Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    సంతాప గీతాల్లో నాదే ఖ్యాతి. మహా మహా సంతాప సంగీతజ్ఞులు నా ముందు నోరు కడపలేకపోయారు. ఈ సంతాపగీత పాండిత్యం వల్లనే చనాకు నవాబు మలికా కిషోర్ రాజ ప్రశాదంలోకి ప్రవేశం లభించింది. జహాఁ పనా స్వయంగా నన్ను పొగిడారు. రాచ బొక్కసం నుంచి నాకు ప్రతి మొహర్రంలో చాలా చాలా బహుమతులు లభించేవి.
    (మొహర్రం పండుగలో షియాలు మనుషులను పెట్టి ఏడిపిస్తారు) ఏడ్పుకత్తెలలో కూడా నా పేరు ఉండేది. రాత్రికి ఇమామ్ బాడాలో శోకం అయిపోయిం తరవాత ప్రాసాదానికి వెళ్ళేదాన్ని. రాత్రి రెండు గంటలకు అక్కడి నుంచి రావడం.
    బిస్మిల్లా మిస్సీ జరిగినపుడు నవాబు చబ్బర్ గారి బాబాయి తీర్దాయత్రలకు వెళ్ళారు. ఆరునెలల తరవాత కర్బలా నుంచి విచ్చేశారు. వారి అమ్మాయితో నవాబు గారికి ప్రదానం జరిగింది. భిస్మిల్లాజాన్ వారి ఇంట్లో తిష్ట వేసింది. అబ్బాయిగారు పెళ్ళి నిరాకరించారు. కాని ఈ నవాబు గారి ఇష్టంతో ఎవరికి పని? అది రాజుల కాలం. అమ్మాయి ఒకరిదైపోయింది. నవాబు మాటలను బాబాయి పట్టించుకోలేదు. లెక్కచేయలేదు. ఒకనాటి రాత్రి నవాబు ఇంటికి వచ్చారు. బిస్మిల్లా నవాబు ఒడిలో కూర్చుని ఉంది. ఆ రాత్రి బిస్మిల్లా వెంట నేనూ వెళ్ళాను.
    నవాబుకు ఎదురుగా కూర్చుని పాడుతున్నాను. నవాబుగారు తంబూరా మీటుతున్నారు. నవాబు గారి అంతరంగిక మిత్రుడు దిలేర్ హుసేను తబలా వాయిస్తున్నాడు. ఇంతలో వార్తాహరుడు పెద్ద నవాబు గారు (నవాబుగారి బాబాయి) విజయం చేస్తున్నారని కబురు తెచ్చాడు. వస్తే అంతపురం బేగమ్ (నవాబు తల్లి) గారి దగ్గరికి వెళ్తారనుకున్నారు నవాబు. మేమూ అదే అనుకున్నాం. కాని వారు దీవాన్ ఖానాలోకి చొచ్చుకొని వచ్చారు. చూస్తె ఏముంది/ గోష్ఠి ! మండిపోయారు. వారి రాకతో పాట నిలిచిపోయింది. నవాబుగారు లేచి నిలుచున్నారు.
    పేద నవాబు: సరి, మీ వినయవిధేయతలు అలా ఉండనివ్వండి. తమతో ఒక విషయం విన్నవించాలని వచ్చాం. కాకుంటే మీ భోగవిలసాలకు అంతరాయం కలిగించేవారం కాము.
    నవాబు : శలవివ్వండి.
    పెద్ద నవాబు : మీది ఇంకా చిన్నతనం. మీకు తెలియదు. నా సోదరుడు యశశ్శరీరుడు. నవాబ్ మీర్ ఆహామదీ ఖాను కీర్తీశేషురాలైన తల్లికి ముందే గతించారు. అందువలన మీరు తల్లికి ముద్దు బిడ్డలు. ప్రస్తుతం తమ హక్కు భుక్తంలో ఉన్న ఈ ఆస్తి మీద మీకు ఏమీ అధికారం లేదు. కీర్తీశేషురాలైన తల్లిగారు మిమ్ము పుత్రునిగా అంగీకరించిన మాట వాస్తవం. ఆవిడ గతించెప్పుడు ఆస్తి మీ పేరున పెట్టింది. అయినా ప్రయోజనం లేదు. ఆవిడ మీపేర పెట్టినా, పెట్టకున్నా ఆస్తిలో మూడవభాగం మీకు చెందుతుంది. జనులు చెప్పేదాన్ని బట్టి, నేను విన్నదానిని బట్టీతాము మూడవ భాగం కంటే ఎక్కువే ఖర్చు చేశారు. మూడవభాగమే కాదు, మిగతా మీరు ఖర్చు చేసినదాన్ని గురించి కూడా పట్టించుకోము. ఎంచాతంటే మీతో రక్త సంబంధం ఉంది.
    ఆ తరవాత పెద్ద నవాబు గారి కండ్లు చింత నిప్పులైనాయి. అయినా కోపాన్ని దిగమింగారు. "ఈ ఆస్తి మీద కలకాలం మీ హక్కే ఉండేది. మా ఖర్చులకు మాత్రం జగ్రత్తపడేవాళ్ళం. ఆ ఆస్తికి కూడా తామే వారసులయ్యేవారు. మీ ప్రవర్తన చూచి ఈ ఆస్తి నుండి బెదఖలు చేయాల్సి వస్తున్నది. పెద్దలు ఆర్జించిన ఆస్తి ఇలా నాశనం చేయడానికి కాదు. నావెంట మున్సపుద్దౌలా మనుషులున్నారు. వారు ఈ ఇల్లు ఖాళీ చేయిస్తారు. తాము తమ సహచరులతోనూ, మిత్రులతోనూ దయచేయండి."
    నవాబు : అయితే నాకు ఈ ఆస్తిలో ఏమీ హక్కులేదా?
    పెద్ద నవాబు: జీ నహీఁ లేదండీ!
    నవాబు : మూడో భాగానికి హక్కుందిగా?
    పెద్ద నవాబు : అది ఎప్పుడో తీసుకున్నారు. కావాలనుకుంటే న్యాయస్థానానికి వెళ్ళండి. నా దగ్గర మీది ఒక్క పైసా లేదు.
    నవాబు : అయితే తల్లి గారిని కూడా వెంట తీసికెల్తాను.
    పెద్ద నవాబు : వారు మిమ్మల్ని వదిలేశారు. నాతో కర్బలా వస్తున్నారు.
    నవాబు : అయితే నేను ఎక్కడికి వెళ్ళేది ?
    పెద్ద నవాబు : మాకేం తెలుసు? మీ సహచరులు, నౌకరులు, ప్రియురాళ్ళు ఉన్నారు. వారి నడగండి.
    నవాబు : అయితే నా బట్టలు, సామాను ఇచ్చేయండి.
    పెద్ద నవాబు : ఈ ఇంట్లో మీ సామాగ్రి కాని, బట్టలు గానీ లేవు.
    తరవాత మున్సపుద్దౌలా మనుషులు దీవాన్ ఖానాలోకి వచ్చారు. నవాబుగారిని సపరివారంగా బయటకు పంపించేశారు.
    మేము ఇంటి నుంచి వెళ్ళగానే డోలీలు అద్దెకు తీసుకొని చౌకుకు వెళ్ళిపోయాం. నవాబు, అతని పరివారం ఎటు వెళ్ళారో భగవంతునికే తెలియాలి.
    నవాబు పరివారంలోని వారంతా ఎవరి దారి వారు చూచుకున్నారని విన్నాం. ముక్ధూమ్ బక్ష్ నవాబు తండ్రికి పాత నౌకరు. పనికిరానివాడని నవాబుగారు అతన్ని కొలువు నుంచి తీసేశారు. దోవలో అతడు కలిశాడు. నవాబు పరిస్థితి తెలుసుకొని తాన ఇంటికి తీసికెళ్ళాడు.
    నవాబు గారి ఇంటినుంచి వచ్చిన రాత్రి బిస్మిల్లా గదిలో గోష్టి జరిగింది. మియాహస్నూ నవాబు గారి గారికి అంతరంగికుడు, సహచరుడు , మిత్రుడు ప్రాణ స్నేహితుడు, నవాబు స్వేదబిందువు రాలినచోట రక్తం కురిపించగల ఆప్తుడు గోష్టికి వచ్చాడు. కొత్తేం కాదు. నవాబు గారి చాటుగా అప్పుడప్పుడూ వస్తూనే ఉండేవాడు. ఇవాళ బహిరంగంగా వచ్చి దర్జా వెళ్ళబోస్తూ కూర్చున్నాడు. బిస్మిల్లా జాన్ మీద సర్వాధికారాలు అతనికే ఉన్నట్లు ప్రవర్తించాడు. కొలువు ఉంచుకోవదాన్ని గురించి మాటలు సాగాయి.
    హస్నూ: చూడు బిస్మిల్లా జాన్, ఇక నవాబు మీద ఆశ పెట్టుకోకు. అన్నమాట జవదాటే వాణ్ణి కాను. ఒప్పుకున్నది ఇస్తాను. పేదవాణ్ణి , నవాబు ఇచ్చినంత ఇవ్వలేను. సగం కూడా సాధ్యపడదు. కాని ఏదో విధంగా సంతోషపెడతాను.
    బిస్మిల్లా : పెదవాడివా? నవాబు ధనమంతా కొల్లగొట్టి ఇంట్లో పోసుకున్నానని చెప్పవు! పేదరికం వల్లిస్తావూ? ఇలాంటి పేదవాళ్ళను కొస్తే కనీసం మణుగు కొవ్వు ఉంటుంది.
    హస్నూ: హి ....హి , అలా అనకు, ఆ నవాబు దగ్గర ఉన్నదేమిటి ఇల్లు నింపుకోవడానికి ? నా తల్లి ఆస్తి లేదూ?
    బిస్మిల్లా : ఓహో హో బువా ఫర్జుందా నవాబు సర్ఖరాజ్ అంతపురంలోని దాసీకా?
    హస్నూ: (ఉలికిపడి) అయితేనేం నాలుగు వేల జవహరి ఇచ్చిపోయింది.
    బిస్మిల్లా: అది కాస్తా సంగ్రహించి నీ పెళ్ళాం మిండనితో లేచిపోయిందిగా? నీకు మిగిలిందేమిటి? నా ముందా మీసాలు మెలేయ్యడం?
    హస్నూ: మా నన్నగారికేం తక్కువ?
    బిస్మిల్లా : మీ నాన్న! నవాబు హాసనలీఖాన్ దగ్గర పిట్టలు పట్టేవాడు.
    హస్నూ : కోళ్ళ పందేగాళ్ళలో.
    బిస్మిల్లా : కోడి పందేగాడా?
    హస్నూ : పూరేళ్ళు పట్టేవాడు.
    బిస్మేల్లా : అయినా పిట్టలు పట్టేవాడేగా ?
    హస్నూ : హాస్యంగా మాట్లాడుతున్నారు.
    బిస్మిల్లా : కాదు. ఉన్నమాటే అంటున్నాను. అందుకే అందరికీ చెడ్డ దాన్నయాను. నీ కొంచేపు దనం చూచి మండిపోయాను. అప్పుడప్పుడూ వస్తూనే ఉన్నావు. నేను అడ్డు పెట్టానా? ఈరోజే నవాబుకు ఆ గతి పట్టింది. ఈరోజే , అదీ నా ముఖాన కొలువుంచుకుంటానని వచ్చావూ! కాస్త తెలివి తెచ్చుకో. నువ్వేమీ, కొలువుంచుకోవడం ఏమి? నెల రెండు నెలలు ఉంచుకుందామనుకుంటున్నావు . అంతేనా ?
    హస్నూ : ఆరు నెలల డబ్బు జమ కట్టేస్తాను.
    బిస్మిల్లా : నోటితోనా?
    హస్నూ : ఇదిగో చూడు ( బంగారపు కడియాలు బొడ్లోంచి తీసి ) సరుకు ఎంత ఖరీదు ఉంటుందంటారు?
    బిస్మీల్లా: "ఏదీ ఇలా తే " అని కడియాలు తీసి చేతులకు వేసుకొని "చప్తా మల్ కొడుక్కు చూపిస్తాను, ఎవరు చేశారో గాని మంచిగా చేశారు. ఇక మీరు వేం చేయండి. చట్టన్ అక్క పిలుస్తుంది. ఉండలేను. రేపు ఇదే సమయానికి విచ్చేయండి."
    హస్నూ : కడియాలు ?




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.