Home » vaddera chandidas » Anukshanikam 2
యిద్దరూ వెనక్కి తిరిగి గుమ్మం లోపలికి వెళ్ళారు.
గుమ్మం అవతల, "భుట్టో యీజ్ హ్యాంగ్డ్ హిహి" అని అంటూ అన్న పక్కన నుంచుని గెంతుతున్నాడు సుబ్రహ్మణ్యం.
యిద్దరూ వెర్రిమొహా లేసుకుని బయటికొచ్చి, "రేపు రాన్రి" అని అన్నదమ్ములు ముందు వెడుతూంటే, "వుయ్ గాట్ ఆల్ ది బేసిక్ మేటర్. జెల్దీ క్యూర్ ఐపోతడు" అన్నాడు శాయోజీరావు.
'క్యూ రవుతాడో కూరవుతాడో -' అని దిగులుగా అనుకుంటూ, "అలాగేనండి. రేపు యిదే వేళకి తీసుకొస్తాం" అన్నాడు శాయోజీరావు.
129
తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ; వెంకటావధాని, సుబ్రహ్మణ్యంల సస్పెన్షన్ కి కారకులైన వెంకటేశ్వరరావు. శఠగోపంలను పోలీసులు అరెస్టు చెయ్యడంతో, డొంకంతా కాకపోయినా కొంతమేరకి కదిలింది. రాతి పిండాల నుంచే కక్కించగల పోలీసులు వీళ్ళిద్దరినుంచి చాలావిషయాలు కక్కించారు.
ఐతే వాటిలో కొన్నిటిని సస్పిషన్ గ్రౌండ్స్ కూడా దొరకక వొదిలెయ్యగా ఐదారుగురిని అరెస్టు చెయ్యటానికి వీలైంది. యీ ఫోర్జరీ కేసు వెదుకులాటలో దొంగనోట్ల ముఠా వొకటి. స్మగ్లింగ్ ముఠా వొకటి అరబ్బు షేకులకి ఆడపిల్లల్ని మోసగించో మోజు పెట్టో అమ్మేసే ముఠా, వొకటి బయటపడ్డాయి.
దొంగనోట్ల చెలామణికీ హోటల్ అన్నవన్ కేంద్రం అని అనుమానాధారాలు దొరికాయి. ఆ లింకులు అటు ఢిల్లీ దాకా యిటు కొయం బత్తూరు దాకా వున్నాయి. హోటల్ కిచెన్ హాలుకి ప్రక్క గోడలోని దొంగ అరలో దొంగ నోట్ల కట్టలు దొరికాయి. మేనేజరుచేత కక్కించిన విషయాల ఆధారంగా విజయ్ కుమార్ ని అరెస్టు చేశారు. డి.ఐ.జీ. గా పని చేస్తున్న వాళ్ళ చుట్టం మీదే రెండు యె.సి.బి కేసులు యిప్పటికే సాగుతూ వుండటంవల్ల అతను ఆదుకోలేకపోయాడు. ఐతే యిటీవల విరసం వొదిలేసి గోవర్ధన్ రెడ్డికి దగ్గిరయ్యి అతనూ తనూ కలిసి బినామీ పేర్లతో రెండు పెద్ద వ్యాపారాలు ప్రారంభించారు. ఆ దృష్ట్యా గోవర్ధన్ రెడ్డి తెర వెనక నుంచి పలుకుబడి వుపయోగించి బెయిల్ మీద విడుదల చేయించాడు. ఐతే గోవర్ధన్ రెడ్డి పేరు యేరకంగానూ రంగంలోకి రాలేదు. మూలవిరాట్టు, విజయ్ కుమార్ పింతండ్రి తప్పుకోగలిగాడు అతనిని అరెస్టు చెయ్యటానికి ఆధారాలు దొరికితే--- అపరిష్క్రృతంగా వున్న రెండు ఖూనీ కేసులు, వొక ఆత్మహత్య కేసు విడివడే అవకాశాలుండేవి. యీ అదును చూసి, విజయ్ కుమార్ మొదటి భార్య సీత వాళ్ళ తరపు లాయరు సీత మరణం హత్య అని కొన్ని పాయింట్లు లేవనెత్తి కేసుకి కొత్త మలుపు యిచ్చాడు.
పాతికవేల రూపాయల ఆ సిజూసి హోటల్లోని వొక వంటతనితో, ఆ గూడూ ఆ నోట్లూ తన పనేనని చెప్పించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యిది కల్పించిన సాక్ష్యం అంటూ వాదించటం మొదలెట్టాడు. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీత వాళ్ళకి బంధువు.
మొదట్లో విజయ్ కుమార్ బెంబేలెత్తిపోయాడు. కనకదుర్గ చివాట్లే సింది - యీ తప్పుడు పనులు చెయ్యకుండా చట్టబద్దంగా వ్యాపారాలుచేసుకో వొచ్చుగా-అని. స్త్రీల విషయంలో విరసం విషయంలో వ్యాపారం పట్ల ఆసక్తి విషయంలో తను గీసిన గీటులో వుంటున్నాడని సంతోషిస్తోంది. వుండటం మొదలెట్టి వ్యాపారం మీదకి దృష్టి బాగా మళ్ళి వీటిలోకి స్వయంగా దిగాడు. యిలాంటివి ప్రారంభించినట్లు ఆమెకు తెలియదు. కనకదుర్గ కాళ్ళు పట్టుకుని-తన ఫ్రండ్ వందనకి చెప్పి వాళ్ళ నాన్న ఆదుకునేలాగా చూడమని. "ఛీఛీ. యిట్లాంటి పనుల విషయంలో వందననిచస్తే అడగను" అంది "మీ నాన్నని రెండు లక్షలు సర్ధమను. డబ్బు విరజిమ్మాల్సిన పరిస్థితి యీ ప్రస్తుత పరిస్థితిలో క్యాష్ సరిగా రొటేట్ అవదు" అని ప్రాధేయపడితే, "ఆ పనైతే చేయించుతాను" అంది యిప్పించింది. అది కొందరు అధికారు లకి పంచి, కేసు బలహీనపరిపించె ఆలోచనలో వున్నాడు. "నా పేరు గిట్ల బయటకు తెస్తివా, అస్సలు కే మోసమోస్తది" అని వార్నింగిచ్చాడు గోవర్ధన్ రెడ్డి. "ఛఛ, ప్రాణంపోయినా వినను సీనులోకి తీసుకురాను" అన్నాడు విజయ్ కుమార్.
సంగ్లింగ్ కి సంబంధించి యింద్రారెడ్డి చిక్కాడు. యింద్రారెడ్డి పోలీసు కస్టడీలో వుండగా సూర్యప్రకాశ్ పేరు బయటపెట్టారు. అతని "ఆంటీ" ఉనికి యింద్రారెడ్డికికూడా తెలియదు. సూర్యప్రకాశ్ ని అరెస్టు చెయ్యటానికి ఆ ధారాలెంత మాత్రం దొరకలేదు-యింద్రారెడ్డి మాటలు తప్ప యింద్రారెడ్డి చెప్పిన ప్రకారం సూర్యమహల్ కి వెళ్ళి గాలించారు. యెక్కడ పడితే అక్కడ తవ్వినా పడగొట్టినా భూగృహం అంటూ దొరకలేదు. సూర్య ప్రకాశ్ యెదురు కేసు పెట్టాడు-తన విరోధులతో కుమ్మక్కయి కక్ష సాధింపుగా చేశారని, నష్టపరిహారానికి పరువు నష్టానికీ, దావావేశాడు.
నేరం తనమీదనుంచి సూర్యప్రకాశ్ మీదకి పడితే తను స్వల్ప శిక్షతో త్వరలో బయట పడవొచ్చుననీ సూర్యప్రకాశ్ కి ఆ జన్మ ఖైదు వేస్తారనీ వూహించి తనకి తెలిసిన సమాచారం అందిస్తే-చివరికి యిలా అయ్యేసరికి యిప్పుడు వొణికిపోతున్నాడు యింద్రారెడ్డి - తను బయట పడిన మరుక్షణం తన ప్రాణాలు దక్కవని.
అరబ్బులకి ఆడపిల్లల్ని మాయజేసో మోసగించో అమ్ముకున్న నేరానికని, వెనక నిజాం కాలేజీలో చదివిన అక్తర్ ని అరెస్టు చేశారు అతని తండ్రి గవర్నమెంటు ప్రెస్సులో కంపోజిటర్ గా చేస్తూండేవాడు, అప్పట్లో యిప్పుడు వాళ్ళకో మంచి బంగళా వుంది. యీ విషయంలో అక్తర్ కి తోడుగా యింద్రారెడ్డి కూడా వున్నట్లు అనుమానాధారాలు దొరికాయి పోలీసులకి.
సూర్యప్రకాష్ విడిగా నడుపుతున్న మ్యాస్సేజ్ పార్లర్ మీదకూడా వొకేసమయంలో దాడిచేశారు. అప్పుడు నగ్నంగా వున్న యువతులు కొందరు మగాళ్ళకి వొళ్ళు పడుతూ సరససల్లాపాలలో వుండగా పట్టుకున్నారు. ఆ ఆధారంగా ఆ మ్యాస్సేజ్ పార్లర్ ని మూయించాడు. అందుగురించి, సూర్య ప్రకాష్ ని అరెస్ట్ చెయ్యబోతే అదితనది కానేకాదనీ తానొక కస్టమర్ ని మాత్రమేననీ, ఐతే తనకెప్పుడూ అలాంటి సరసల్లాపాల అనుభవంలేదని చెప్పాడు. లైసెన్సులు రికార్డులు అవీ తీయించి చూస్తే, పేరు సూర్యప్రకాశ్ అనే వుందిగానీ ఆ దరఖాస్తు ఫారాలమీదా యితరచోట్లా సూర్యప్రకాశ్ ఆ వున్న నంతకాలం అతని దస్తూరి కాదని తేలింది. కిరాయి మనిషితో చాడనే ఆరోపణలతో అరెస్ట్ చెయ్యాలని చూసినా వీలుపడలేదు. చివరికి ఆ ఆరోపణలతో కేసుపెట్టే ఆలోచనలో వున్నారు పోలీసులు.
యీ దాడులు జరిగిన వొక గంట తరవాత సూర్యమహల్ పరిసరా లలో యిద్దరువ్యక్తులు తుపాకీ కాల్పులకిగురై మరణించారు. వాళ్ళు సూర్యమహల్ కి చెందిన వ్యక్తులు అని పోలీసులు నిర్దారించలేకపోయారు వాళ్ళ పక్కనే తుపాకి కూడా పారేసివుంది. తుపాకీమీద యెలాంటి గుర్తులూ ముద్రలూ లేవు. నాటు తుపాకి.



