Home » vaddera chandidas » Anukshanikam 2
ఆశ్వయుజ సిద్దార్ది పూర్నిమా విశ, సమస్త ప్రకృతినీ కౌగలించు కొంటోంది. ఆర్తితో ఆ కౌగిట్లో తన్మయంగా వొదిగిపోయిన ప్రకృతి, లోతపనతో జ్వలిస్తోంది.
అవతల దూరంగా, పచ్చని పర్వతాల సామవుల్లో- అడవి రగిలి, రంగుల మంటలూ పొగలూ.
ఆమె బొక్కబోర్లా తిరిగి......జరిగి-
కుడి చెయ్యి అతని ఛాతీమీద నుంచి అటు తిరిగి అతని యెడమ చెవి పక్కనుంచి జుట్టులోకీ-
యెడమ చెయ్యి పచ్చగడ్డి మీదా, పచ్చగడ్డి వేళ్ళ బిగింపులోనూ.
స్తనాలు, అతని ఛాతీ పక్కగా మెత్తగా గుచ్చుతుంటున్నాయి.
కాలు, అతని మీదకి తిప్పబోయి చటుక్కున తీసేసి, పచ్చగడ్డిమీద అణిచింది. ఆ వొత్తిడికి అన్నట్లుగా, ఆమె కళ్ళలో తడి వుబికింది.
తడి వేడెక్కింది.
తొడల మధ్యలో చీర పొరలు పచ్చగడ్డి కొసలు నలుగుతున్నయై వొత్తిడికి.
అతని నుదుటిమీద పెదవులు అద్దింది.
అతని పెదవుల మీద పెదవులు అద్దింది. నాలికకోసతో అతని పెదవుల మీద సుతారంగా మెత్తగా తాకింది. మూతి సున్నాలా చుట్టి, అతని పెదవి మూల ముద్దెట్టుకుంది.
పారిజాతం పూలు రాలినట్లుగా చిరుచిరు ముద్దులు.
అతని పెదవులకి తన పెదవులు అతికించింది.
తెల్లని చల్లని మంచు పర్వతం కవలి, యెర్రని నెత్తురు పర్వతంలా నెత్తురు పర్వతం రగిలి, పేలిన అగ్నిపర్వతంలా -ఆమె సౌందర్య రసరౌద్రి.
పెదవుల్లోంచి జివ్వుమని షడ్రుచుల సంయోగంలోంచి అస్తిత్వరుని రుచికరంగా రుచిరంగా పెదవులలోని జలగా ప్రవహించి-మాధుర్యపుధార ప్రాణధార జీరధార తేనెధార పాలధార మంచుధారా అగ్నిధార ఆత్మధార.
పెదవులు దారగా పీల్చుతూంటే-ఆ ధార; కండరాలలో సకాలంలో" నెత్తుట్లో అణువణువులో వూపిరిలో జీవంలో ప్రవహించి ప్లావితంగా ప్రవహించి-ప్లా విత్రంగా ఆవహించి ప్రకృతంతా ప్రవహించి ప్రకృతంతా ఆవహించి-
ఆ రసోద్వేగ స్వప్నరాగలీన, ప్రవహించి ఆవహించి ; సమస్త ప్రకృతిలోంచి, పాదాలలోంచి కాళ్ళలోంచి, తొడలలోంచి నడుంలోంచి వక్షం లోంచి స్తనాలలోఁచి వీపులోంచి చేతుల్లోంచి కళ్ళల్లోంచి కనుబొమలలోంచి నుదుటిలోంచి శిరసులోంచిజుట్టులోంచి ప్రత్యణువులోంచి మనోరసవాహి మానవ శత సహస్ర తంత్రులై, వున్మాదంగా ప్రకంపించి విశ్వయన మానవ శత సహస్ర తంత్రులై, వున్మాదంగా ప్రకంపించి విశ్వయన ప్రకృతై, నీరూ నిప్పూ గాలీ నింగీ నేలా కాంతీ ఐ- పెదాలలోంచి అవిరామంగా అనంతంగా ప్రవహిస్తున్న రసధార స్థలించి- స్వప్న స్ఖలనం స్వప్నస్ఖలనంమంచు స్ఖలనం తేనేస్ఖలనం అగ్నిస్ఖలనం పాలస్ఖలనం ప్లావిత స్ఖలనం-అణువణువునా అస్తిత్వం అంతటా రజస్వలిత భగ్నజ్వాలాజ్వలన ప్రకంపనాంతర ఝరి.
స్ఖలనలీన రాగలీన స్వప్నలీన మౌనలీన నాదలీన విశ్వలీన స్వప్న విశ్వలీన విశ్వరాగ స్వప్నలీన విషాదాశృలీన అనందాశృలీన విషాదానందాతీత లీన తాదాత్మ్య రసోన్మాద జ్వలనలీన స్వప్న విశ్వైక్య రసయోగ విశ్వ సంప్లావిత నిర్వాణం-
మరికొన్ని క్షణాలకి;
విద్యుదయస్కాంత వలయంలో అపరిమాణ రేణువులా చలించిన అనంత్ రెడ్డికి, నిశ్చల శిలా స్పర్శలా అనిపించి- పెదవులు తప్పించి, "స్వప్నా" అన్నాడు.
స్వప్న లేదు. స్వప్న, స్వప్న.
"స్వప్నా" అన్నాడు, స్వప్నంలోనే వుండే అనంత్ రెడ్డి.
"....."
పక్కకి కదిలి జరగబోయి-
అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి.
గిరుక్కున తిరిగి ఆమెని చూసి, పక్షం మీద చెయ్యివేసి కదుపుతూ "స్వప్నా" అన్నాడు. స్పృహ కోల్పోయిందనుకున్నాడు.
అమాంతం లేచి, వొక చెయ్యి మోకాళ్ళ కిందుగా, రెండో చెయ్యి వీపు కిందుగా దూర్చి, ఆమెని యెత్తుకుని నడిచి వొచ్చి కారులో పడుకోబెట్టాడు.
కారులో కూచున్నాడు. స్టార్ట్ చెయ్యబోయాడు. అతని కాళ్ళూచేతులూ వొణుకుతున్నాయి.
కారు తలుపు కొద్దిగా తెరిచి రోడ్డుమీదకి అటూ యిటూ చూస్తున్నాడు.
వో లారీ దూసుకు వెళ్ళిపోయింది. వో చిన్నకారు వొస్తోంది. లేచి రోడ్డు మధ్యలో నిలుచుని రెండు చేతులూ అడ్డంగా వూపాడు.
కారు ఆగింది.
కారులో యిద్దరు మగవాళ్ళు, యిద్దరు ఆడవాళ్ళు, ముగ్గురుపిల్లలు
స్పృహ కోల్పోయిందనీ, తను కారు నడిపే స్థితిలో లేనట్లూ చెప్పి వాళ్ళలో వొకరికి వీలైతే తనకారు డ్రైవ్ చెయ్యమని అర్ధించాడు. కళ్ళల్లో నీళ్ళు.
కార్లు కదిలాయి.
యిరవై నిమిషాల్లో కార్లు వుస్మానియా ఆస్పత్రి ముందు ఆగాయి.
"మీకు శ్రమ యిచ్చాను. తరవాత కలుస్తాను" అని వాళ్ళ విజిటింగ్ కార్డులు తీసుకున్నాడు అనంత్ రెడ్డి. వాళ్ళ కారు వెళ్ళిపోయింది.
లోనకి యెమర్జెన్సీ రూంలోకి పరుగుతీశాడు.
లోనకి చేతులమీద పట్టుకుని తీసుకువెళ్ళారు.
డాక్టరు పరీక్షించి-మూడో నిమిషంలో, అనంత్ రెడ్డి భుజంమీద చెయ్యివేసి, "సారీ" అన్నాడు. మరుక్షణంలో అనంత్రెడ్డి కుప్పగాకూలి పోయాడు. స్పృహ తప్పింది.
ఆస్పత్రీ సిబ్బంది వైద్య సపర్యలతో అరగంటకి స్పృహవొచ్చింది. అతని కళ్ళవెంట నీళ్ళు ధారగా కారుతున్నాయి.
అడ్రసు వివరాలు తదితర అంశాలు అడుగుతున్నారు.
కలం యిమ్మన్నట్లుగా చేత్తో సూచించాడు. కాలం కాగితం యిచ్చారు శ్రీపతి హాస్టలు అడ్రసు రాశాడు. జేబులోంచి పర్స్ తీశాడు.
ఆ రెండూ అందుకుని అడ్రసు చూసి క్షణకాలం ఆలోచించి-పర్స్ లోంచి యిరవై రూపాయల నోటు తీసి, అదీ అడ్రసు కాగితమా వొక వార్డ్ బాయ్ కి యిచ్చి టాక్సీలో వెళ్ళి తీసుకురమ్మన్నాడు.
డాక్టర్ పర్స్ అందించాడు. అందుకుని జేబులో పెట్టుకుంటూ వుండగా ఆమె పింతండ్రీ నాగిరెడ్డి గుర్తొచ్చి ఫోన్నంబరు చెప్పాడు.
ఐదు నిమిషాలు. లేవబోయాడు. కళ్ళు తిరిగినట్లనిపించి మళ్ళీ పడుకున్నాడు.



