Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
14. స్వర్గపుత్రి ఉషా! ఆప్యత్రితుని ఆవులకు కలుగు పీడను, అతని దుస్స్వప్నమ్నులను దూరము చేయుము. "అనేహసోవ ఊతయః సుఊతయో ఊతయః"
15. స్వరపుత్రి ఉషా! స్వర్ణ కారుడు ఆభరణము చేయునప్పుడు లేదా మాలకారుడు మాల అల్లునప్పుడు వచ్చునటువంటి పీడకలను ఆప్యత్రివి నుండి దూరము చేయుము. "అనేహసోవ ఊతయః సుఊతయో ఊతయః"
లేక
"త్రితునకు వచ్చిన పీడకలను స్వర్ణ కారునకు, మాలాకారునకు మరల్చుము, కావచ్చును."
(ఈ పీడకల - దుస్స్వప్నమును - గురించి వివరము లేదు బహుశః స్వర్గకారుడు మాలా కారులమీద వానిని రక్షించవలసిన బాధ్యత ఉండగా అవి దొంగిలించ బడినట్లు కలరావచ్చును.)
16. స్వప్నమునందు మధుపాయసాది అన్నము లభించినప్పుడు ఆస్త్యత్రితుని దుస్సప్న పీడనుదూరము చేయుము. "అనేహసోవ ఊతయః సుఊతయో ఊతయః"
17. యజ్ఞమునందు దానమిచ్చు పశువునకు గుండె, గిట్టలు, కొమ్ములు క్రమముగా తొలగించినట్లు - అప్పు దశలవారిగా తీర్చినట్లు - ఆస్త్యత్రితుని దుస్వప్నములను క్రమముగా తొలగింతుము. "అనేహసోవ ఊతయః సుఊతయో ఊతయః"
18. నేడు మేము జయింతుము. నేడు మేము సుఖింతుము. నేడు మేము పాపరహితుల మగుదుము. ఉషాదేవీ! మేము పీడకలతో భయపడినాము. ఆభయమును తొలగించుము. "అనేహసోవ ఊతయః సుఊతయో ఊతయః"
(కలకు కార్యముతో నిమిత్తములేదు కాని మనసుతో నిమిత్తమున్నది. కల దాడిపంచగలదు దడపుట్టించ గలదు. ముదము కలిగించగలదు మురిపింపగలదు. కలలందు సహితము చెడు కలుగరాదను సత్యకల్పము ! సదాశయము!!)
నలుబది ఎనిమిదవ సూక్తము
ఋషి - ఆస్త్య త్రితుడు దేవత - ఆదిత్యుడు - ఉష ఛందస్సు - పంక్తి
1. నేను ప్రాజ్ఞుడను. అధ్యయన యుక్తడను కర్మ యుక్తుడను అత్యంత పూజితుడను. నేను స్వాదు అన్నమును ఆస్వాదించ కలుగ వలెను. విశ్వదేవతలు, మానవులు ఈ అన్నమును మనోహరము అనుకొందురు దానిని అందు కొందురు.
2. సోమమా ! నీవు హృదయ మధ్యమము నుండి పయనింతువు. నీవు అధీనుడవు. దేవతల కోపమును వేరుచేయ గలవాడవు. నీవు ఇంద్రుని స్నేహము చేయుము. ఇచ్చటకి ఏతెంచి - గుఱ్ఱము బరువు మోసినట్లు - మా ధనము మోయుము.
3. అమరసోమమా ! మేము నిన్ను ఆస్వాదింతుము. అమరులమగుదుము. తదుపరి ద్యుతిమంత స్వర్గము చేరుదుము. దేవతలను కనుగొందుము. అప్పుడూ మేము మానవులమే. అయినను మమ్ము శత్రువు ఏమిచేయగలడు? హింసకుడు ఏమి చేయగలడు?
(దేవతల జ్ఞానము కలిగినంత మానవుడయ్యు శత్రువులకు, హింసకులకు అతీతుడగును అని)
4. సోమమా! తండ్రి, కొడుకు సుఖములకే అగును. అట్లే. నిన్ను సేవించినంత - నీవు మాసుఖములకే నిలుపుము. అనేకుల బ్రతుకులందు ఆయువు పెంచుము.
5. సోమమా! నిన్ను స్వీకరించినంత కీర్తి కలుగును. రక్షణ ఇచ్చుట పెరుగును. నీవు నా అవయవములన్నింటిని - పశువును కొయ్యకువలె - కర్మకు కట్టు కట్టుము. నన్ను చరిత్రహీనుని చేయకుము. వ్యాదులను దూరము ఉంచుము.
6. సోమమా ! నిన్ను సేవించినంత - రగిలిన అగ్గివలె - నన్ను వెలిగించుము. నన్ను నీ వానిగా చూచు కొనుము. నన్ను మరింత ధనవంతుని చేయుము. నేను నీకు ఆనందముకలిగించా దలచినాను. స్తతించు చున్నాను. నీవు ధనికుడవు బలశాలివి అగుము.
7. కోరికల కోర్కెలతో - తండ్రి సొమ్ము వంటి - అభిషుత సోమమును సేవింతుము. సోమమా ! మా ఆయువు - సూర్యుడు దినములను పెంచినట్లు - పెంచుము.
8. రాజా ! సోమమా ! మమ్ము అవినాశ్యులను చేయుము. సుఖవంతులను చేయుము. మేము వ్రతధారులము. నీ వారలము. మమ్ము తెలిసికొనుము. మా శత్రువు వర్థిల్లు చున్నాడు. కోపము పెరుగుచున్నది. ఆరెండింటిని దండించుము. మమ్ము ఉద్ధరింపుము.
9. సోమమా! నీవు మా దేహమును రక్షింతువు. నీవు కర్మనేతల ద్రష్టవు. కావుననే నీవు అన్ని అవయవములందు వ్యాపింతువు. మేము నీ పనులకు ఆటంకము కలిగింతుము. ఆయనను నీవు అన్నవంతుడవు, ఉత్తమ మిత్రుడవై సుఖపెట్టుము.
10. సోమమా ! ఉదరమున బాధ కలిగించకుము. నీవు మిత్రుడవు. నీతో కలసి మసిలెదము. నిన్ను సేవించినంత నన్ను బాధించకుము. హర్యశ్వ ఇంద్రా ! ఈ సోమము నాలో చేరినది. అది చిరకాలము నా జఠరమున ఉండవలెనని ప్రార్థింతును.
11. బాధలు బలవంతములగును. మమ్ము బాధించును. ఏడిపించును. అసాధ్యములు, అనివార్యములగు బాధలు దూరము కావలెను. సోమము. మా వద్ద చేరినది దానిని సేవించినంత ఆయువు పెరుగును. మేము మానవులము. సోమము వద్దకు చేరుదుము.
12. పితరులారా ! సేవించినంత సోమము అమరమైనది. మర్త్యులమగు మా హృదయములందు నిలిచినది. హవ్యములిచ్చి ఆసోమముతోనే మిమ్ము సేవింతుము. ఈ సోమపు సుబుద్ధియు, కృపయు మాపై ఉండవలెను.
13. సోమమా ! నీవు పితరులతో కలసి ద్యావా పృథ్వులను విస్తరింపు చేస్తావు. హవితో నిన్ను సేవిస్తాము. మేము ద్యుపతులమ్ అవుతాము.
14. త్రీతలగు దేవతలారా ! మాతో తీయగా మాట్లాడండి స్వప్నములు మమ్ము వశపరచు కొనరాదు. నిందకులు మమ్ము నిందించకుండ వలెను. మేము సదాసోమప్రియులము కావలెను. అందువలన సుందర స్తోత్రవంతులమై స్తోత్రము ఉచ్చరించగలము.
15. సోమా ! నీవు మాకు నలుదిశల అన్నదాతవు. స్వర్గప్రదాతవు. సర్వదర్శివి, మాలో ప్రవేశించుము. ప్రసన్నుడవగుము. రక్షణల సహితుడవై మమ్ము వెనుకనుంచియు ముందునించియు రక్షింపుము.
(ఆంధ్ర వచన ఋగ్వేద సంహిత ఆరవ అష్టకము ఎనిమిదవ మండలమున ఆరవ అనువాకము సమాస్తము)
ఏడవ అనువాకము నలుబది తొమ్మిదవ సూక్తము
ఋషి - ప్రగాథపుడు భర్గుడు, దేవత - అగ్ని, ఛందస్సు - జగతి.
1. అగ్నీ ! నీవు అన్య అగ్నుల సహితముగా విచ్చేయుము. మేము నిన్ను హొతగా ఎరుగుదుము. వరింతుము. నీవు నియతుండవు. హవివంతుడవు. యజనీయుడవు. శ్రేష్ఠుడవు. నిన్ను ఆధ్వరలు కుశలపై ఆసీనుని చేయుదురు - ఆలంకరించెదరు.
2. హలపుత్ర, అంగిరులలో అన్యతను అగ్నీ! యజ్ఞమున ప్రాప్తికొరకు స్రుక్కుసాగును. అగ్నీ ! నీవు అన్నరక్షకుడవు. ప్రదీప్తజ్వాలవంతుడవు. ప్రాచీనుడవు. యజ్ఞమందు నిన్ను మేము స్తుతింతుము.
3. అగ్నీ ! నీవు విద్వాంసుడవు. ఫలదాతవు. పానకుడవు. హోతవు. హోమ సంపాదకుడవు. దీప్తుడవు. ఆమోదనీయుడవు, సర్వోచ్చ యజనీయుడవు. యజ్ఞమున విప్రుల మనమంత్రములతో నిన్ను స్తుతింతురు.
4. యువతమ, నిత్య అగ్నీ! నేను ద్రోహశూన్యుడను. దేవతలవాడను. హవిభక్షణకు దేవతలను తీసికొని రమ్ము. వాసదాత అగ్నీ! అందముగా అమర్చిన అన్నము వద్దకు రమ్ము. స్తుతులతో పూజింతుడవగుము. ప్రసన్నుడవగుము.
5. అగ్నీ! నీవు రక్షకుడవు. సత్యస్వరూపుడవు. కవివి సర్వత్ర వ్యాపించిన వాడవు. సమిధులవాడవు. దీప్తుడవు. విప్రస్తోతలు నిన్ను భజిస్తారు.
6. అతి పవిత్ర అగ్నీ ! దీప్తుడవగుము ప్రదీప్తము చేయుము. నీవు మహామహుడవు. ప్రజలకు, స్తోతలకు సుఖములు ప్రదానము చేయుము. వారు - శత్రు విజేత, సుందర అగ్ని యుక్తులు కావలెను.
7. అగ్నీ ! నేలమీది ఎండు కట్టెను కాల్చినట్టు - మాకు ద్రోహము తలపెట్టు వానిని, మా విషయమున దుర్భుద్ధిగలవారిని దహించుము.
8. అగ్నీ! మమ్ము బలవంతులగు హింసకులకు అప్పగించకుము. మాకు అరిష్టము కోరువారికి వప్పగించకుము. అహింసక. ఉద్ధారక, సుఖ కర రక్షణలతో మమ్ము కాపాడుము.
9. అగ్నీ ! మమ్ము ఒక్క ఋక్కులతో రక్షింపుము. నాలుగు వాక్యములతో రక్షింపుము ఎట్లయినను రక్షింపుము.
10. సకల రాక్షసులనుండి, దాతలు కానివారినుండి రక్షింపుము. యుద్ధమున మమ్ము రక్షింపుము. నీకు మాకు దగ్గరివాడవు. బంధువవు. యజ్ఞము, సమృద్ధికొరకు నిన్ను ప్రార్థింతుము.
11. అగ్నీ ! నీవు శోధకుడవు. సమీపవర్తిని. ధనదాతవు. మాకు అన్న వర్థకము, ప్రశంసనీయమగు ధనమును అందించుము. నీతిగలదియు, అనేకులు తలచునదియు, అత్యంత కీర్తికరమగు ధనమును ప్రసాదించుము.
12. క్షిప్రకారిశత్రువును, వారి శాస్త్రపాతములనుండి రక్షించినట్టియును, వారిని వధించగలట్టియు ధనమును మాకు ప్రసాదించుము. నీవు ప్రజ్ఞద్వారా కర్మధనికుడవు. మమ్ము అన్నముతో వర్థిల్లచేయుము. మమ్ము ధనమునిచ్చు కర్మలతో సుసంపన్నము చేయుము.
13. వృషభసమమగు తన శృంగము - జ్వాలతో - వర్థిల్లి అగ్ని శిరః కంపనము చేయుచున్నాడు. అగ్ని జ్వాలలు తీక్షతమములు. వానిని ఎంతటివాడును ఆర్పజాలడు. అగ్ని దంతములు వాడియైనవి. అవి బలపుత్రులు.
14. వర్షదాత అగ్నీ! నీవు వర్థిల్లువాడవు. నీదంతములు - జ్వాలలు - ఆర్పరానివి. నీవు హోతవు. మ హవిని చక్కగా వహించుము. మాకు వరణీయమగు విశేషధనము ప్రసాదించుము.
15. అగ్నీ ! అడవి నీకు తల్లివంటిది. నీవు అరణిద్వయమున వసింతువు. మానవులు నిన్ను వర్థిల్ల చేయుదురు. నీవు ఆలస్యముచేయక హవ్యదాతహవిని దేవతలకు చేర్చుము. తదనంతరము దేవతల శోభలు అందుకొనుము.
16. అగ్నీ! నిన్ను సప్తహొతులు స్తుతింతురు. నీవు అభిలాష ప్రదుడవు. ప్రవృద్దుడవు. తాపక తేజమున మేఘమును త్రుంచెదవు. అగ్నీ ! మమ్ము అతిక్రమించి విచ్చేయుము.
17. స్తోతలారా ! మీ కొరకే మేము అగ్నిని ఆహ్వనిస్తున్నాము. మేము కుశలను తెంపినాము. హవినిసిద్ధము చేసినాము. అగ్ని కర్మధారకమగు అనేక లోకములందున్నవాడు. సమస్త యజమానులకు హోత.
18. అగ్నీ ! ఉత్తమ సామమున, సుఖవంతమగు యజ్ఞపు యజమాని - ప్రాజ్ఞులగు మానవులతో కూడి - నిన్ను స్తుతించును. అగ్నీ ! మమ్ము రక్షించుటకుగాను - స్వచ్చందముగా - దగ్గర ఉండునదియు, నానా రూపధారియగు దినమును తీసికొనిరమ్ము.
19. అగ్నీ! నీవు దేవతవు. స్తుత్యుడవు నీవు ప్రజల పాలకుడవు. రాక్షసుల సంతాపకుడవు. యజమాని గృహమున నిరంతరము నివసించువాడవు. రక్షకుడవు. నీవు యజమాని ఇంటిని వీడవు. నీవు మహామహుడవు. ద్యులోక పాలకుడవు.
20. దీప్తవంత అగ్నీ ! మాలోనికి రాక్షసులు ప్రవేశించరాదు. బాధకులు ప్రవేశించరాదు. దారిద్ర్యము, హింస, బలశాలి రాక్షసులను దూరమున ఉంచుము.
ఏబదవ సూక్తము
ఋషి - ప్రాగాధ భర్డడు, దేవత - ఇంద్రుడు, చంధస్సు - బృహతి.
1. ఇంద్రా ! మా స్తోత్రరూపమును శాస్త్రాత్మక వాక్యమును వినుము. మా సహగామి కర్మయుక్తుడవై, సోమపానమునకు విచ్చేయుము.
2. ద్యావాపృథ్వులు - విరాజమానుడునగు, వృష, దాతయగు ఇంద్రుని సంస్కరించినవి. ఆ ఇంద్రుని బలమును సంస్కరించినవి. అందువలన ఇంద్రదేవా! ఉపమాన భూతులగు దేవతలలో ముఖ్యుడవై వేదిక మీద ఆసీనుడవగుము. "సోమకామంహితేమనః" నీమనసు సోమాభిలాషియగును కదా!
3. ఇంద్రా! నీవు విశేష ధనవంతుడవు. హవ్యవంతుడవు. శత్రుంజయుడవు అణచబడలేనివాడవు. ఇతరులను అణచగలవాడవు. అట్లని మాకు తెలియును. ఇంద్రా! నీ ఉదరమును అభిషుత సోమముతో తడుపుము.
4. ఇంద్రా ! నీవు ధనికుడవు కిరీటివి, వజ్రధరుడవు, అహింస నీ స్వభావమగును. మేము కర్మమొనరించి ఫలితము కోరువారలము కావలెను. నీవు ఆ ప్రకారము చేయుము. నీ రక్షణలందే మేము అన్నము పొందుదుము. శత్రువులను జయింతుము.
5. యజ్ఞపతి ఇంద్రా ! సకల రక్షణల యుక్తముగా మాకు అభిషుత ఫలప్రదానము చేయుము. నీవు శూరుడవు యశస్వివి యజ్ఞప్రాపకుడవు. భాగ్యమును సేవించినట్లు మేము నిన్ను సేవిస్తాము.
6. ఇంద్రా ! నీవు అశ్వపోషకుడవు. గోవుల సంఖ్యను పెంచువాడవు. స్వర్ణ శారీరివి. నిర్ఘరస్వరూపుడవు. నీవు మాకు ఇవ్వదలచిన దానిని ఎవడును హింసించజాలడు. అందువలన నేను యచించినది తెచ్చి ఇమ్ము. "యద్యద్యామితదాభర"
7. ఇంద్రా! రారమ్ము -ధనము దానము చేయుటకుగాను - నీ సేవకునకు అనుభవించదగిన ధనమునిమ్ము. నేను గోవులను కోరుదును. గోవులనిమ్ము అశ్వములను కోరుదును. అశ్వములిమ్ము.





