Home » adivishnu » Udyogam


మా వూరి శ్రీనివాసరావు  ఈ వూళ్ళో ఉన్నట్టు తెలియదు. నే నొస్తున్నట్టు తెలీని శ్రీనివాసరావు నన్ను చూడగానే  కొండంత ఆదరం మాపించేడు. నా సామాను బస్సునించి దింపడంలో సాయపడ్డాడు.
అప్పుడడిగేను-
"మి బంధువు లెవరైనా రావాలా?"
" బలేవారే?" మిరుమాత్రం మా బంధువులు కారా?"
అతనుకేవలం నాకోసం వచ్చాడంటే నే నమ్మను. లగేజీ తాలూకు శాల్తీలన్నీ సరిగ్గా చేరాయో లేదో లెక్క పెట్టుకున్నాను. శ్రీనివాసరావు అడిగేను-
"చెప్పండి! ఇప్పడు మనం ఎక్కడికి వెళ్ళాలి?"
" మికు మా రామమోహనరావు తెలుసా?"
"ఆ మిలట్రీ మిసాలాయనా?"
"అవును."
" తెలుసు, అతను ట్రూప్ బజార్లో ఉంటున్నాట్టా."
" కాసేపట్లో అతనొస్తాడు, అందరం కలిసే వెడదాం."
"మరి మిరొస్తున్నట్టు ఆయనకి తెలుసా?"
"రాశాను."
" అవుతే సర్లెండి"
" మి కవతల వేరే పనులేమైనా..."
"నో....నో...భోంచేసి మనూరి బస్సుని చూద్దామనిలా వచ్చేను. మిమ్మల్ని చూట్టంతో ఆ పని కాస్తా పూర్తయింది. నౌ ఆయామ్ ఫ్రీ" అన్నాడు శ్రీనివాసరావు గాలిలో చేతులూపుకుంటూ. తర్వాత మెల్లిగా , హాయిగా అందమైన ఆడపిల్ల నవ్వినట్టు నవ్వేడు.    
అతని నవ్వులో వెయ్యి దీపాలు వెలిగినమాట వాస్తనవమైతే కావచ్చు. మా  వూరికీ దురంగావుండి  ఇంత హాయిగా నవ్వగలగుతున్న శ్రీనివాసరావుమిద కోప మొచ్చింది నాకు. సొంత వూరొదిలి విసిరి పారేసిట్టు దూరంగా బ్రతికే మనిషికి హాయిగా నవ్వడం చాత కాకూడదు. నవ్వే హక్కు అతనికి లేదని నా అభిప్రాయం'
"ఎన్నాళ్లుంటారు?"మళ్ళీ  అతనే అడిగేడు.
"బదిలీమిద వచ్చేను గనక ఎన్నేళ్ళని అడగండి."కసికొద్దీ అన్నాను.
"గుడ్"
మరింక అతన్తో మాటలు పెంచుకోవాలనే అభిప్రాయం తెంచుకున్నాను.  నేనింత దూరం వచ్చినందుకు జాలిపడి  సానుభూతి పలుకుతుందనుకున్న నోరు   'శుభమని' .యాగీ చేస్తే మండుకు రాదూ మరి?
అతనే చెప్పుకొస్తున్నాడు .అతనీ వూరొచ్చి రెండు నెలలయిందిట. ఇక్కడే వాళ్ళు బావయ్యగారి పరపతిమిద వో ప్రైవెటు కంపెనిలో చేరాట్ట: రెండు వందల పై చిలుకు జీతమట.    
నేను రాముడికోసం ఎదురుచూస్తూ అతని మాటలన్ని విన్నాను. గేటుదాటి వస్తున్న రాముడ్ని చూడగానే శ్రీనివాసరావు చేతిని నొక్కి అన్నాను-
"మా వాడొస్తున్నాడు."
బ్రేకు వేసినట్టు శ్రీనివాసరావు మాట లాపేశాడు. రాముడు కిళ్ళీ నోటితో మెల్లిగా నవ్వుతూ సిగరెట్టుని పెదాలతో అందంగా పట్టి ఉంచి వో కన్ను మూసి , కుడి చేత్తో నా భుజం తట్టుతూ అన్నాడు-
" సారీ మైడియరి బాయ్! ఐ యామ్ లేట్!"
రాముడి  అవతారంలో చాలా మార్పొచ్చి పడింది. వాడ నెత్తిమిద వెంట్రుకలు ఆరంగుళం మేర పెంచి దానికి తగ్గట్టుకత్తిరింపు వేయించేడు. ఒంటిని గట్టిగా  అంటిపెట్టుకున్న ఫేంటుతోనూ, గాలికి రెపరెపలాడే కాగితంలాంటి షర్టుని భుజం వరకూ మడిచి కొత్తగా కనిపించేడు.ఇంగ్లీషు సినీమాలో పేరొందిన సినీమా నటుడిలా ఉన్నాడు. ఆ వేషం నాకు నచ్చదని వాడికి తేలీదు . ఇప్పుడు నా అభిప్రాయం చెప్పేందుకు అదే వేషం భయపెడుతోంది నన్ను.
పులకరింపుతో నవ్వక తప్పదన్నట్టే నవ్వేను.
సిగరెట్టు పొగని  తమాషాగా వదిలి, కాలిన సిగరెట్టుని కసాయివాడి కత్తిలాగున బూటుక్రింద నలిపి అన్నాడు-
" కెన్ ఉయ్ గో నౌ?"
" సామానుంది" అన్నాను బెరుగ్గా.
వాడో పర్యాయం నా హోల్డాలూ, పెద్ద ట్రంకూ రెండు  అట్ట పెట్టెలూ, ఒక చేతిసంచీ చూచి ఘొల్లున అరిచేడు.
"నాన్ సెన్స్. నువ్వొచ్చింది నాగాయలంక కాదు. బండెడు లగేజీ వెంట తెచ్చేవ్"
సిగ్గుపడ్డాను!
" ఎవడైనా చూస్తే- లాఫెట్ యువర్ ఫేస్!"
కోపం వచ్చింది,
"ఇప్పుడీ సంతనంతా ఎలా చేర్చడమనేది ప్రోబ్లమ్."
సహించలేక నేనూ  నోరు చేసుకున్నాను.
"ఒరేయ్.తెచ్చింది నేను. మీ సాయంలేకుండా చేర్చుకోగల సత్తా నాకుంది. అవసరంగా గొంతుచించుకోవద్దు."
విడిగా పడివున్న అట్టపెట్టిని ట్రంకుమిద ఉండేడు శ్రీనివాసరావు. అప్పటిగ్గాని అతన్ని  చూడలేదు రాముడు.     
"ఐసీ! మిరూ వచ్చారన్నమాట. అయితే చేయి కలపండీ.ముందీసరుకు రిక్షాల్లో  ఎక్కించండి" అన్నాడు రాముడు.
"నువ్వు కొంచెం రిక్షాల్లో  వాళ్ళతో బేరమాడు" అన్నాను థైర్యంగా.
రాముడు తిక్కగా నవ్వేడు.    
"నో బార్గేయిన్ బిజినెస్. ఇక్కడ మనసంగతి తెలీని రిక్షావాడులేడు. కమాన్. ఏయ్ గాడీ!"  వాడెవడ్నో పిలిచేడు నాప్రమేయం లేకుండా రెండు రిక్షాల్లో సామాను సర్దించేడు మూడో రిక్షాలో  నన్ను కూర్చోపెట్టి వాడు నా ప్రక్కన కూర్చున్నాడు. మిగిలిపోయిన శ్రీనివాసరావు నుద్దేశించి అన్నాను.
"మిరూ రండి"
"ఆయన్నెందుకురా ఇబ్బంది పెడతావ్. మిరూ వెళ్ళి రండి మాస్టారూ! థేంక్స్. గుడ్ నైట్."
అంతా క్షణంలో జరిగిపోయింది. మా రిక్షాలు కదిలాయి. శ్రీనివాసరావు ఒక్కడూ గేటుదగ్గర నించునిపోడం బాధకలిగించింది  నాకు.  అదే  రాముడితోనూ అన్నాను. దాన్ని వాడు చాలా తేలిగ్గా తీసుకుని శ్రీనివాసరావుగురించి యిలా అన్నాడు.




Related Novels


Rakshasi Neeperu Rajakeeeyama

Adivishnu Kathanikalu

Adi Vishnu Novels 2

Udyogam

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.