Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
జనం హింసకు పూనుకోవడానికి ఉద్యుక్తులు అవుతున్నారు. వెనుక వరుసల్లో మాటలు సాగుతూనే ఉన్నాయి.
"మంచి గుణపాఠం నేర్పాడు, జన్మ జన్మాలకు మరిచిపోకుండా ."
"మన మొఖాలకు కొట్టిన మురికి నంతా వాళ్ళ డొక్కల్లో నూకాడు."
"అతడు మనవాడే. మన సోదరుడే."
కోపాద్రిక్తులైన ఇద్దరు వ్యక్తులు జనాన్ని నెట్టుకుంటూ మండపపు మెట్ల దాకా వచ్చి కాలూ అంగరక్షకుల్లా అన్నట్లు అతని ఉభయ పార్శ్వాలలో నుంచున్నారు.
కాలూ పెద్ద కేక పెట్టాలనుకున్నాడు. అతని కళ్ళు చమక్కున వెలిగాయి. బిటెన్! విశ్వనాద్! తిరిగి వచ్చేశారు. వారు కాలూ చెప్పింది వినడానికీ పులి గుండెలో బాగు గుచ్చుతూ ఉండగా చూడ్డానికీ వచ్చారు. మట్టి బిడ్డ పెళ్ళున తన్నింది. తన్నడం తన్నడం డొక్కలో తన్నింది. విలవిలా తన్నుకునేట్లు తన్నింది.
చంద్రలేఖలో ఆనంద సాగరం పొంగింది. అయినా ఆమె జ్ఞాపకశక్తి చావలేదు.
కాలూ తన ఉన్మాదసమయం మరిచిపోయాడా? అతడు వెళ్ళిపోవడం వల్ల తనకు కలిగిన బాధను గుర్తిస్తే? తన్ను గుడికీ, జగన్మాతకూ అప్పగించడానికి అతడే కారణం అని తెలుసుకుంటే?
వెనుక వరుసల్నుంచి "సోదరునికీ జై" అనే నినాదాలు వినిపించాయి.
ఆ నినాదం ఒక్కటే. ఒక్కడు చేసిందే. అయినా అతని శ్వనిలో ఉద్రేకం, ఉత్సాహం నిబిడీకృతం అయి ఉన్నాయి. ఆ నినాదం పిడుగులా పడింది.
భగవదాజ్ఞకు తలోగ్గినట్లు పెండాల్లో బాపలంతా వణికిపోయారు. మండపం మీదివాళ్ళు దిగాలుపోయి చూశారు. ఏమిటిది? ఎలా జరిగింది? దగా కోరు . వాడు సభను తనవేపు ఎలా మళ్ళించుకున్నాడు? గందరగోళం జరిగితే ఆదుకోవడానికి తనవాళ్ళను ఏర్పాటు చేశాడా? ఏరీ? పోలీసులెక్కడ?
"సోదరునికీ జై" నినాదం చేసినప్పుడల్లా కంఠంలోని శక్తీ, ఆగ్రహమూ వినిపిస్తున్నాయి.
కాలూ కు కూడా ఇదంతా అర్ధం కాలేదు. ఆశ్చర్యపోయాడు. తనకు జయపెట్టేది ఎవరు? నినాదం వచ్చేవైపు చూశాడు తెలిసిపోయింది.
ఆబాలబంధు ముఖం పిండి ముద్ద అయిపొయింది. మోతీచంద్ ను పిలిచాడు. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు.
"సోదరునికి జై" ఇది యుద్ద నినాదం.
ఈ పోరాటంలో చివరకు గెలుపు తనదేనని కాలూ గ్రహించాడు.
"బిటెన్ విను.
విశ్వనాద్ విను.
ఒకడు తన రక్త మంసాల్ను ఎంతకాలం మోసగించగలడు?"
చంద్రలేఖ గర్వంతో పొంగిపోయింది. అనందం భరించలేక తబ్బిబ్బైంది.
"బాబా, జనం నీకు "జై అంటున్నారు. వందగుళ్ళయినా ఈ క్షణానికి సమానం కావు. ఇది జరిగిం తర్వాత ఏం జరిగినా, ఎక్కడికి వెళ్ళినా ఓటమి అన్నది ఉండదు."
బాపలు తెల్లబోయారు. వారికి ఏమీ అర్ధం కాలేదు. నుంచున్నవారు నుంచున్నట్లే ఉండిపోయారు. "చుట్టూ బాకులు పట్టుకున్న గుండాలున్నారు. పారిపోండి పరుగెత్తండి....."
మోతీచంద్ మండపం ముందుకు ఉరికి వచ్చాడు. చేతులు జోడించి తానూ చెప్పేది వినాల్సిందిగా ప్రార్థించాడు.
గొంతు బరువైంది. ధ్వనిలో మార్దవం గోచరించింది. "హింస సర్వత్రా త్యాజ్యం అందులోనూ ముఖ్యంగా పవిత్రస్థలాల్లో, జనం ఎంత ఉసిగొల్పిన హింసకు దిగరాదు. నాస్తికుడైన కుమ్మరి సాక్షాత్తు భగవవంతుడినే వెక్కించాడు. అతనికి శిక్ష లభించి తీరాల్సిందే. కాని శిక్షించేదెవరు? మీరే నేనూ కాదు. ఆ పరమాత్ముడు. పరాత్పరునికి తెలియనిదంటూ ఉంటుందా? వాడు శిక్ష ప్రారంభించాడు. లేకపోతే కమ్మరి ఇదంతా వెళ్ళగక్కుతాడా? అతడు క్షంతప్యుడుకాడు. ఈ నగరపు వేదాంతులు ఒక్క భారతదేశంలోనే కాక సకల ప్రపంచంలోనూ పేరు ప్రఖ్యాతులు కలవాళ్ళు. అలాంటి వారు ఈ ఉద్రేకానికి లొంగరాదు."
"చంద్రలేఖా! రా."
నవదళ పద్మమండపం నుంచి, లేఖ చేయి పట్టుకొని కాలూ మెత్తని నేలమీదికి నడిచాడు. బిటేన్నుకళ్ళతో ప్రశ్నించాడు. ప్రత్యుత్తరంలో ఉద్రేకం ఏమాత్రం లేదు. సాఫీగా ఉంది.
"మిత్రమా , జయం నీది. నీవు ఆత్మను జయించావు. ఆన్యులు జయించావు. నీ ఈ విజయం అనేక వేలమందిలో ఆత్మ శక్తిని నింపివారిని ఉక్కు బిడ్డలుగా సిద్దం చేస్తుంది. నీ ఈ కధ స్వాతంత్ర్య సమర గాధ. నిద్రితుల్ను జాగరూకుల్ను చేసి వారిలో ఉత్సాహం నింపేగాధ."
ఒకే ఆదర్శానికి కట్టుపడ్డవారంతా తదేకంగా ఒకరి నొకరు చూసుకున్నారు. కాలూ తల ఊపి నిరామయంగా నవ్వే దాకా అలాగే చూస్తూ ఉండిపోయారు.
"ఈ విజయం నాది కాదు బికాష్ ముఖర్జీ నీది"
కర్ర ముఖాల్ను, బిగించిన పిడికిళ్ళనూ చీల్చుకుంటూ సాగిపోయాడు.
ఉపన్యాస మధ్యంలో ఆగి, " హారం" అని చిన్నకేక పెట్టాడు మోతీచంద్.
చంద్రలేఖ హారం విషయమే మరిచి పోయింది. మెళ్ళోంచి గొలుసు తీసి మోతీచంద్ చేతిలోకి విసిరింది. తిరిగి సాగిపోయింది.
బిటేన్, విశ్వనాద్ ఇద్దరూ గుంపు చివరిదాకా నిలిచిపోయారు.
"తండ్రీ కూతుళ్ళు ఒకరికి ఒకరుఉంటే చాలు. వారికి మరెవ్వరూ అవసరం లేదు." అన్నాడు బెటేన్.
విశ్వనాద్ తల ఊపాడు.
కాలూ కూతురుతో సహా గుడి గేటు దాటి వెళ్ళిపోయాడు .
*సమాప్తం *





