Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



    యుధిష్ఠిరుడు సిగ్గుపడి చాకిరీ చెయ్యడం లేదు. ఎవ్వరికీ తెలియకపోయినా ఊర్మిళకి తెలుసు. వివాహ ప్రసంగమప్పుడు అతడు స్పష్టంగా అడిగాడు - 'ఉర్మీ , నన్ను దయతలచి కట్టుకోడం లేదు కదా నువ్వు?" అని. ఆవాళ అతడి కళ్ళల్లో సందేహ సంకేతాల స్వరూపం చూసిందామె. 'దయా? నేనెన్నడూ ఎవ్వరినీ దయ తలచలేదు. పైగా, దయ తలచడమంటే నాకు అసహ్యం. దయ అసహ్యానికి మారుపేరు.'
    'అయితే, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా?' ఏ క్లాసూ ఒక ఏడాదిలో ప్యాసు కాని తనను, ఈ చదువుకున్న అమ్మాయి ప్రేమిస్తుందా అన్నదే యుధిష్ఠిరుడి సందేహం. ప్రశ్నకి జవాబు చెప్పకుండా వూరికే నవ్వేసింది ఊర్మిళ.
    'నేను నీకేమీ ఉపకారం చెయ్యలేదు కదా?'
    ఈమారు పకపక నవ్విందామే. 'ఉపకారం చెయ్యకపోతే మాత్రం ఒకరిని ఒకరు ప్రేమించరా?'
    'కాని, దీని పర్వవసానం ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించావా?"
    'పర్యవసానం ఎవరి చేతులోనూ లేదు. అలా అని ఏమీ చెయ్యకుండా ఉండగలడా మనిషి?"
    'నిజమే, నేను ప్యాసవాలన్న ఆశతోనే ప్రతి మారూ పరీక్షలో కూచుంటాను. కాని, ఫలితం వుల్టా."
    'మీ తలలో ఎప్పుడూ ప్యాసు, ఫెయిల్ మాటే. ఫేలయిపోతానని భయపడి మీరు పరీక్ష లో కూచోకపోతే ఏమయ్యేది చెప్పండి?"
    "కనీసం ఫీలయానాన్న అవమానం తప్పిపోయేది .'
    'కాని, పరీక్షలో కూచోలేదన్న అవమానం ఎలా తప్పుతుంది? అసలు చదవకపోవడమే మంచిదంటారేమో! కాని, మూర్ఖుడు అన్నమాట మీకోసం కనిపెట్టుకు కూచుంటుండవచ్చు. పెద్ద చదువులు చదివిన వాళ్ళంతా గొప్ప పని చేస్తున్నారనుకుంతున్నారేమో! వాళ్ళకి మాత్రం అవమానం లేదా? పైగా , హెచ్చు అవమానం, హెచ్చు లోకనిందా వల్లకుంది - కిందా మీదా కూడా పాసవడం, ఫేలవడం బతుకంతా వున్నదే ప్రతి ముహుర్తంలోనూ , బిసుబాబంటే ఇంత భయం మీకు - అయన అవమానం తక్కువనా? ఆయనాకంటే ఎవరు అధికమో వారి అవమానమున్నూ అంత అధికం.'
    ఊర్మిళ యుక్తి విని మాతాడలేకపోయేవాడు యుధిష్ఠిరుడు. కాని,  అతడి మనస్సు అంగీకరించేది కాదు. ఒక్క స్కూలు పరీక్షలోనేకాడు, అన్ని పరీక్షల్లోనూ అతడు ఫేలయేవాడు. వీగిపోదమే అతడి బిరుదు పట్టా - చదువులో కాకపోతే పోయింది, మరి దేనిలో మాత్రం ప్యాసయ్యాడు? చిన్నప్పుడు - పట్టుమని పదేళ్లో , పన్నెండేళ్ళ ప్రాయమప్పుడు - కుస్తీ కసరత్తు చేసేవాడు. ఊళ్ళో తాలింఖానా తన పింతండ్రులూ అన్నదమ్ములూ కట్టారు. నన్ను కుమ్మి, వలంపటి వాసాలు వేసి కట్టారు. కట్టిన వాళ్ళలో ఎందరో కాలం చేశారు. ఒకళ్ళిద్దరిలో మా గుణిభాయి వున్నాడు.
    అబ్బ, ఎంత బాలమైన దేహం అతడిది! మెడలూ, దండలూ నల్ల జునపరాళ్ళూ మలిచినట్టుంటాయి. గట్టిగా కుస్తీలో, కసరత్తులో ఎన్నో పేచీలు ఎరుగునతడు. గుడాటా, ఉప్పు పట్టీ మాట అలా వుందనీ, అగ్గి బరాటాలో అతణ్ణి మించిన వాడేవాడు? బరమంగా మేళాలో నాగావేషం వేసి అడుగులు వేస్తె, మీసం మీద చెయ్యి వేసి , గుడ్లు తిప్పితే పెద్ద పులిలా అవులించేవాడు. చూసిన వాళ్ళ గుండెల్లో దిగులు పుట్టేది. బిసు బాబు లాంటి మోతుబరి కూడా మనస్సులో భయం వల్ల ఖాతరీ చేసే వారతడిని.
    మాగుణి దగ్గర కుస్తీ పేచీలు నేర్చుకుందికి వెళ్ళి యుధిష్ఠిరుడు పడిన పాటు ఇవాళ దాకా మరిచిపోలేదు. బలం లేకపోయినా మాగుణి భాయి వల్ల సాహసవంతుడయాడు యుధిష్ఠిరుడు. అతడి వల్లే ఊర్మిళ వంటి పిల్లతో అతడి వివాహం జరిగింది.
    ఆవాళ మాగుణి రూపం కళ్ళ ముందు కట్టినట్టయిందతనికి. బోర విరుచుకుని అందరి ఎదటికి వచ్చాడతను. గొంతెత్తి అన్నాడు - 'అవును, పెళ్ళి జరుగుతుంది. తప్పక జరుగుతుంది. ఎవరడ్డుపడతారో చూస్తాను' అని.
    అందరూ స్తంభించిపోయారు. బిసుబాబు గర్జించాడు - 'ఏమిటి / ఇంత సహసమా / దీని ఫలిత మేమవుతుందో తెలుసా?"
    'తెలుసు, ' మరింత గట్టిగా జవాబు చెప్పాడు మగుణి. 'నా పొలం పుట్రా అన్నీ కరారావుడై పోయాయి. కొంప మాత్రముంది. అదీ పోతుంది. కాని, వినండి. మాగుణి మాటకి మాత్రం తిరుగులేదు - ప్రాణం పోయినా సరే.'
    బిసుబాబు నిజానికి మాగుణి అంటే పక్క బెదురు. సింహస్వప్నం. అయినా ఊర్మిళ పెళ్ళికి ఊళ్ళో పురోహితుడు కాని, మంగలి కాని దొరకలేదు. బిరిణా గ్రామం నుంచి తెచ్చి, కార్యం నడిపించాడు మాగుణి. ఊర్మిళ తండ్రి చచ్చిపోతే శవం తియ్యడానికి వాహనాలు దొరకలేదు. యుధిష్ఠిరుణ్ణి తీసుకుని , దహన క్రియా పూర్తీ చేశాడు మాగుణి. తన తాలింఖానా లోంచి కొంతమంది కుర్రాళ్ళు కూడా సయం చేశారు. మాగుణి భాయీ వస్తున్నాడంటే గర్భిణీ గోవు దారి తప్పుకునేది. అలాటి మా గుణిభాయీ ఇప్పుడు వాత రోగంతో కదల్లేకపోతున్నాడు. కాకపోతే, యుధిష్ఠిరుడు సైన్యంలో పేరివ్వదానికి అంత ప్రయత్నం చేసినవాడు, స్వయంగా రాకుండా వుండిపోయేవాడా?
    సరిహద్దు లదాయికి వెళ్ళేముందు రెండు దినాలు ఇంటికి వచ్చాడు యుధిష్ఠిరుడు. మాగుణి ముదుకులు వాత నొప్పులు. కర్ర పట్టుకుని నడుస్తున్నాడతను.  యుధిష్ఠిరుడు యుద్దానికి వెళతాడని విని కుంటుకుంటూ అతడి ఇంటికి వచ్చాడు.
    "ఈ మారు నువ్వు నన్ను గెలిచేశావు యుధీ!"
    "నువ్వెందుకు వచ్చావు మగుణిభాయీ! నేను రాకుండా వుండేవాణ్ణ నీ దగ్గరికి?"
    మాగుణి మొహం చూసి యుధిష్ఠిరుడి మనస్సు వ్యాకులపడింది.
    'ఏమిటి ?నేను రానూ? ఇంత శుభవార్త విని నేను రానూ?'    ఊర్మిళ మాట్లాడకుండా చూస్తూ నుంచుంది. నోట పల్లెత్తుమాట రాలేదు.
    'యుధీ! నన్నెలా అయినా నువ్వు గెలవాలని దేవుణ్ణి మొక్కేవాణ్ణిరా, తెలుసా?' స్నేహ కంఠంతో అన్నాడు మాగుణి. యుధిష్ఠిరుడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తెలియకుండా. మాగుణి బలంతో గెలవాలని ఎన్నిమార్లో పడ్డాడతను కుస్తీలో. అయినా, ప్రతిమారూ అనేవాడు 'ఎప్పుడో ఒకనాడు నిన్ను చిత్తు చేస్తాను, ఓడిస్తాను ' అని, ఇవాళ కాయిలాగా వున్నాడు మాగుణి. అయినా , ఆ మాట మరిచిపోలేదు.
    యుధిష్ఠిరుడు ఏమీ అనలేదు తోచక. కాని, ఊర్మిళ అంది' ;నిన్ను ఎవ్వరైనా ఎప్పుడైనా ఓడించగలరా అన్నా? ఈయన కాదు, ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను ఓడించలేరు.'
    ఊర్మిళ కొడుకు అయిదేళ్ళవాడు జితేంద్రుడు ఆడుకునే తుపాకి పట్టుకుని బయటికి వచ్చాడు. 'నేను ఓడిస్తాను" అంటూ.
    అందరూ నవ్వారు. వాణ్ణి ఒడిలోకి లాక్కుంటూ అన్నాడు మాగుణి - 'అవును నువ్వు ఓడిస్తావు . అందరినీ జయిస్తావు నువ్వు. అందుకనే నీ పేరు జితెంద్రుడు.'
    ఊరి, నుంచి యుధిష్ఠిరుడు కటకం స్టేషనుకి వెళ్ళాడు. అక్కడి నుంచే పయనం. ఒక్కడే కాదు - వందలాది జవానులు అతడితో కలిసి ప్రయాణం చేస్తారు. కొందరు కాలేజీ విద్యార్దినులు వచ్చి జవానుల నుదుట తిలకం పెట్టి వెళుతున్నారు. రైలు బయలుదేరింది. 'జయ్ హింద్ జయ భారత్' ధ్వనులు ప్రతిధ్వనించాయి.
    అడపాదడపా ఊర్మిళ దగ్గరికి వుత్తరాలు వస్తున్నాయి. ఆ వుత్తరాల్లో మేఘదూతలోని కావ్య చాతుర్యం లేదు. హంస దూతలోని ప్రణయ గాధా లేదు. తాను ఎలా వున్నదీ, ఎలా యుద్ధం చేస్తున్నదీ మాత్రం రాసేవాడు యుధిష్ఠిరుడు. ఊర్మిళ జవాబు రాసేది. మా గుణి భాయి మాటా, జితేంద్రుడి విషయమూ రాసేది. ఉత్తరాలు ఆలస్యమైతే ఇద్దరి మనస్సులూ బాధపడేవి ఉద్వేగంతో.
    యుద్ధం సాగుతూ వుంది - ఉభయ సేనలూ దగ్గర దగ్గరగా వున్నాయి. ఇటువేపు నుంచి మాటాడినా, అటు వేపు నుంచి పాట పాడినా అటు ఇటూ వినిపిస్తుంది. ఇటువేపు, అటువేపు కొండలు, మధ్య రసాతలమంత లోతు . ఇటువేపు మనిషి అటువేపు వెళ్ళే సాదనం లేదు. ఎంతో దూరం తిరిగి వెళ్ళాలి. కాని, తుపాకులూ, స్టీన్ గన్లూ రెండు వేపుల్నీ తిన్నగా కలుపుతున్నాయి గుళ్ళతో. అటు చైనాసైన్యం, ఇటు భారత సేన.
    ఎగిరి వెళ్ళి ఆ కొండల మీద నాలాలని ఊర్మిళ ఊహ. ఆ పూలవనం చూడాలని ఆ తుపాకుల మోత వినాలని అభిలాష. ఎలాగో ఏమో అన్ని విషయాలూ మాగుణిభాయి పసికట్టేస్తాడు. కుంటూకుంటూ వచ్చి చెప్పేవాడు - "నీకు వెళ్ళాలని మనసవుతుందా ఊర్మీ?"
    "నే నెలా చెప్పగలనా మాట?"




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.