Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



                                 ఏడవ అధ్యాయము

                                                   జ్ఞాన విజ్ఞాన యోగము

    శ్రీ భగవానువాచః

        మయ్యాసక్త మనాః పార్థ! యోగం యుంజన్ మదాశ్రయః
        అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు 1

    కొందరు నా యందే ఆసక్తి కలవారు అగుదురు. వారు యోగమును. ఇంద్రియ నిగ్రహమును ఆశ్రయింతురు. అట్టివారు సమగ్రముగా నన్ను తెలియుచున్నారు. అర్జునా! అది వినుము.
        జ్ఞానం తే - హం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః
        యజ్ జ్ఞాత్వా నేహ భూయో న్యత్ జ్ఞాతవ్య మవశిష్యతే 2

    నీకు నేను జ్ఞానము, విజ్ఞానము అనుదానిని పరిపూర్ణముగా బోధింతును. దానిని తెలియుము. దానిని మించినది లోకమున మరియొకటిలేదు.
        మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే!
        మతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః 3

    వేలమంది నరులలో ఏ ఒక్కడో సిద్ధికొరకు నన్ను యజించు చున్నాడు. యజించు సిద్దులలో ఏ ఒక్కడో నన్ను తాత్వికముగా తెలియును.
        భూమిరాపో - నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ
        అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా 4
        అపరేయ మితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్
        జీవభూతాం మహాబాహో! యయేదం ధార్యతే జగత్ 5

    భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారము యీ ఆరును నాకు భిన్న రూపములు అగుచున్నది.
    అర్జునా! అపర, ప్రకృతి అని మరి రెండు విధములు. అవి జీవభూతములగు సమస్త జగత్తును భరించుచున్నవి.
        ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ
        అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా 6

    ఆ రెంటి వలననే సమస్త ప్రాణులు ఉత్పన్నమగుచున్నవి. నేను యీ జగత్తును పుట్టించుచున్నాను. గిట్టించుచున్నాను.
        మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ!
        మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ 7

    నన్ను మించినది అణుమాత్రము లేదని తెలియుము. దారములో మణులవలె సమస్తము నాయందే నిలచియున్నది.
        రసో-హమప్సు కౌంతేయ! ప్రభా - స్మి శశిసూర్యయోః
        ప్రణవ స్సర్వ వేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు 8

    అర్జునా! నేనే జాలములో రసమును. నేనే సూర్య చంద్రులలో కాంతిని. నేనే వేదములందలి ఓంకారమును. నేనే ఆకాశము నందలి శబ్దమును రాజులందు పౌరుషమును నేనే.
        పుణ్యోగంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ
        జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు 9

    భూమి యందలి పుణ్యగంధమును నేనే. అగ్ని యందలి తేజస్సును నేనే. సమస్త ప్రాణులందు చైతన్యమును నేనే తాపసులలో తపస్సును నేనే.
        బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ! సనాతనమ్
        బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినా మహమ్ 10

    పార్థా! సమస్త భూతములకు సనాతనమైన బీజమును నేనే అని తెలియుము. విద్యావంతులలో విద్యను నేనే. తేజోవంతులలో తేజస్సును నేనే.
        బలం బలవతామస్మి కామరాగ వివర్జితమ్
        ధర్మావిరుద్దో భూతేషు కామో - స్మి భరతర్షభ 11

    భరతర్షభా! బలవంతులందు కామరాగ వివర్జితమగు బలమును నేనే. ప్రాణులందు ధర్మ విరుద్ధము కాని కామమును నేనే.
        యే చైవ సాత్త్వికా భావాః రాజసా స్తామసాశ్చయే
        మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి 12

    సాత్విక, రాజస, తామస త్రివిధ గుణములు. వీనివల్లనే లోకములన్నియు మోహితములగుచున్నవి. అందువల్లనే నన్ను పరమునిగా అవ్యయునిగా తెలియకున్నవి.
        దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా
        మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే 14

    నా మాయ దైవికము. త్రిగుణమయము. అందుకొనరానిది. నన్నే భజించువారు యీ మాయ నుండి తరించుచున్నారు.
        న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః
        మాయయా పహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః 15

    దుర్మార్గులు, మూఢులు, నరాధములు నన్ను భజించకున్నారు. వారి జ్ఞానమును మాయ మ్రింగినది. వారు అసుర భావమును ఆశ్రయించినారు.
        చతుర్విధా భజంతే మాం జనాస్సుకృతినోర్జున!
        ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ! 16

    శుభములకుగాను జనులు నాల్గు విధములుగా నన్ను భజించుచున్నారు. వారు 1. ఆర్తులు 2. జిజ్ఞాసువులు 3. అర్థార్థులు 4. జ్ఞానులు.
        తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే
        ప్రియా హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః 17

    ఆ నలుగురియందు నా యందే నిత్య చిత్తుడును, తదేకభక్తి కలవాడును అగు జ్ఞాని మించుతున్నాడు. జ్ఞానులన్న నాకు ప్రియము. వారికి నేనును ప్రియుడను.
        ఉదారాస్సర్వ ఏనైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్
        అస్థిత స్స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ 18

    ఆ నలుగురు ఉదారులే. కాని జ్ఞానిని నా ఆత్మగా భావించుచున్నాను. నిత్యము నన్నే తలంచుచు నాయందే ఉండువాడు ఉత్తమ గతిని పొందుచున్నాడు.
        బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే
        వాసుదేవ స్సర్వమితి స మాహాత్మా సుదుర్లభంః 19

    అనేక జన్మల తర్వాత జ్ఞానమంతుడు నన్ను చేరుచున్నాడు. సమస్తము వాసుదేవమయము అను మహాత్ముడు దుర్లభుడు.
        కామిస్తైస్తైర్హృత జ్ఞానాః ప్రపద్యంతే - న్య దేవతాః
        తం తం నీయమమాస్థాయ ప్రకృత్యా నియతాస్స్వయా 20

    కోరికలు జ్ఞానమును నశింపచేయును. అట్టివారు యితర దేవతలను ఆశ్రయింతురు. వారు తన స్థాయి ననుసరించి అన్యదేవతలను అర్చింతురు.
        యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితు మిచ్ఛతి
        తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ 21

    ఒకడు కోరికలవాడు. అతడు ఒక దేవతను అర్చించును. అతనికి ఆ దేవతయందు నిశ్చలమైన శ్రద్ధాభక్తులను నేనే కలిగించుచున్నాను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.