Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
నమో మహాద్భ్యో-స్తు నమశ్శిశుభ్యో
నమో యువభ్యోస్తు నమో పటుభ్యః
యే బ్రాహ్మణా గామవధూత లింగా
శ్చవంతి తేభ్యశ్శివమస్తురాజ్ఞామ్
బ్రహ్మజ్ఞానులైన మహాత్ములు ఏ వేషమున ఎచట ఎట్లుందురో, ఎట్లు సంచరింతురో తెలియదు. అందువలన బ్రహ్మజ్ఞానులైన వయోవృద్ధులకు, శిశువులకు, యువకులకు, వటువులకు నమస్కారము. వారి వలన రాజులకు శుభము కలుగుగాక!
శృణోత్య భ్యాస్యత్యభినందతి చసర్వా సేవాత్మన
ఆశిష ఆసాస్తే కాంచిన్న పరత ఇతి.
భరతుని చరిత్ర విన్నను వినిపించినను, అభినందించినను, యాచించ నవసరము లేకనే, అన్ని కోరికలు స్వతస్సిద్ధముగా నెరవేరును.
మనసునకు అత్యధికమైన ప్రాదాన్యమును ఇచ్చినవాడు జడభరతుడు. వాస్తవముగ బంధమోక్షములకు మనసే మిక్కిలి ప్రధానమైనది. ఒకేపని మనసును బట్టి దుష్కార్యముగను సత్కార్యముగను పరిణమించుచున్నది. ఒకడు ఒక అంగడి నుండి రొట్టె దొంగిలించినాడు. అట్లు దొంగిలించి యజమానిని నష్టపరుచుట అతని ఉద్దేశము. ఉద్దేశము చెడుదైనందున అది దుష్కార్యమైనది. ఇంకొకడు ఆకలికి అలమటించువాని బాధ చూడలేక, తనవద్ద లేనందున, రొట్టె దొంగిలించి ఆకలితో అలమటించువానికి ఇచ్చినాడు అతని తలంపు మంచిది కాన అది సత్కార్యమైనది.
ఒకే కార్యము మనసును బట్టి దుష్కార్యముగును. సత్కార్యముగను పరిణమించుటను గమనించినాము.
మనసును బట్టియే భారము తగ్గుటయు హెచ్చుటయు గమనింతము.
ఒక మణుగు బంగారముగల పెట్టె మనకు దొరికిన దానిని సంతోషముగను, సునాయాసముగను మోయగలము. మణుగు ఇనుము మోయమన భారము కలుగును.
తనవారిని పోషించుటకు ఎన్నో ఇక్కట్లు పడుటకు సిద్ధమగు వ్యక్తి, అందు సగము పరుల కొరకు చేయుమనిన భారముగా తలంచును. ఇదంతయు చిత్తవృత్తి.
చిత్తము స్వాధీనమున ఉన్నవాడు దేనినైనను సాధించుట అబ్బురమా?
భరతుడు పల్లకి మోయువానికి శ్రమలేదని నిరూపించినాడు. ఎట్లో విచారింతము. మట్టితో ఒక రాతి బొమ్మను, ఒక ఎద్దు బొమ్మను చేసి పల్లకిని రాతిపై పెట్టిన బరువనిపించునా? మరి ఎద్దుపై పెట్టిన బరువెట్లుతోచును? అదియే భరతుడు నిరూపించినది చెట్టు, ఎద్దు, మనిషి అన్నియు భూమి నుండియే పుట్టినవి. చెట్టునకును, ఎద్దునకును లేని శ్రమ మనుష్యునకు ఎట్లు కలుగును.
చెట్లు, ఎద్దు, మనిషి వేరు వేరు రూపముల కనిపించుచున్నవి కదా? యనవచ్చును. కామెర్ల రోగము గలవానికి జగమంతయు పచ్చగా కనిపించును. అందువలన లోకమంతయు పచ్చగా నున్నదనుట వాస్తవమగునా? అతని రోగము, పోయిన వెనుక వాస్తవమును అతడు గ్రహించును. చీకటిలో త్రాడును చూచి పాము అనుకొని ఎగిరి గంతువేసి కేకవేయును. వెలుగుతెచ్చి చూపిన అది త్రాడని తేల్చుకొనును. చీకటిలో అతడు చూచినది నిజముగా పాము అని నిరూపించలేముగదా! మాయ అనునది చీకటి వంటిది ఆ చీకటి యందు త్రాడు మనకు పాముగా కనిపించినది. జ్ఞానము కలిగి మాయ అను చీకటి తొలగిపొగా దాని నిజస్వరూపము తెలియును. అట్లే మాయమోహి తులమైన మనకు రాతివలెను. ఎద్దువలెను. మనిషి వలెను కనిపించున దంతయు వాస్తవముగ ఒకే పదార్థము.
మిథ్యావాదమున పరాకాష్టము నందుకున్నాడు జడభరతుడు. ప్రాణికి కారణభూతమగు భూమియే కాక భూమికి కారణభూతమగు పరమాణువు సహితము "మిథ్య" యనుచున్నాడు.
మౌనముగా నుండుట, పురుగులను చంపకుండుట మున్నగు నియమములు జైనమతస్థులందు కనబడుచున్నవి. కృచ్రము, ఉపవాసము మున్నగు వానిచే శరీరమును కృశింపజేసి మరణించుట సహితము వారియందు కాననగును.
తస్మాత్ సర్వేషు కాలేయ మామనుస్మర యుధ్య చ
మయ్యర్పిత మనోబుద్ధిః మామేవైష్యస్య సంశయః 7
కావున సర్వకాలములందు నన్నే స్మరించుము. యుద్ధము చేయుము. నాకు సమర్పించిన మనస్సు బుద్ధి వలన నీవు నన్నే పొందెదవు. సందేహము లేదు.
.jpg)
అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామినా
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ 8
అభ్యసింపుము. మనసును మరోవైపు పోనివ్వకుము. నన్నే చింతించుము. పార్థా నీవు పరమదివ్య పురుషుని చేరగలవు.
కవిం పురాణ మనుశాసితారం
అణోరణీయాంస మనుస్మరేద్యః
సర్వస్యధాతార మచింత్య రూపం
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ 9
విద్వాంసుడు, సనాతనుడు, శాపకుడు, అణువుకంటే సూక్షమైనవాడు. అందరినీ పోషించువాడు చీకట్లు పారద్రోలు సూర్యుని వంటి వానిని స్మరించువాడు.
ప్రయాణకాలే మనసా -చలేన
భక్త్యా యుక్తో యోగ బలేన చైవ
భ్రువోర్మధ్యే ప్రాణ మావేశ్య సమ్యక్
సతం పరం పురుష ముపైతి దివ్యమ్ 10
అవసావ కాలమున నిశ్చల మనస్సుతో భక్తియుక్తుడై భ్రూ మధ్యమున ప్రాణములను నిలిపి యోగియైనవాడు దివ్యుడగు పరమ పురుషుని చేరుతున్నాడు.
యదక్షరం వేదవిదో వదంతి
విశంతి యద్యతయో వీతరాగాః
యదిచ్చంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే 11
పరమ పురుషుని వేద విద్వాంసులు ప్రస్తుతింతురు. జితేంద్రియులు అక్షర పదమునందు ప్రవేశింతురు. పరమపదమును కోరియే బ్రహ్మచారులు వ్రతముల నాచరింతురు. ఇట్టి పరమపదమును గూర్చి చెప్పుచున్నాను వినుము.
పర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్యచ
మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్ 12
ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరన్ మామనుస్మరన్
యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్ 13
సర్వ ద్వారములను బంధించి మనస్సును హృదయమున నిలిపి బుద్ధితో స్వామిని చింతించి, యోగమును ధరించి, 'ఓం' అనే ఒక అక్షరబ్రహ్మమును నా స్వరూపమును ధ్యానించువాడు దేహమును త్యజించి పరమపదమునకు చేరుచున్నాడు.
అనన్యచేతా స్పతతం యో మాం స్మరతి నిత్యశః
తస్యాహం సులభః పార్థ! నిత్యయుక్తస్య యోగినః 14
నిరంతరము వేరు ధ్యాసలేక నన్ను నిత్యము స్మరించువాడును, నిత్యయుక్త యోగికిని అర్జునా, నేను సులభుడను.





