Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



            

    దీపిక:
    
    1. జ్ఞానము తెలియనిది తెలియుట. తెలియనిది ఏది? బ్రహ్మము పరాత్పరుడు.
    స్వామిని తెలియుటకు, అనేక మార్గములు ఉన్నవి. వాటి అన్నిటి లక్ష్యము, గమ్యము స్వామియే. స్వామిని తెలియుటకు ఏ మార్గమును అనుసరించినను దోషము లేదని తెలియవలెను.
   2. కరములతో చేయునది కర్మ, చేతులతో చేయునది పని. పని లేక లోకము లేదు. పనిచేయు విధానములు అనేకములు. వీనిలో నిష్కామకర్మ ఒకటి. ఇది ఉత్తమము, శ్రేష్ఠము, పరమము, ఫలము ఆశించక చేయునది నిష్కామకర్మ. కర్మ చేయవలయును. వచ్చిన దానితో తృప్తి చెందవలెను. తృప్తికి మించినది లేదు. "తృప్తి జెందని మానవుడు సప్తద్వీపములనైన చక్కంబడునే" అంటాడు బలిచక్రవర్తి భాగవతములో.
    షేరు మార్కెట్టులో షేరు విలువ పెంచుటకు అనేక దుర్మార్గములు అవలంభించ బడుచున్నవి. సత్యము విషయములో ఇది విదితమైనది. ఇది దాహము, దురాశ, షేరు విలువను యథాతథముగా ఉండనిచ్చుట నిష్కామ కర్మ.
    నిష్కామ కర్మ ఫలితమును ఆశించకుండా వుండదు. వచ్చిన దానితో తృప్తిపడుటయే నిష్కామకర్మ. "దురాశ దుఃఖమునకు చేటు" అను సామెత.
  3. ఇందులో చాలా యజ్ఞముల గురించి చెప్పబడినది. ఇవి ఏవియు వేద యజ్ఞములు కావు. వేదయజ్ఞములో అగ్ని, ఆహుతి వుంటుంది. ఈ యజ్ఞాలు పేరుకే. కాని వాస్తవ యజ్ఞాలు కావు.
    ఉపనిషత్తులు యజ్ఞమును వ్యక్తిపరము చేసినవి. బ్రహ్మము కొరకు వెదకుట యజ్ఞము అని అర్థమును యిచ్చినది. ఈ ఉపనిషత్తు యజ్ఞములకు, 'కర్మజ్ఞాన, కర్మ సన్యాస' అను అనేకమైన పేర్లు వున్నవి.
    ఇవి వేరు యజ్ఞములు కావు అని పునర్ ఉవాచ యజ్ఞము అను పేరు మాత్రమే వాడుకున్నారు. స్వామి యీ అధ్యాయములో వివిధ యజ్ఞములను, వాటి ఫలితములను ప్రవచించినారు.
    జ్ఞాన, కర్మ సన్యాసయోగము అను నాల్గవ అధ్యాయము ముగిసినది.

                                           ఓం శాంతిః శాంతిః శాంతిః




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.