Home » adivishnu » Udyogam


"మంచివాడితోనే బోణి అయ్యింది నీకు.  ఇకముందతన్తో కలిసి తిరగడం మానుకో కనిపించినా  తప్పించుకు తిరుగు."
"ఏం?"
"సివిలిజేషన్ తెలీని ఫూల్."
అదిరిపడ్డాడు. రాముడు కొత్తసిగరెట్టు ముట్టించి మాటమార్చి అన్నాడు.
ఇక్కడ  అన్ని సుఖాలూ ఉన్నాయి . కొంచెం అలవాడుపడితే జన్మకిక ఈవూరిదిలిపెట్టి ఉండమని కూర్చుంటావ్."
"ఇక్కడ అన్ని సుఖాలూ యో, ఆరాత్రి రాముడి గదిలో రాముడి గదిలోకి రాముడుకొనుక్కున్న 'సుఖం' చూచి ఖంగారు పడిపోయాను. మేము పడుకునేముందు సూటుకేసులోంచి  'సీసా' తీసాడు. దాని ఖరీదు పదహారు రూపాయల చిల్లరని చెప్పాడు. గట్టిగా ఉపయెగిస్తే వోరోజు సరదా  అని అన్నాడు. రెండు గ్లాసుల్లో పోసి వోగ్లాసు నాముందు పెట్టాడు.
ఉన్నపళంగా పక్కమిద లేచి డాబాదిగి నడిరోడ్డుమిద నించుని గట్టిగా కేకపెడదామనిపించింది. నా ఖంగారుచూచి వాడు నవ్వేశాడు
"మరేంలేదు. మొదట్లో...." యేదో చెప్పబోయాడు
"నాన్ సెన్స్- ఇదిట్రా నీ సినివిలిజేషను?" గట్టిగా అరిచేను.
వాడు నానోటిని తనచేత్తో మూసి కొంచెం సేపు మాటాడేడు నెమ్మదిగా, నా ఒక్కడికే వినిపించేలా.
"ఉదయంపూట అంబలి తాగడమే సివిలిజేషననుకున్న నీబోటివాడికి దీని ఘనత తేలీదు: దొరలుతాగేమందిది సివిలిజేషన్ దొరలకి తెలిసినంతగా నీకు తెలీదు. నీతీ, జాతీ సాంప్రదాయమూ చట్టుబండలూ అనే పరిమితమైన ప్రపంచంలో పుట్టిపెరిగిన  నీకిది సివిలిజేషన్ కాదంటే ఆశ్చర్యపడ్డనేను టేకిట్ యీజీ! నున్నుగూడా కొంచెం సిప్ చేస్తే సంతోషిస్తాను లేదూ- నీయెదట పెరిగిపోతున్న నన్ను చూచి ఆశ్చర్యపోతూండు. నీఖర్మ నీది."
భాగ్యనగరాన్ని దూషించేటంత చాతుర్యం నాకు లేదు. నా కన్నుని నేను పొడుచుకునేంత సత్తాగూడా  లేదు. నాకు పరిచయమైన నేనుపొడుచుకునేంత సత్తాగూడా లేదు. నాకు పరిచయమైన మహానగరంలో నా చిన్న నాటి మిత్రుడింతగా మారిపోయినందుకు ఆశ్యర్యంగా వుంది.    
రాముడిగురించి నాకు బాగాతేలుసు. వాడు ఇంటి దగ్గర నల్లిలా బ్రతికి భీరువు. మావూళ్ళో యేవానా సాహసాలు చెప్పుకుంటే అది నాలాటి కొందరుచెప్తే చెల్లుబడి అవుతుంది. తండ్రి చాడటుపిల్లవాడు రాముడు. ఇంట్లో పెద్దన్నయ్య మొదలు విధపప్పవరకూ వాళ్ళవాళ్ళ  ఆంక్షమధ్య పెరిగిన ఘనుడు రాముడు, ఇంట్లో చెప్పకుండా వాళ్ళందరి  అనుమతివలేనిదే కేవలం తెలుగుసినిమా కెళ్ళలేని దౌర్భాగ్యమే క్వాలిఫికేషన్ గాగల రాముడు  ఈభాగ్యనగరంలో యింత ప్రముఖుడై వెలిగోపోతున్నాడంటే నాకు ఆశ్చర్యంగాదు?
ఈ వూళ్ళో వాడికి రెండున్నరవందల జీతమొస్తుంది. ఖర్చు పెట్టుకోవడానికి వందలైనాచాలని ఈవూళ్ళో ఇరవై తారిఖునుంచి జీతంకోసం ఎదురుచూచే రాముడు ఇంటిదగ్గర తన జాతకాన్ని మరిచిపోతున్నాడు.
మొదటి వారంరోజులూ బెంగగా గడిచేయి. మళ్ళా మా  వూరికి బదిలీకోసం ప్రయత్నించేను. ఫలించేసూచనలు కన్పించకపోగా నాకున్న ' ఇంటిబెంగ'ని యాగీచేసినక్షణాలు భరించలేకపోయాను. చివరికి వో మొండిధైర్యం కలుగుతున్నట్టు పసిగట్టగలిగాను.
రాముడు గదిలోనే కాలం గడుస్తోంది. మనిషి ని ఉత్తేజపరిచే 'మందు ల్లోని వివిధరకాలు రాముడు చవిచూస్తూంటే కళ్ళప్పగించే నేను వోనాటిరాత్రి నన్ను నేను 'అదుపు'లో పెట్టుకోలేకపోయాను. వాడు ఆనందం అనుభవిస్తోండగా నోరు తెరుచి అడిగాను.
"ఒరే కొంచెం నాకూ పోయరా! తాగాలనివుంది." వాడు పకపకా నవ్వేశాడు. గ్లాసులో కొంచెంపోసి నా భుజం తట్టుతూ  అన్నాడు.
"కళ్ళుతెరిచిన పసికూనా! రంగుల ప్రపంచాన్ని నీ సొంతం చేసుకోయిక. గుడ్ లక్."
తాగేను. గుండెల్లో మంటగావున్నా మరోతడగ్లాసుల పోసుకుని తాగాను. తాగి హోల్డాలుమిద నడుంవాస్చేను. నా  వ్రేళ్ళమధ్య సిగరెట్టుంచేడు రాముడు.
ఉదయానికి కొండని  మింగేంత ఆకలివేసింది. ఆరోజు లాగాయితు రాముడు చెప్పిన రంగుల  ప్రపంచంలో నడవడం ప్రారంభించేను.నవోత్సాహాన్ని సంపాయించుకుంటున్నాను. కొన్నాళ్ళకి గమనిచింది. ఈ నగరంవచ్చి నక్ష ణం దిగులుతో చచ్చేను, ఇప్పుడలా లేదు. లక్షల జనాభాని భరిస్తోన్న ఈ నగరానికి  నేనూ వోపౌరుడినయ్యాను. మా వూరూ, మా రోడ్లూ ఒక్కొక్కటే మరువగలగుతున్నాను.
వోరోజు సాయంత్రం అద్దెగదికి  వస్తున్నవేళ కోఠీ ప్రాంతంలో  అంతురద్దీలో  ఇరువై పులావున్న ఖరీదైన షాపుల్ని చూస్తూ నడ్సస్తోన్న శ్రనివాసరావు నన్ను ఢీకొన్నాడు. నేనూ,  అతనూ మొహామొహాలు చూచుకొన్నాం. అతను చప్పున నారెండు చేతులూ పుచ్చుకుని ఆదరంగా అన్నాడు.
"మళ్ళీ యెన్నాళ్ళకి మిమ్మల్ని చూచానుమాస్టారూ! కులాసానా?"
ఇంతదూరం ఒలికిస్తోన్న శ్రీనివాసరావుని యిన్నాళ్ళూ తలుచుకోనైనా  లేనందుకు నొచ్చుకున్నాను.
"రండి కాఫీ తాగుదాం"అన్నాను.
అతను నావేపు చిత్రంగా చూచి అన్నాడు.
" ఈ వూర్లో కాఫీ తాగడమే. వద్దుమాస్టారు.ఆ అలవాట్లు మానుకోండి."
ఇప్పుడు నేను నేర్చుకున్న అలవాట్లని యేకరువుపెడితే విని మతిపోగొట్టుకోగలడు శ్రీనివాసరావు. నిప్పులాంటి శ్రీని నిప్పులాటి  శ్రీనివాసరావునిచూచి నాలోని   'తాగుబోతు' సిగ్గుపడ్డాడు. భయమూ వేసింది.
శ్రీనివాసరావు తనతో తెచ్చుకున్న ఫ్లాస్కుని చూపించి అన్నాడు ఉపన్యాసథోరణిలో.
"ఇక్కడ మూడుపూటలా కాఫీతాగాలంటే రెండు మూడు రూపాయలైనా జేబులో వేసుకోవాలి.అందుచేత   యింటిదగ్గరే కాఫీ చేయించుకు తీసుకొస్తాను."
కాఫీ కోసం రెండురూపాయలు ఖర్చుపెట్టడం యిష్టం లేని శ్రీనివాసరావు. నేను 'సీసా కి కేటాయించిన ఖర్చువింటే నామొహం  మళ్ళీ  ఈ జన్మలో చూడడు.
ఇద్దరం అలా ఇష్టమొచ్చినట్టు తిరిగాము. తిరిగినంత సేపూ  శ్రీనివాసరావు మావూరి ముచ్చట్లే చెప్పాడు. మా వూరిపట్ల అతనికున్న గౌరవభావం గమనించి లోలోన నన్ను నేను తిట్టుకున్నాను. మావూరి ముచ్చట్లకి కొసమెరుపన్నట్టు అతనోవిషయం వివరించి చెప్పాడు.
"రోజూ నేను బస్టాండుకి వెడతాను, వూరొచ్చి న నాటినుంచీ   ఈ అలవాటు ప్రారంభమైంది. మిమ్మల్ని రిసీవు చేసుకున్నానాడూ  ఆ అలవాటుకొద్దే అక్కడికొచ్చాను. ఇదంతా యిందుకో తెలుసా మాస్టారూ! మవూరి బస్సు కోసం. ఆ బస్సుని చేతితో తాకి మవూరి సుఖాన్ని  నెమరేసుకునేందుకు...."




Related Novels


Rakshasi Neeperu Rajakeeeyama

Adivishnu Kathanikalu

Adi Vishnu Novels 2

Udyogam

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.