Home » vaddera chandidas » Anukshanikam 2
ఆ మాటలోని పరిహాసం, శాంతకీ శాయోజీరావుకీ అర్ధమైంది.
మరసటి రోజు ఆఫీసులకి యెలాగూ సెలవు వుదయం యేడున్నరకి బయల్దేరి సుబ్రహ్మణ్యాన్ని యెర్రగడ్డ తీసుకువెళ్ళారు; అతని తండ్రి, అన్న.
అక్కడ డాక్టర్లు తక్కువ డ్యూటీ యెక్కువ.
పదకొండున్నరకి సుబ్రహ్మణ్యాన్ని వొక డాక్టరు పరీక్షించి, "మేము టఫ్ కేసెస్ మాత్రమే టేకప్ చేసి అడ్మిట్ చేసుకుంటాం? యిది చాలా మైల్దర్ కేసు. రోజూ గానీ రోజు నిడిచి రోజుగానీ వరసగా కన్సల్టింగ్ టైప్ ట్రీట్ మెంట్ అవసరం. అంత వ్యవధి వుండదు మాకిక్కడ. కాగా మీకూ దూరభారం వూళ్ళో మానసిక వైద్యులెవరినన్నా సంప్రదించండి." అని సలహా యిచ్చాడు ఆ డాక్టరు.
"మామూలు డాక్టర్లంటే తెలుసుగానీ మానసిక వైద్యులు మాకెవరూ తెలియరండీ మీ రెవరినన్నా సజెస్ట్ చేస్తే-"
"కొందరున్నారు. యీ మధ్య కొత్తగా వొక క్లినిక్ ప్రారంభమైందట. అవతారం మెంటల్ క్లినిక్ కనుక్కోండి."
"అడ్రసూ-"
"అడ్రసు నాకూ తెలియదు. టెలిఫోన్ డైరెక్టరీలో చూడండి"
మధ్యాహ్నం రెండున్నరకి యింటికి తిరిగి వొచ్చారు.
భోజనం దగ్గిర కూచుని, "హిఁహిఁ. భుట్టోకి వుదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ పెట్టారట, వురి తియ్యటానికి ముందు. చదవండి. డీటెయిల్స్ పేపర్లో యిచ్చారు. సీక్రెటేంకాదు. అందరికీ తెలుసు యెవరి నడిగినా చెప్తారు, భుట్టో వురితీత సంగతి. భుట్టో వురితీత. భుట్టో వురితీత హిఁహిఁ" అని వెర్రిగా నవ్వుతూనే అంటున్నాడు సుబ్రహ్మణ్యం.
ఐతే కడుపుకి సగానికిగానీ మరీ నిండుగాగానీ తింటున్నాడు రాత్రి పీక దాకా పట్టించాడు. వుదయం తినలేదు సరిగా యీ పూటా సరిగాతినటం లేదు.
అతని అన్న బయటికెళ్ళి, హోటల్లో టెలిఫోను డైరెక్టరీలోనంబరు వెతికి ఫోను చేశాడు, అవతారం మెంటల్ క్లినిక్ కి. సాయంత్రం ఆరున్నరకి రమ్మంటే బయల్దేరారు సుబ్రహ్మణ్యాన్ని తీసుకుని అతని తండ్రి, అన్న.
అవతారం మెంటల్ క్లినిక్ అంటే-ఆ మధ్యకాలంలో వుస్మానియా యూనివర్శిటీ కాలేజీలో యెమ్మెస్సీ సైకాలజీ చదివిన పానకాల శేషావతారం పచ్చిపులుసు కూర్మావతారం యిద్దరూ కలిసి ప్ర్రారంభించిన క్లినిక్. యెమ్మెస్సీ సైకాలజీ తరవాత యిద్దరూ కలిసే బొంబాయిలోనూ, బెంగుళూరులోనూ క్లినికల్ అండ్ మెంటల్ సైకాలజీలో డిప్లొమాలు తీసుకున్నారు యేడాదిక్రితం యీ క్లినిక్ తెరిచారు. క్లినిక్ పేరు కింద పి.కె అవతారం, పి.యస్. అవాతరం అనే పేర్లు డిగ్రీలూ డిప్లొమాలు తీసుకున్నారు యేడాదిక్రితం యీ క్లినిక్ తెరిచారు. క్లినిక్ పేరు కింద పి.కె అవతారం, పి.యస్. అవతారం అనే పేర్లు డిగ్రీలూ డిప్లొమాలు, సంప్రదించే వేళలు రాయించారు.
అదోలాగా వెర్రి చూపులు చూసే పచ్చిపులుసు కూర్మావతారాన్ని పిచ్చిపులుసు కూర్మావతారం అని అంటూండేవాళ్ళు సెక్సీగా కనిపించే ఆడవాళ్ళని నిలుగుడ్లేసుకుని చూస్తుండేవాడు. అతను అలా చూస్తే ఆడవాళ్ళకి కోపమో యిష్టమో కలిగేదికాదు. పరిహాసంగా నవ్వొస్తుంది. అప్పుడప్పుడు వున్నట్లుండి అకారణంగా రెచ్చిపోయి మాట్లాడే పానకాల శేషావతారాన్ని పూనకాల శేషావతారం అని అంటూండేవాళ్ళు.
వీళ్ళు సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్ళినవేళకి, యీమధ్యనే వొచ్చిన వొక హిస్టీరియా కేసు చూస్తున్నారు.
సైకోయెనాలిసిస్ కి వాడే వెల్ యెక్విప్ద్ రిలాక్సింగ్ ఛెయిర్ లో ఆమె పడుకునుంది. కాళ్ళు కింద వైపు బోర్డుమీద ఆనించి తల మెత్తటి కుషన్ మీద ఆనించి.
చిన్నప్పుడు యెప్పటినుంచి బట్ట లేసుకునేదానివి? స్నానం చేసేటప్పుడు బట్టలు తీసేసి వొళ్ళు చూసుకునేదానివా? మీ ఆయనని మొదటిసారి చూసినప్పుడు నీకు యెలా అనిపించింది? ఆకలిబాగా వుంటుందా? సినిమాలు చూస్తావా? సంభోగం అంటే యిష్టమా? అయిష్టమా? మీనాన్నంటే ఇష్టమా అయిష్టమా? వంటి రకరకాల ప్రశ్నలు, మైల్డ్ యూఫోరిక్ డ్రగ్ యివ్వటం కబుర్లలోకి దించి వరసనే తన అన్ని విషయాలూ ధారగా చెప్పించటం. సజెషనూ కాంట్రానజెషను వంటివన్నీ ఉపయోగిస్తుంటారు.
ఆమె రెప్పలు విప్పేసరికి- కూర్మావతారం ఆమె చనుకట్టువంక తదేకంగా చూడటం గమనించిన ఆమె, కూర్మావతారం ముఖంలోకి చూసింది 'హీఁహీఁ' అని యికిలించాడు కూర్మావతారం, "బాగుంది అట్లా చూస్తే" అంది.
"హీఁ హీఁ" అని యికిలిస్తూ మళ్ళీ చూశాడు కూర్మావతారం.
"షటప్" అంది ఆమె.
చిన్నబుచ్చుకుని అంతలోనే తేరుకుని, "హిస్టీరియా కేస్ కద యీ టెక్నిక్ లో యిదొక తరీఖ" అన్నాడు కూర్మావతారం.
"నీ మొహం, హిస్టీరియా నీకా నాకా!" అంది.
"హిస్టీరియా ఆడవాండ్ల కొస్తది" అన్నాడు కూర్మావతారం.
"అందుకే నాకు హిస్టీరియా కాదు. ఆడపిల్లవి నీకే హిస్టరియా" అంది.
"హీఁ హీఁ" అని మళ్ళీ ఆమె చనుకట్టువంక చూశాడు కూర్మావతారం.
అంతలో శేషావతారం "యిటు చూడమ్మా నా వేలువంక" అని చూపుడు వేలు చూపెట్టాడు.
అతని వేలి కొనవంక చూసింది.
"యేమి కనిపిస్తున్నది?" అన్నాడు శేషావతారం.
"కాలు" అంది.
"యిది కాలా?" అన్నాడు శేషావతారం.
"కాలు చూపెట్టావా! వేలు చూపెట్టావా?" అంది.
"వేలు" అన్నాడు శేషావతారం.
"వేలు చూపెడ్తే కాలు కనపడటానికి, నేనేమన్నా గుడ్డిదాన్నా పిచ్చి దాన్నా మీలాగా" అని నవ్వింది.
"దట్స్ రైట్ గ్రాస్ప్" అని మెచ్చుకుని, "మీ బావ అంటే యిష్టమేనా?" అన్నాడు శేషావతారం.
"యిష్టమే" అంది.
"మీ బావ తాన యెన్నడైన పండుకొన్నవా?" అన్నాడు శేషావతారం.
"పడుకున్నా, చిన్నప్పుడు" అంది.
"పెద్దదానివైనంక వండుకోలేదా?" అన్నాడు శేషావతారం.
"బుద్దిలేదూ అట్లాంటి మాటలడగటానికి! పెద్దయినాక అడ్డమైనవాళ్ళ దగిరా పడుకుంటారా? నా మొగుడు దగ్గిర పడుకుంటా. యిష్టంగా అనిపించ దగ్గర కూడా పడుకోను"



