Home » vaddera chandidas » Anukshanikam 2
కారు కదిలింది . వీధి దాటుతుండగా యెక్కడికి వెళ్ళాలో చెప్పాడు.
పావుగంటకి ----కారు, రామనాధం బంగళా వున్న వీధిలోకి మళ్ళింది.
కారు రామనాధం ఇల్లు దాటుతోంది. రవి మౌనంగా వుండి పోయాడు. కారు ముందుకు వెళ్ళింది.
ఎటో తెలియక డ్రైవరు అడిగాడు ------వీధి చివరన.
"పోనియ్" అన్నాడు రవి.
ఎటో అర్ధం కాక, యెడమకి తిప్పబోయి తిప్పకుండా కుడి వైపుకి తిరిగి నిదానంగా పోతున్నాడు డ్రైవర్.
కారు సాగిపోతోంది. నాలుగు మైళ్ళు వెళ్ళింది.
రవి చెప్పాడు యెక్కడికి వెళ్ళాలో.
డ్రైవర్ కి అర్ధం కాక, "ఆటే పోయినం గద, సాబ్!" అన్నాడు.
'అట్లాగా, నేను గమనించలేదు " అన్నాడు రవి.
పావుగంటకి కారు మళ్ళీ రామనాధం బంగళా వున్న వీధిలోకి తిరిగింది.
"ఆ పచ్చ బంగళా" అన్నాడు రవి.
కారు గేట్లో కి మళ్ళి పోర్టికోలో ఆగింది.
కారులో కూచునే తనొచ్చినట్లు ఫలానా వాళ్ళకి చెప్పమన్నాడు రవి.
డ్రయివరు వెళ్ళి ------యెవరో 'మనిషి కనిపిస్తే "మినిస్టర్ రవీ సాబ్ వోచ్చిన్రని నల్ నీ మేమ్ సాబ్ కి చెప్పు" అన్నాడు.
సాయంత్రం ఐదు గంటలు.
నళిని, పడక గదిలో , అప్పుడే స్నానించి ముస్తాబు ముగించి, మెడకీ , చెవులకీ చేతులకీ చేతి వేళ్లకీ కొత్తగా చేయించిన కెంపుల సెట్టు పెట్టుకుని లేచి నిలువుటద్దంలో తన వంక వొకసారి చూసుకుంది.
ఫలానా వాళ్ళోచ్చారని చెప్పిన మాట విని విస్మయంగా చూసి, నమ్మలేక , "యెవరోచ్చారు?" అని అడిగింది. పనిమనిషి మళ్ళీ చెప్పాడు యేవరోచ్చింది.
మెట్లు దిగుతోంది. మెట్ల మధ్యలో వుంది. అక్కడికి -------పోర్టికోలో కారు, కారులో కూచుని వున్న రవి కనిపించి ------చప్పుడవకుండా మెట్లు దిగి యెడమ వైపు వున్న డ్రాయింగ్ రూం లోకి వెళ్ళి , "లోపలికి తీసుకురా" అంది ----కనిపిస్తే కారు దగ్గిరికి వెళ్ళి సలాం చేసినట్లుగా తీసుకురావాల్సోస్తుంది ----అనుకుంటూ సోఫాలో కూచుంది.
గుమ్మంలో రవి చెప్పుల చప్పుడు.
"రండి, రండి , మినిస్టరుగారికి సుస్వాగతం " అంది నళిని. వెటకారం జోడించిన అతి వినయంతో.
మినిష్టరోస్తే స్వాగతం యెలా చెబుతారో బాగా స్వానుభవం వున్న రవి, బాధని అణుచుకుంటూ, కూచున్నాడు.
"ఏం తీసుకుంటారు చెప్పండి ఐనా మినిష్టర్లకి ఆతిద్యం యివ్వగలదాన్నా! షర్బత్ లో బంగారం పొడి కలిపి యిస్తే సెప్టిక్ అవుతుంది. అందుకని అట్టాంటివి విడిగానే యిచ్చుకుంటాం. చెప్పండి ,స్కాచ్ విస్కీ ఫ్రెంచ్ షాంపేన్ వంటి సామాన్య పదార్ధాల వరకూ యిప్పించగలను ....."
"నళినీ....."
మాటలు ఆపి అతని ముఖంలోకి చూసింది.
"నళినీ నీతో కొంచెం రహస్యంగా మాటాడాలి. బెడ్ రూంలోనో యేటో " అన్నాడు బాధగా.
"బెడ్ రూం సీక్రెంట్లంటే నాకు చచ్చే యిష్టం అనుకో అందునా నీతో! వాటే లక్, కమాన్"-----గలగలా అని ఉత్సాహంగా లేచి పైకి నడిచింది. ఆమె కూడా నడిచాడు. పడకగదిలోకి నడిచారు గడియ తిప్పింది.
చెరో ఫేము కుర్చీలో కూచున్నారు.
"వూఁ చెప్పు. డియర్!" అంది వ్యంగ్యంగా.
"లోకేష్ తో నీకు కాస్త పరిచయం వుందని ---- " అని ఆగిపోయాడు రవి. లోకేష్ అసెంబ్లీ సభ్యుడు.
యింక అతను యేందుకొచ్చిందీ నళినీ వూపించుకోగలదు.
"యెంత నాతొ పనుండి వచ్చినా , నా దగ్గిర కూడా పోలిటిషియన్స్ పోలైట్ నెస్ వోలకబోస్తే యెట్లా రవీ!" అని అతని కళ్ళల్లోకి కవ్విస్తున్నట్లుగా చూసి, "లోకేష్ నా బోయ్ ఫ్రెండ్ లే" అని గొంతు బిగించి, "వొక మూర్ఖుడికి బుద్దుండి వుంటే వొక్క బోయ్ ఫ్రెండూ వుండని నాకు లోకేష్ బోయ్ ఫ్రెండ్ ---వన్ ఆఫ్ ది రోగే షేస్ " అంది.
మౌనంగా నేల చూపులు చూస్తున్నాడు.
"వూఁ చెప్పు" అంది.
"ప్రస్తుతం అతని సపోర్టు అవసరం నాకు. అతనికి నువ్వు చేప్తే ------" అని ఆగిపోయాడు.
లోకేష్ కి అనుచరుడుగానో , సహచరుడుగానో వుండే సభ్యుడు వొకతను వున్నాడు.
"దేనికదే . నువ్వంటున్నది రాజకీయం నేను చెప్తే వింటాడా?" అంది. గొంతులో అతిశయం ధ్వని.
"నువ్వు చెప్తే కాదనడు" అన్నాడు రవి.
రవి నేల మీదకి చూస్తున్నాడు. నళిని అతని ముఖంలోకి చూస్తోంది .
"మరి నాకేం యిస్తావ్?" అంది.
"యెంతిమ్మంటావో చెప్పు" అన్నాడు.
"చూడు రవీ! నువ్వెంత -------వుంటావో వూడతావో తెలవని మినిస్టరు వైనా నాకివ్వగల స్థితిలో వుండవు మీ మంత్రి పదవులు యే క్షణంలో వూడతయ్యో మీకే తెలవదు. కానీ యిండస్ట్రీస్ అధిపతులు మారరు" అంది.
"నీకివ్వగలవాడివని కాదు నా భావం. నువ్వు అడిగావు కదా అని అన్నాను" అని సంజాయిషీ గా అన్నాడు.
చిన్నగా , "యెంతీస్తావు------అని అడగలేదు యేమిస్తావు --------అని అడిగాను" అంది.
కుర్చీలోంచి లేచి రెండడుగులు వేసి మంచం అంచు మీద కూచుని కాళ్ళు వూగిస్తూ, "యిట్లా రా మంచం మీదకి వో గంటసేపు " అంది సరదాగా.
బిక్క మోహం వేసుకుని చూస్తున్నాడు.
"రా" అన్నట్లుగా ముఖంతో నవ్వింది.
"నేను భార్యని తప్ప యే స్త్రీని తాకలే దెప్పుడూ . నాకు జీవితంలో తృప్తీ గర్వకారణమూ అదొక్కటే " అన్నాడు నిదానంగా.
"భర్త నొదిలి మరొకరితో వుండిపోయినందుకే నీ తల్లిని నువ్వు మన్నించలేకపోయిన వాడివి ----నీ భార్య, కంటికి నదరుగా కనబడిన కుర్రాళ్ళకి డబ్బిచ్చి మరీ తిరుగుతాంటే --- సిగ్గు లేదూ ఆ మాట అనటానికీ, దాంతో పాటు వేదిక లెక్కి ఆదర్శదంపతులమని దండలు వేయించుకోటానికీ ?" అంది.
తల కిందికి వొంచేసుకున్నాడు.
కొన్ని క్షణాల మౌనం.
"అవతల నీ మినిస్టరు షిప్పు ఊడిపోతాందని దిగాలు పడి లాభం లేదు. కర్తవ్యమ్ ముఖ్యం" అని, వ్యంగ్యంగా , "నీకోసం కాదు దేశ సేవ కోసం" అని, సరసంగా , "యిట్లారా బుద్దిమంతుడల్లె " అంది.
రెప్పలు కొంచెం పైకెత్తి , "వక ముద్దు పెడతాను" అని వెంటనే రెప్పలు వాల్చేశాడు.
పకపకా నవ్వి , "ముద్దు వరకూ ఐతే నీపత్నీవ్రతం చెడదన్నమాట ముద్దు అయిన కౌగలయినా మరికీదయినా వొకటే" అని క్షణం ఆగి, "కమాన్ లే" అంది గోముగా.
లేవబోయినట్లుగా కదిలాడు.
"నీ పుణ్యం. ఆ రాజకీయం గుద్దలతోనా! అవి పీకెయ్ " అంది.
దీనంగా చూశాడు.
"కాగా బట్టలిప్పకుండా ఏం చేద్దామని!" అని హాస్యంగా అని, " అంది గోముగా.
లాల్చీ విప్పాడు.
"ఆ పైజమా కూడా లాగేయ్" అంది.
తీశాడు --- కూచునే కుర్చీలో అటు యిటూ కదులుతూ.
బనీ అండర్ వియర్ లలో -- చలికి వోణికిపోతున్నట్లుగా అవమానంగా చలిస్తున్నాడు.
ఫ్యాను గాలి, ఆహ్లాదంగా విస్తరిస్తోంది గది నిండా.
"రవీ! యెంతటి నీచస్థితికి దిగజారవో తెలుసా?" అంది.
గోడవైపు చూస్తున్నాడు.
"దేనికి?" అంది.
మౌనంగా గోడవైపు చూస్తూ వుండిపోయాడు.
"చెప్పు దేనికి?" అంది.
చూపు కిందికి వాల్చి , "రాజకీయం భయంకరమైంది. ఆ దాహం , ఆవ్యసనం ---జూదం కంటే తాగుడుకంటే ముందల కంటే ------అన్నిటి కంటే మించిన వ్యసనం. మహా మోహం అది. దాన్లో పడినవాడు దాన్లో అంతం కాక తప్పదు" అన్నాడు.



