Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha


 


                       జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                     ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||
       
                            ముప్పది  తొమ్మిదవ అధ్యాయము


    ప్రవర్గ్యే ధర్మభేదే ప్రాయశ్చిత్తమ్ - ప్రవర్గ్యమున ధర్మలోపమునకు ప్రాయశ్చిత్త ఆహుతులు.

1.     స్వాహా ప్రాణే భ్యః సాధిపతికేభ్యః|
    పృథివ్యై స్వాహ్కాగ్నయే స్వాహాన్తరి క్షాయస్వాహావాయవే స్వాహా|
    దివే స్వాహా సూర్యాయ స్వాహా||

    హిరణ్యగర్భుని సహితముగ వర్తిల్లు ప్రాణమునకు స్వాహా. పృథివికి స్వాహా. అగ్నికి స్వాహా. అంతరిక్షమునకు స్వాహా. వాయువునకు స్వాహా. దివికి స్వాహా సూర్యునకు స్వాహా.

    2. దిశలకు స్వాహా.చంద్రాయస్వాహా. నక్షత్రేభ్యః స్వాహా. చక్షుషే స్వాహా. చక్షుషే స్వాహా. శ్రోత్రాయ స్వాహా. పవిత్రునకు స్వాహా.

    3. వాక్కునకు స్వాహా. ప్రాణాయ స్వాహా. ప్రాణాయస్వాహా. చక్షుషే స్వాహా. చక్షుషే స్వాహా. శ్రోతాయ స్వాహా. శ్రోత్రాయ స్వాహా.

    4. మనో కామన, సంకల్పము, వాణి, సత్యము, పశువుల రూపము, అన్నపురసము, యశము మరియు లక్ష్మి నాయందు ప్రవేశించును గాత - స్వాహా.

    5. (నిష్ఠత అభిస్పర్మ నుండి మేకపాలు కలుపుట వరకు మహావీరమును "సంభ్రియమాణము" అగును. ఇందు సమయలోపము జరిగినంత ప్రజాపతికి ఆహుతులు ఇవ్వబడును) ప్రజాపతయే స్వాహా.

    (కుశలమీద ఉంచువరకు సంభృతియగును. దానికి లోపము కలిగిన సామ్రాట్ దేవత యగును) సామ్రాట్టునకు స్వాహా.

    (మూంజుపొల మీద ఉంచువరకు దానిని సంపన్నము అందురు. దానిని 'సంపన్నము' అందురు. దానికి లోపము కలిగిన విశ్వేదేవతలు దేవత యగుదురు) విశ్వేదేవతలకు స్వాహా.

    (పరిశాసములు గ్రహించు వరకు దానిని 'ప్రబృక్తము' అనబడును. దానికి లోపము జరిగిన ధర్మము దేవతయగును.)

    ధర్మమునకు స్వాహా.

    (ఉద్యమానము నుండి మేకపాలచే తడుపుట వరకు కర్మను 'ఉద్యతము' అనబడును. దానికి లోపము జరిగిన తేజస్సు దేవత యగును) తేజస్సునకు స్వాహా.

    (పాలు తెచ్చి మేకపాలతో తడుపుట వరకు ఘర్మము అశ్వినీ దేవతాకమగును. దానికి లోపము జరిగిన) అశ్వినులకు స్వాహా.

    (ఘృతము తెచ్చి దానితో తడుపుట వరకు పూషా దేవతాకమగును. లోపమునకు) పూష దేవతకు స్వాహా.

    (ఘర్మమున ఘృతముపోయువరకు మరుద్దేవ తాకమగును. లోపమునకు) పూష దేవతకు స్వాహా.

    (మధించినపుడు పడిన ఘృతబిందువులు మిత్ర దేవతాకము. అక్కడ లోపము జరిగిన మిత్రాయ స్వాహా.

    (ఆహవనీయమున తీసికొని పోబడు ఘర్మము వాయు దేవతాకమగును. దానికి లోపము జరిగిన) వాయువునకు స్వాహా.

    (ఆహూయమాన ఘర్మము అగ్ని దేవతాకమగును. దానికి లోపము కలిగిన) అగ్నయే స్వాహా.

    (హుతహోమము తరువాత ఉత్తర ఘర్మకార్యము మొదలగుటకు ముందు వరకు వాక్ దేవతాకమగును. అచటి లోపమునకు) వాగ్దేవతకు స్వాహా.

    6. ప్రథమ దినము సవితాదేవతాకము. నాటి ధర్మలోపమునకు సవితకు స్వాహా.
    రెండవ రోజు అగ్నిదేవతాకమగును. నాటి ధర్మలోపము జరిగిన అగ్నికి స్వాహా.
    మూడవ రోజు వాయుదేవతాకమగును. నాటి ధర్మలోపమునకు వాయవే స్వాహా.
    నాలుగవ రోజు ఆదిత్యదేవతాకమగును. నాటి ధర్మలోపమునకు ఆదిత్యునకు స్వాహా.
    అయిదవ రోజు చంద్రదేవతాకమగును. నాటి ధర్మలోపమునకు చంద్రాయ స్వాహా.
    ఆరవ రోజు ఋతుదేవతాకమగును. నాటి ధర్మలోపమునకు ఋతువులకు స్వాహా.
    ఏడవ రోజు మరుద్దేవతాకమగును. నాటి ధర్మలోపమునకు మరుత్తులకు స్వాహా.
    ఎనిమిదవ రోజు బృహస్పతిదేవతాకమగును. నాటి ధర్మలోపమునకు బృహస్పతికి స్వాహా.
    పదవరోజు వరుణ దేవతాకమగును. నాటి ధర్మలోపమునకు వరుణ దేవతకు స్వాహా.
    పదకొండవరోజు ఇంద్ర దేవతాకమగును. నాటి ధర్మలోపమునకు ఇంద్రునకు స్వాహా.
    పన్నెండవ రోజు విశ్వేదేవతాకమగును. నాటి ధర్మలోపమునకు విశ్వేదేవతలకు స్వాహా.

    8. (అశ్వమేధికం ఆ అధ్యాయ సమాప్తే. అధ్యాయసమాప్తము వరకు అశ్వమేధికము)
   
    అశ్వపు హృదయముచే అగ్నిని సంప్రీతుని చేయుదును. అగ్రభాగమున అశ్వినులను, సమస్త హృదయఖండమున పశుపతిని, యకృతిచే భవుని, మతస్నాయువులచే శర్వుని, మన్యువుచే ఈశానుని, పేగులలోని మాంసముచే మహాదేవుని, పెద్ద పేగులచే ఉగ్రదేవుని, వసిష్ఠ, హనుహృదయము, తల యొక్క మాంసములచే శింగి దేవతను సంప్రీతులను చేయుదురు.

    9. అశ్వపు రక్తమున ఉగ్రుని, అశ్వపు శుభకార్యములచే మిత్రుని, దుష్ట కార్యములచే రుద్రుని, క్రీడలచే ఇంద్రుని, బలమున మరుత్తులను, ప్రమోదమున సంధ్యలను సంప్రీతులను చేయుదురు.

    భవునిది కంఠస్థమాంసము, రుద్రునిది ప్రక్కల మాంసము, మహాదేవునిది యకృత్తు, శర్వునివి పెద్ద పేగులు; పశుపతిది పురీతతనాడియగును.

    10. లోమేభ్యః స్వాహా లోమేభ్యః స్వాహా త్వచే స్వాహా త్వచే స్వాహా లోహితాయస్వాహా లోహితాయ స్వాహా మేదోభ్యః స్వాహా|
   
    మాంసేభ్యః స్వాహా మాంసేభ్యః స్వాహా స్నావభ్యః స్వాహా స్నావభ్యః స్వాహా స్వాహాస్థభ్యః స్వాహాస్థభ్యః స్వాహా మజ్జభ్యః స్వాహా మజ్జభ్యః స్వాహా|
   
    రేతసే స్వాహా పాయవే స్వాహా||

    11. ఆయాసాయ స్వాహా ప్రయాసాయ స్వాహా సంయా సాయ స్వాహా వియాసాయ స్వాహో ద్యాసాయస్వాహా|

    శుచే స్వాహా శోచతే స్వాహా శోచమానాయ స్వాహా శోకాయస్వాహా||
   
    12. తపసే స్వాహా తప్యతే స్వాహా తప్యమానాయస్వాహా తప్తాయ స్వాహా ధర్మాయ స్వాహా| నిష్కాత్యై స్వాహా ప్రాయశ్చిత్యై స్వాహా భేషజాయ స్వాహా|

    13. యమాయ స్వాహా న్త కాయ స్వాహా మృత్యవే స్వాహా బ్రాహ్మణే స్వాహా బ్రహ్మ హత్యాయై స్వాహా|

    విశ్వేభ్యో దేవేభ్యః స్వాహా ద్యావాపృథివీభ్యాం స్వాహా|

   
                          దాశరథి రంగాచార్య విరచిత
             శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహిత యందలి
      ధర్మాది నిష్కృతి యను ముప్పది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

                       మయిత్యదిన్ద్రియం బృహన్మయి దక్షోమయిక్రతుః|
                 ఘర్మస్త్రిశుగ్విరాజతి విరాజా జ్యోతిషా సహ బ్రహ్మణ తేజసాసహ ||




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.