Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
ఇవి ప్రొఫెసర్ లిన్ - తాయీ మాటలు. లిన్ - తాయీ, కాలేజిలో చాంగ్ -- సున్ కు బౌతిక రసాయన శాస్త్రాదులు బోధించడమే కాక కాలేజీ ఆవల సైతం మానవుని చరిత్రలోని చీకటి కోణాలను వెలిగించిన మహత్వ పూర్ణమైన విజ్ఞానాన్ని అందజేశాడు. చాంగ్ - సున్ తొలుత విప్లవాన్ని గురించీ విన్నదీ, మర్మ్క్ ను గురించి తెలుసుకున్నదీ లిన్- తాయీ నుండే. ఒకసారి చాంగ్ - సున్ అన్నాడు - "ప్రొఫెసర్ ! ఇంతకాలం నేను అంధకారంలో అలమటించా ననిపిస్తుంది. ఈ హేతువాదపు నవ మార్గం ద్వారానే మన దేశంలోని భ్రమ , అజ్ఞానం, అన్యాయం అనే అంధకారాల్ను పటాపంచలు చేయగలం' అని.
అప్పుడు ప్రొఫెసర్ చిన్ చిరునవ్వు నవ్వి, "చాంగ్ - చున్! కాగడా దోవ చూపిస్తుంది. పంట పోలాల్ను ,మంట కలుపుతుంది కూడా. హేతువాదాన్ని ఒక విగ్రహంగా చేసి పూజిస్తూ కూర్చునేవు సుమా! అలా చేసినట్లయితే మానవుణ్ణి పాత భ్రమల్నుండి తీసి కొత్త భ్రమల్లో ఇరికించినట్లవుతుంది. వాస్తవంగా హేతువాదపు క్షేమం - ప్రగతి - కోరేవాడివైతే ఏ పరిస్థితిలోనైనా , ఏ మాటకైనా , ఏ సమస్యకైనా , ఏ వాస్తవానికైనా , ఏ నియమానికైనా , ఈ నాలుగు ప్రశ్నల అగ్నిపరీక్ష పెట్టు -- ఏమిటి? ఎవరు? ఎక్కడ ? ఎందుకు ? .....ఆ .....ముఖ్యంగా ఎందుకు ?"
ఎందుకో తెలీదు కానీ మేమికి "ఎందుకు?" అని ప్రశ్నించడం అలవాటైపోయింది.
వారిద్దరూ కలిసి చదువుకున్నప్పుడు, బాదం గింజల్లాంటి కళ్ళు కలిగి, పసుపు గులాబీ సౌందర్యం లాంటి సౌందర్యం గల మేమీని ప్రేమించాడు చాంగ్ - సున్. ఒకనాడు సమయం చూచి, "మేమీ! నన్ను పెళ్ళాఆడతావా?' అని అడిగాడు.
"ఎందుకూ?" మేమీ సులభంగానూ, అమాయకంగానూ "ఎందుకూ పెళ్ళాడాలి?" అని అడిగేసింది.
చాంగ్ - సున్ నిర్విన్నుడై "ఎందుకా .......మేమీ - ఎందుకంటే -- నిన్ను ప్రేమిస్తున్నాను " అన్నాడు.
"ఎందుకూ? మేమీ మళ్ళీ "ఎందుకు , నన్నెందుకు ప్రేమిస్తున్నావ్?" అడిగేసింది. అదే ప్రశ్న మళ్ళీ వేసింది.
"ఇదీ ఒక ప్రశ్నేనా? ఎందుకు ప్రేమిస్తున్నానంటే ...... ప్రేమిస్తున్నాను. అంతే , అంటే , నువ్వంటే నా కెంతో ఇష్టం ."
"ఎందుకూ నేనంటే ఇష్టం ?' మళ్ళీ అదే ప్రశ్న వేసి పెద్దగా నవ్వింది. నవ్వుతూనే ఉండిపోయింది.
"మేమీ! ఏమిటా నవ్వు?" ప్రణయ కోపంతో గర్జించాను.
మేమీ లిప్తపాటు నవ్వునాపుకొని , "ఎందుకు నవ్వొద్దు?" అని కొంచెం నవ్వు సాగించింది.
ఈసారి చాంగ్ - సున్ గద్దించాడు. ఆవిడ చేయి పట్టి లాక్కున్నాడు. తనవైపు కుసుమ కోమలమైన శరీరాన్ని తన బాహువుల్లో బంధించాడు. నవ్వు లోలకబోస్తున్న మేమీ పెదవులపై మండిపోతున్న తన పెదవులుంచాడు.
విడిపోయేప్పుడు కొంటెగా అదే ప్రశ్న వేసింది మేమీ మళ్ళీ ....."ఎందుకూ?"
"ఎందుకూ?"
అప్పుడు మేమీ చంకలో నాలుగేళ్ళ పాప ఉన్నాడు. అయినా ఆవిడ నాల్కమీద అదే పాత ప్రశ్న తాండవించింది. - "ఎందుకు?" - ఎందుకు వెళ్తున్నావ్?"
"దేశంలో విప్లవం తేవాలి. కొమింటాంగ్ అత్యచారాల్నుండి ప్రజలను విముక్తుల్ను చేయాలి.......... అందుకు" చాంగ్ - సున్ జవాబిచ్చాడు. అదీ ధీమాగా - గర్వంగానూ.
* * * *
మరొకసారి అతడు సైనిక దుస్తులు ధరించాడు. మూలనున్న అలమారాలోంచి పాత తుపాకీ బైటికి తీశాడు. అప్పుడు మేమీ తన ముగ్గురు పాపల్నూ ఒళ్ళోకి తీసుకుంటూ అడిగింది -- "ఏ ......ఇప్పుడేక్కడికి వెళ్తున్నావ్?" అని.
జవాబు ఇవ్వలేకపోయాడు -- ఈ తడవ.
మేమీ మరోసారి ప్రశ్నించింది . "ఏ - ఎందుకు వెళ్తున్నావ్?"
"అజ్ఞ - ఆదేశం !" చాంగ్ - సున్ జవాబిచ్చాడు.
"అజ్ఞ - " మేమీ కేక వేసింది. "కాని ఎందుకు? ఆ ఆదేశించే వాళ్ళు నడుగలేదూ ఎందుకు పంపుతున్నారని ?" ప్రశ్నించింది.
చాంగ్ - సున్ గద్దించి 'అడగడం మా పని కాదు. అమలు పర్చడమే మా పని" అని జవాబు చెప్పాడు. అలా జవాబు చెప్పినందుకు ఇప్పటికీ బాధపడుతూనే ఉంధతని' మనసు -- క్షోబిస్తూనే ఉందతని హృదయం.
మేమీ అతణ్ణి వింతగా చూచింది - కొత్తవాణ్ణి చూచినట్లు చూచింది- వింత మనిషిని చూసినట్లు చూసింది. "నువ్వేనా ఈ మాటలంటున్నది చాంగ్ - సున్ ? - ప్రొఫెసర్ లిన్ - తాయీ శిష్యుడేనా ఇలా అన్నది? గుర్తుందా అతడేమన్నాడో? - 'ఏ పరిస్థితిలోనైనా , ఏ మాతకైనా, ఏ సమస్యకైనా, ఏ వాస్తవానికైనా, ఏ విషయానికైనా, ఈ నాలుగు ప్రశ్నల అగ్నిపరీక్ష పెట్టు -- ఏమిటి ? ఎక్కడ ? ఎవరు? ఎందుకు ? ..... ముఖ్యంగా ఎందుకు? తెలిసిందా? నిన్ను నేను వెళ్ళనివ్వను. ఎక్కడికి, ఎందుకు వెళ్ళేదీ చెప్పేదాకా కదలనివ్వను."
"ఎందుకు వెళ్తున్నాను ? - అది నాకు తెలీదు. ఎక్కడికి వెళ్తున్నది చెప్పగూడదని అజ్ఞ కాని, చాలా దూరం వెళ్తున్నాను. కొన్ని వేల మైళ్ళ దూరం - దక్షిణ సరిహద్దుకు."
అది విని మేమీ నిశ్చేష్టురాలై పోయింది - శిలా ప్రతిమలా మారిపోయింది. మరో గది నుంచి నీరస ధ్వని అతణ్ణి పిలిచింది. "సరిహద్దు మీదికి వెళ్తున్నావా యుద్ధం చేయడానికి చాంగ్ - సున్ ! వెళ్ళేప్పుడు చెప్పి వెళ్ళు నాయనా!"
అగ్గి కురుస్తున్న మేమీ దృక్కుల్నుండి తప్పుకోవడానికి తండ్రి గదిలోకి అడుగు పెట్టాడు . అక్కడ డెబ్బై సంవత్సారాల వృద్దుడు -- శక్తి హీనుడు - మంచంలో పడి ఉన్నాడు. మంచం చుట్టూ పాత పుస్తకాలు గుట్టలుగా పడి ఉన్నాయి. జీవితపు చివరి రోజులు లెక్కిస్తున్నాడు. -- కాటికి కాళ్ళు చాచుకున్నాడాయన.
"ఏం నాన్నా?"
ఇంతలోనే చాంగ్ - సున్ తండ్రి మేధస్సు ఎక్కడెక్కడికో పరుగులు తీసింది. అతనికేం కనిపించిందో?
"పిచ్చివాళ్ళు ......... అంతా పిచ్చివాళ్ళే!" పలవరించాడు.
"నాన్నా! ఎవరూ పిచ్చివాళ్ళు?"
"నిష్కారణంగా శాంతి ప్రియ దేశం మీద దండెత్తే వాళ్ళంతా పిచ్చివాళ్ళే!"
చాంగ్ - సున్ బెదిరిపోయాడు. "నాన్నా!" అని ధ్వని తగ్గించి, "ఇలాంటి మాటలనడం ప్రమాదం " అన్నాడు.
వృద్దుని గళం నుంచి శూన్యం నుంచి వచ్చిన లాంటి హీనత్వం వెలువడింది - 'ఆ మాటలన్న వాణ్ణి మీ పోలీసులు సైతం పట్టుకోలేరు" - ఆ ధ్వనిలో నవ్వూ ఉంది.దగ్గూ ఉంది.
"ఎందుకు పట్టుకోలేరు ?"
"ఎందుకా? అతడు గతించి మూడు వేల సంవత్సరాలైంది.
"ఓహో! అయితే అదొక బూజు పట్టిన సామెత. వాటిని తలవడం, కూడా నేరమే. మనం మన ప్రభుత్వానికి విశ్వాసపాత్రులమై ఉండాలి."
"విశ్వాసం ! ..... విశ్వాసం!" అనే మాటలు అనేకసార్లంటూ పాతపడి చిరిగిపోయిన పుస్తకపు పుటలు త్రిప్పి చదివాడు తండ్రి.
"తాఓ మీద ఒట్టు
తమ ప్రభువులకు విశ్వాస పాత్రులైన వారు, తమ ప్రభువులను సైనిక కూటముల నుండియు, యుద్ద తంత్రముల నుండియు మరలింతురు. ఏలననగా, యుద్దము చేయువారికి దుష్పలితములు కలుగును. ఏ ప్రదేశమునకు సైన్యము తరలునో ఆ ప్రదేశమున పూలు పూసేడి చోట్ల ముళ్ళు మొలచును. పంట పొలములందు ధాన్యము కాక క్షామము పండును."
"నాన్నా! ఎందుకా విప్లవ వ్యతిరేకుల వ్రాతలు చదువుతావు? ఎవడా విప్లవ వ్యతిరేకి?"
"అతడా? అతడు "లావో - త్సే' చాంగ్ - సున్ ! అతణ్ణి మీ పోలీసులు అరెస్టు చేయలేరు. రెండు వేల సంవత్సరాల తరువాత ఆస్థులు సైతం మిగిలి వుండవు.'
"లావో -త్సే! బూజుపట్టిన ఆ పిచ్చి వేదాంతికి నేటి రాజకీయాలెం తెలుసు నాన్నా? తెలుసా, మన సైన్యం ఎక్కడికి తరలుతుందో?" అని అడిగి, మేమీకి సైతం చెప్పని - ఆ పేరు - తన ముసలి తండ్రి చెవిలో చెప్పాడు -- "హిందూస్తాన్!"





