Home » vaddera chandidas » Anukshanikam 2
"ఫూల్, పురి కర్రతో యెట్లా తీస్తార్రా తాడుతో కర్రతో చావబాదుతారు" అన్నాడు సుబ్రహ్మణ్యం.
"అవును భుట్టో దోస్త్! నువ్వు పాకిస్థాన్ ప్రెసిడెంట్ వి. మంచిగ చద్వుకున్నోనివి తెలివైనోనివి. అందుకే నీ కంత తెల్సు-నిన్ను కాగితాలు పొడావుగ కట్టి పురి తీసిన్రులే."
"అవును" అని యేడుస్తున్నాడు సుబ్రహ్మణ్యం.
శేషావతారం చిటికె వేసి పుత్సాహంగా గెంతి, "భుట్టో దోస్తు. నిన్ను వురితీసినంక నీ భార్య బేగం సాయిదా, బిడ్డలూ యేడుస్తున్నరులే!" అన్నాడు.
సుబ్రహ్మణ్యం మరింక యేడవటం మొదలెట్టాడు.
శేషావతారం వుత్సాహంగా కూర్మావతారం చెవిలో, "గాట్ ది పోయింట్ హాయ్ మర్డర్డ్ యె పర్సన్ అది కన్సీల్ చేసెంటంద్కు ఫోర్జరీ కేస్ తోటి కవరు చేసుకుంటున్నపుడు తనను" అన్నాడు
"యిడియట్ వాని మొకం మర్డరర్ మొకమోలె వున్నదిరా?" అన్నాడు కూర్మావతారం గొంతు బిగించి చిన్నగా.
"యస్ వున్నది నీ మొకమోలె" అన్నాడు శేషావతారం.
"హిఁ హిఁ" అన్నాడు కూర్మావతారం.
"హిఁ హిఁ" హి హ్యాంగ్డ్ మి, కూర్మావతారం" అన్నాడు సుబ్రహ్మణ్యం.
శేషావతారంలేచి టేబిలు దగ్గిరికి వెళ్ళి యేదో రాసినట్టుకొచ్చి, "నీకు రీ అప్పాంట్ మెంట్ ఆర్డర్స్ యిచ్చిన్రు చూడు" అన్నాడు సుబ్రహ్మణ్యంతో.
అందుకుని చూసి, "ఫూల్ యిది ఫోర్జ్ డ్ పేపర్ లెటర్ హెడ్ కాదు" అన్నాడు సుబ్రహ్మణ్యం.
"స్పెషల్ ఆర్డర్ బ్యాంక్ డైరక్టర్ పర్సనల్ స్లిప్ లెటర్ ఆర్డర్" అన్నాడు శేషావతారం.
డైరక్టర్ కి ఆ పవర్స్ వుంటాయి అలా స్లిప్పులమీద కూడా చాలా ముఖ్యమైనవి కూడా రాసి పంపుతారు.
"యిది నీకెక్కడిది?" అన్నాడు సుబ్రహ్మణ్యం.
"బ్యాంక్ డైరక్టర్ యిచ్చిండు నీకిమ్మని" అన్నాడు శేషావతారం.
"వోరి చవటా, మా బ్యాంక్ డైరెక్టర్ మగకాదు ఆడ, ఆడది- లాగూ చొక్కా తొడుక్కునే ఆడది."
"దానికొక పెండ్లామున్నది." అన్నాడు కూర్మావతారం.
"నీలాంటి పెళ్ళాం" అన్నాడు సుబ్రహ్మణ్యం.
"హిఁ హిఁ" అన్నాడు కూర్మావతారం.
"హిఁ హిఁ భుట్టో యీజ్ హ్యాంగ్డ్. హిఁహిఁ" అని వాళ్ళిద్దరి పిర్రల మీదా రెండు చేతుల్తో చరువులువేసి, ముందుకు అడుగులు వేశాడు, సుబ్రహ్మణ్యం.
"సీ హి హ్యాజ్ బికంజూబిలంట్. దారి కొస్తున్నడు" అన్నాడు శేషావతారం కూర్మావతారంతో.
గిరుక్కున వెనక్కి తిరిగి, "లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, భుట్టో యీజ్ హ్యాంగ్డ్. హిఁ హిఁ" అంటూ వెళ్ళి యేటవాలు కుర్చీలో కులాసాగా కూర్చున్నాడు, సుబ్రహ్మణ్యం.
కాళ్ళు వూగిస్తూ, "ఐయామ్ జియా ఐ ఆర్డర్ యు కం హియర్ భుట్టో" అన్నాడు సుబ్రహ్మణ్యం దర్పంగా.
"కాని జియా సాబ్ నువ్వు భుట్టోను హ్యాంగ్ చేస్తివి.
"జియా ది గ్రేట్ ని, చంపి మళ్ళీ బతికించగలను" సుబ్రహ్మణ్యం గొప్పగా ముఖంపెట్టి.
"సీ హి యీజ్ కమింగ్ యిన్ టు ది ఫోల్డ్!" అన్నాడు కూర్మావతారం.
"యు ఆర్ వోన్లీ హ్యాంగ్ మెన్. యిన్ సిగ్నిఫికంట్ హ్యాంగ్ మెన్. గెటవుట్." అని అరిచాడు సుబ్రహ్మణ్యం.
యిద్దరూ గుమ్మం వైపు నడుస్తున్నారు.
"హిఁ హిఁ" అంటున్నాడు సుబ్రహ్మణ్యం.
"యీ పొద్దుకింక పరిద్దపేం- రాత్రికి కేసు మంచిగ స్టడీ చేద్దం. మర్ల రేపు తీస్కరమ్మందం. యీజీ. వెరీ సింపుల్ కేస్." అన్నాడు శేషావతారం.
"యిడియట్. సింపుల్ కేసెస్ ఆర్ ది మోస్టు డిఫికల్ట్ అని చద్వలే?" అన్నాడు కూర్మావతారం.
చప్పుడవకుండా వాళ్ళ వెనక్కి వొచ్చి, "దిస్ యీజ్ కాన్ఫ్సిరసీ బిఫోరీ ది హ్యాంగింగ్" అని గట్టిగా అరిచాడు సుబ్రహ్మణ్యం.
జడుసుకుని యెగిరిపడ్డారు యిద్దరూ.
"హిఁ హిఁ" గుడ్ యు ఆర్ మై ఫ్రండ్స్, భుట్టోస్ ఫ్రండ్స్" అని వాళ్ళ భుజాలమీద చెయ్యివేశాడు సుబ్రహ్మణ్యం.
"హిఁ హిఁ" అన్నాడు కూర్మావతారం.
"వెరీ నైస్ ఫ్రండ్స్ వుయ్ ఆర్. మర్ల రేపు కల్సుకుందం. ముచ్చట్లు చెప్పుకుందం" అన్నాడు శేషావతారం.
"వొకే సీయూ మైడియర్ శేషాకూర్మా" అన్నాడు సుబ్రహ్మణ్యం.
"నీకు కుర్మా, కోడి కుర్మా యిష్టమేనా?" అన్నాడు శేషావతారం.
కూర్మావతారం గుర్రుగా చూసి, "నీకు శేషు కుర్మా అంటే పాముకుర్మా యిష్టమేనా?" అన్నాడు.
"షటప్ నేను బ్రాహ్మన్ని. శాకాహారిని. సుబ్రహ్మణ్యాన్ని. పావుల దేవున్ని" అన్నాడు సుబ్రహ్మణ్యం.
"యస్ యస్ నువ్వు పాములదేవునివి. పాములను పోషించగలవు చంపగలరు. యు ఆర్ స్నేక్ కింగ్. యు ఆర్ యె రూలర్" అన్నాడు శేషావతారం.
"యస్ నేను కింగ్ ని. రూలర్ ని. ఐ విల్ రూల్ ది రూల్స్. పీ, రూలింగ్ ది రూల్స్, రూలింగ్ ది రూల్స్. "హిఁ హీఁ బట్ ది రూలర్
రూల్డ్. అందుకే భుట్టో యీజ్ హ్యాంగ్డ్. భుట్టో యీజ్ హ్యాంగ్డ్, హీహిఁ"
"మర్ల మొదటికొస్తున్నడు" నీరసంగా అన్నాడు కూర్మావతారం, శేషావతారం చెవిలో.
"దట్ యీజ్ ఫైన్. వొక సర్కిల్ కంప్లీట్ ఐపట్లు యె చెయిన్ ఆఫ్ సర్కిల్స్ మన థెరపీ థియరీ అవర్ యిన్ వెన్షన్" అన్నాడు శేషావతారం చెవిలో.
"దట్ యీజ్ ఫైన్. వొక సర్కిల్ కంప్లీట్ ఐపట్లు యె చెయిన్ ఆఫ్ సర్కిల్స్ మన థెరపీ థియరీ అవర్ యిన్ వెన్షన్" అన్నాడు శేషావతారం.
"వీడు యాడ?" అన్నాడు కూర్మావతారం, సుబ్రహ్మణ్యం కనపడక.
గది అంతా వెదికారు. డ్రాయరు కిందా, కుర్చీ వెనకా, అల్మారా వెనకా- వెదుకుతున్నారు.
తలుపు కొద్దిగా తెరిచి, "సార్" అన్నాడు శాయోజీరావు.



