సాగుచున్న మనపైనే
మూగె నేడు కారుమబ్బు!
పౌరాణిక యుగమునుంచి
చారిత్రక కాలమందు
నేటిదాక పౌరుషాన
మేటిబంటులము మనం!
మేటి కర్మవీరుల కాయశూరులం
ధర్మమార్గ చారులం
క్షాత్రము చూపిస్తాం
శత్రుకోటి జయిస్తాం!
* * * *





