Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
19. ఆహ్వానయోగ్య ఇంద్రా! మానవులందించు హవ్యము వద్ద సంచరించుము. అభిషుతసొమ్ము ఆస్వాదించుము.
20. ఇంద్రా! ఈ సోమము గోవులిచ్చి కొన్నది జలముతో కలసినది దీనిని స్వీకరించుము.
21. ఇంద్రా ! క్రోధమున అభిషవించు వానిని దాటిరమ్ము ఉపయుక్తము కాని చోట అభిషవించు వానిని దాటి రమ్ము ఉపయుక్తము కాని చోట అభిషవించువానిని దాటిరమ్ము. మేము అభిషుత సొమము సమర్పించినాము ఆరగింపుము.
22. ఇంద్రా ! మా స్తుతిని గ్రహించుము. నీవు దూరదేశమునుండి రమ్ము. మా ముందునకు, వెనకకు, పక్కలకు విచ్చేయుము. పంచజనులను దాటి విచ్చేయుము.
(పంచజనులు గంధర్వులు, పితరులు. దేవతలు, అసురులు, రాక్షసులు అని యాస్కుడు నిషాదయుక్తమగు చతుర్వర్ణములు అని శాయణుడు.)
23. సూర్య ! నీవు కిరణములు ప్రసాదించినట్లు ధనమును ప్రసాదించుము పల్లపు భూమిలో నీకు లభించునట్లు మాస్తుతులు నీకు లభించవలెను.
24. అధ్వర్యులారా ! సుందర కిరీటముగల ఇంద్రుని కొరకు త్వరగా సొమము సిద్ధము చేయండి సోమపానమునకు ఇంద్రుని ఆహ్వానించండి.
25. నీటి కొరకు మబ్బును పెకలించినవాడు అంతరిక్ష జలమును నేలకు పంపినవాడు గోవులకు పక్వమగు పాలు ప్రదానము చేసినవాడు - అతడే ఇంద్రుడు.
26. దీప్తివంటి ఇంద్రుడు 'ఔర్ణనాభుని' 'అహీశువు' ని వృత్రుని వధించినాడు. ఇంద్రుడు తుషార జలమున మేఘమున బ్రద్దలు కొట్టినాడు.
27. ఇంద్రుడు ఉగ్రుడు నిష్ఠురుడు పరాభవకర్త బలముతో హరించువాడు. ఉద్గాతలారా! దేవతలు మెచ్చిన స్తుతులతో ఇంద్రుని గుణగానము చేయండి.
28. ఇంద్రునకు సోమపు మత్తు కలిగినపుడు అతడు దేవతలకు సకల కర్మములను సూచించును.
29. హర్యశ్వములు హిరణ్య కేశములుగలవి. ఒకేసారి మత్తునందునవి. అవి ఈ యజ్ఞమునందలి సోమరూప అన్నమునకుగాను ఇంద్రుని ఇచటికి చేర్చవలెను.
30. అనేకులు స్తుతించు ఇంద్రుని. ప్రియమేధుడు స్తుతించు అవద్వయము మాముందుకు చేర్చవలెను.
ముప్పది మూడవ సూక్తము
ఋషి - కాణ్వమేధాతిథి, దేవత - ఇంద్రుడు, ఛందస్సు -
1-16 బృహతి 17 - 19 గాయత్రి
1.వృత్రఘ్న ఇంద్రా! మేము సోమము అభిషవించినాము జలము వంటి మేము మీ ముందుకు చేరుదుము. పవిత్ర సోమము ప్రసృతముకాగా కుశలపై ఉంచిన స్తోతలు నిన్ను ఉపాసింతురు.
2. నివాసదాతయగు ఇంద్రా! అభిషుత సోమము నిర్గతమైనంత, ఉక్ధవంతనేతలు నిన్ను స్తుతింతురు. నీవు సోమపిపాసుడవై వృషభమువలె ఝ్విచేయుచు, యజ్ఞస్థానమునకు ఎప్పుడు అరుదెంతువు?
3. శత్రుదమనకారి ఇంద్రా ! కణ్వులకు వేల కొలది అన్నములు ప్రసాదించుము. ధనవంత, విశేషద్రష్ట ఇంద్రా! మాకు దృష్టము, పిశంగ రూపముగల గోరంత ధనము ఇమ్మని యాచించు చున్నాము.
4. మేధ్యతిథే ! సోమపానము చేయుము హర్యశ్వములను రథమునకు కట్టువాడును, సోమసహాయకుడును, వజ్రధరుడును, బంగారు రథము కలవాడును అగు ఇంద్రుని అతనికి సోమము వలన మత్తు కలిగినపుడు స్తుతించండి.
5. ఇంద్రుని కుడి భుజము సుందరము. అతడు ఈశ్వరుడు ప్రాజ్ఞుడు, వేల కర్మలవాడు బహుధనశాలి. పురభంజనుడు ప్రాజ్ఞుమున స్థిరుడు అట్టి ఇంద్రుని స్తుతించండి.
6. ఇంద్రుడు శత్రుదమనుడు. శత్రువులు పట్టజాలనివాడు. యుద్ధమున ఆశ్రయించ దగినవాడు. విశేషధనవంతుడు సోమపాయ. అనేకులు స్తుతించువాడు ఆ ఇంద్రుడు సర్వకర్మ సమర్థుడగు యజమానికి పాడియావు వంటివాడు. అట్టి ఇంద్రుని స్తుతించండి.
7. ఇంద్రుడు సుందర హనుమంతుడు సోమముతో తృప్తుడగువాడు. పురచ్చేదకుడు. సోమాభిషవము కాగా ఋత్విక్కులతో సోమపానము చేయువాడు ఆ ఇంద్రుని ఎవడు తెలిసికొనగలడు? అతనికి ఎవడు అన్నము సమర్పించగలడు?
8. శత్రువును వేదకుడు పోవు గజము మదజలమురాల్చును. అట్లే ఇంద్రుడు యజ్ఞమునందుమైకము దాల్చును. ఇంద్రుని శాసించువాడులేడు. ఇంద్రా ! నీవు సోమాభిషవమువైపు విచ్చేయుము. మహాబలమున సర్వత్ర సంచరించుము.
9. ఇంద్రుడు రుద్రుడైనపుడు శత్రువు అతనిని చూడ జాలడు. ఇంద్రుడు అచలుడు ఇంద్రుడు యుద్ధము కొరకు ఆయుద్ధములను అలంకరించుకొనును ఇంద్రుడు స్తోత ఆహ్వానము ఆలకించినచో వేరుచోటునకు వెళ్ళడు. అక్కడికే వచ్చును.
10. ఉగ్ర ఇంద్రా! నీవు వాస్తవముగా కోరికలు తీర్చువాడవు అందరిని ఆకర్షించువాడవు మా శత్రువులకు అందని వాడవు అభీష్టవరదుడవని ప్రఖ్యాతుడవు. దూరప్రాంతములందును దగ్గరి చోట్లను నీవు అభీష్టవరదుడవని ప్రసిద్ధుడవు.
11. ధనిక ఇంద్రా ! నీ గుఱ్ఱముల కళ్లెములు అభీష్టవర్ధకములు బంగారు నీ కొరడా అభీష్ట వర్ధకము. నీ రెండు అశ్వములు అభీష్ట వర్ధకములు ఇంకను శతుక్రతు ఇంద్రా! నీవు అభీష్ట వర్ధకుడవు.
12. అభీష్ట వర్ధక ఇంద్రా! నీ కొరకు సోమాభాషవాము చేయువాడు, అభీష్టవర్ధమై, సోమము అభిషవించవలెను సరళగామి ఇంద్రా! ధనము ప్రసాదించుము నీవు అశ్వముల ముందు నిలిచినవాడవు వర్ధము కలిగించువాడవు నీకొరకు జలమున సోమమును అభిషవించువాడు సోమముతో నిలిచి ఉన్నాడు.
13. శ్రేష్ఠబలవంత ఇంద్రా ! సోమరూప మధు పానమునకు విచ్చేయుము. ఇంద్రుడు ఇక్కడికి రాకుండా స్తుతి, స్తోత్రము, ఉక్ధ వినడు.
14. ఇంద్రా ! నీవు వృత్రఘ్నడవు బహుప్రజ్ఞావంతుడవు నీవు రథమునందున్నవాడవు ప్రభువు రథమున కట్టిన అశ్వములు ఇతర యజ్ఞములను తిరస్కరించి నిన్ను మా యజ్ఞమునకు చేర్చవలెను.
15. మహామహుడవగు ఇంద్రా ! నేడు మావద్ద ఉన్న సోమమును స్వీకరించుము దీప్తసోమమును పానము చేయుము నీకు కలిగిన మత్తు మా యజ్ఞమునకు కళ్యాణవహము కావలెను.
16. ఇంద్రుడు వీరుడు అతడు మాకు నేత అతడు నీయొక్క, నా యొక్క, ఇతరుల శాసనమున ప్రసన్నుడుకాడు.
17. ఇంద్రుడు అన్నమాట :- "స్త్రీమనసును శాసించుట అసంభవము స్త్రీబుద్ధి కొంచెముది.
18. సోమాభిముఖముగా సాగు అశ్వద్వయము ఇంద్రుని రథమునులాగును. ఈ విధముగా అభీష్టవర్ధక ఇంద్రుని రథము అశ్వముల దృష్ట్యా - శ్రేష్ఠము.
19. ఇంద్రుడు అన్నమాట :- "నీవు మహిళవు క్రిందకు చూడుము - పైకికాదు పాదములను కలిపి ఉంచుము కటిప్రదేశము - దానిక్రింది భాగము కనిపించకుండునట్లు బట్ట కట్టుము. నీవు స్తోతవయ్యస్త్రీని అయినందున ఇవన్నియు చేయవలెను."
ముప్పది నాలుగవ సూక్తము
ఋషి - కాణ్వనీపాతిథి, దేవత - ఇంద్రుడు, ఛందస్సు
- 1 - 15 అనుష్టుప్ 16 - 18 గాయత్రి
1. ఇంద్రా ! అశ్వములతో రమ్ము. కణ్వుల వద్దకు రమ్ము వారి స్తుతులు వినుటకు రమ్ము ఇంద్రుడు ద్యులోకశాసకుడు దీప్తివంత ఇంద్రా ! నీవు ద్యులోకమునకు చేరుకొనుము.
2. ఇంద్రా ! ఈ యజ్ఞమున సోమవంతుడు అభిషవ ప్సరశబ్దముతో నీకు సమర్పించవలెను "ద్యులోకశాపకుడు దీప్తివంతుడగు ఇంద్రుడు ద్యులోకము చేరవలెను" దివో అముష్యశాసతో దివంయమదివావసో"
"ద్యులోకశాపకుడు దీప్తివంతుడగు ఇంద్రుడు ద్యులోకము చేరవలెను" "దివో అముష్యశాసతో దివంయమదివావసో"
3. పొట్టెలు గొర్రెను వడికించినట్లు - ఈ యజ్ఞమున అభిషవశిల సోమలతను వడకించును "దివో అముష్య శాసతో దివంయయది దావావసో."
4. తమరక్షణ కొరకును, అన్నప్రాప్తికిని కణ్వలు ఇంద్రుని ఆహ్వనిస్తారు. "దివో అముష్యశాసతో దివం యమదివావసో"
5. అభీష్టవరదుడగు వాయువునకు ప్రథమ సోమరసము సమర్పించబడును. అట్లే నేను నీకు అభిషుత సొమము సమర్పిస్తాను. "దివో అముష్యశాసతో దివంయయ దివావసో"
6. స్వర్గకుటుంబ ఇంద్రా ! మా వద్దకు విచ్చేయుము. సకల లోకరక్షక ఇంద్రా! మమ్ము రక్షించుటకు విచ్చేయుము. "దివో అముష్యశాసతో దివం యమదివావసో"
7.మహామతి, వేల రక్షణలవాడు, విశేష ధనవంతుడవగు ఇంద్రా ! మా వద్దకు విచ్చేయుము. "దివో అముష్యశాసతో దివం యమదివావసో"
8. ఇంద్రా ! దేవతలచేస్తుతించబడువాడును, మానవులచే గృహమున ప్రతిష్ఠంచబడు అగ్ని నన్ను వహించవలెను. "దివో అముష్యశాసతో దివం యమదివావసో"
9. డేగ తన రెండు రెక్కలను మోసినట్లు - మదస్రావి అశ్వములు నిన్నుమోయవలెను. "దివో అముష్యశాసతో దివం యమదివావసో"
10. స్వామి ఇంద్రా! నీవు నలువైపులనుండి ఏతెంచుము. నీవు స్వీకరించుటకుగాను సోమమును "స్వాహా, అందును." "దివో అముష్యశాసతో దివం యమదివావసో"
11. మేము ఉక్ధలు పఠింతుము. నీవు యజ్ఞమున మా వద్దకు రమ్ము. మమ్ము సంతోష పరచుము. "దివో అముష్యశాసతో దివం యమదివావసో"
12. పుష్టిగల అశ్వములు గల ఇంద్రా ! సమానరూపముగల అశ్వములపై విచ్చేయుము. "దివో అముష్యశాసతో దివం యమదివావసో"
13. నీవు పర్వతములనుంచి రమ్ము అంతరిక్షమునుండి రమ్ము "దివో అముష్యశాసతో దివం యమదివావసో"
14.శూర ఇంద్రా ! నీవు మీకువేల ఆవులు, వేల అశ్వములు ప్రసాదించుము. "దివో అముష్యశాసతో దివం యమదివావసో"
15. ఇంద్రా ! మాకు వేల, పదివేల, వంద ఆయుతముల అభీష్టములను ప్రదానము చేయుము. "దివో అముష్య శాసతో దివం యమదివావసో"
16.ధనవంతులమై శోభించునట్టి వేలమందిమి - నేత ఇంద్రునితోకూడ -బలిష్టములగు పశువులను, అవములను సాధింతుము.
17. సరళగామి ఇంద్రుడు - వాయుసమానవేగవంతుడై - చక్కని గఱ్ఱములతో - సూర్యునివలె విరాజిల్లును.
18. "పారానతుడు" రథచక్రములను పరిగెత్తించు అశ్వములను ప్రదానము చేసినపుడు నేను అరణ్యమధ్యమున ఉన్నాను.
ముప్పది అయిదవ సూక్తము
ఋషి - శ్యావాశ్వ ఆత్రేయుడు, దేవత - అశ్వినులు, ఛందస్సు -
పంక్తి, జ్యోతి - బృహతి - జగతి.
1. అశ్వినులారా! మీరు అగ్ని, ఇంద్ర, వరుణ, విష్ణు, ఆదిత్యగణ, రుద్రగణ, ఉష, సూర్యులతో కలిసి సోమపానము చేయండి.
2. బలశాలురగు అశ్వినులారా ! మీరు సకల ప్రజ, ప్రాణిసముదాయము, ద్యులోకము, పృథ్వి, పర్వతముల కూడియు, ఉష, సూర్యులతో కూడియు సోమపానము చేయండి.
3. అశ్వినులారా ! మీరు ఈ యజ్ఞమున భోక్తలగు ముప్పది ముగ్గురు దేవతలు, మరుత్తులు, భృగువులతో కూడియు ఉష, సూర్యులతో కూడియు సోమపానము చేయండి.
4. అశ్వినులారా! మీరు యజ్ఞమును స్వీకరించండి. నా ఆజ్యమును గ్రహించండి. ఈ యజ్ఞమందలి అన్ని హవానములను అందుకొనండి. ఉష, సూర్యులతో కూడి మా అన్నమును గ్రహించండి.
5. అశ్విద్వయమా! యువకుడు కన్యపిలుపుకు ఆకర్షితుడైనట్లు మీరు ఈయజ్ఞపు స్తోత్రములకు ఆకర్షితులు కండు. ఈ యజ్ఞపు సోమమును స్వీకరించండి. ఈ యజ్ఞమునందలి అన్ని హవనములను అందుకొనండి. ఉష, సూర్యులతో కూడి మా సోమరూప అన్నమును అందుకొనండి. ఉష, సూర్యులతో కూడి మా సోమరూప అన్నమును అందుకొనండి. ఉష, సూర్యులతో కూడి మా సోమరూప అన్నమును అందుకొనండి.
6. అశ్విద్వయమా ! మా స్తుతులను స్వీకరించండి. మా యజ్ఞమును స్వీకరించండి. ఈ యజ్ఞమునందలి అన్ని హవనములను అందుకొనండి. ఉష, సూర్యులతో కూడి మా అన్నము స్వీకరంచండి.
7. రెండు చలకలు పడవ మీద పడినట్లు - మీరు అభిషుతసోమము మీదపడండి, రెండు దప్పిగొన్న బఱ్ఱలు నీటిని కనుగొన్నట్లు మీరు సోమమును కనుగొనండి. ఉష, సూర్యులతో కూడి త్రిమార్గములందు పయనించండి.
8. రెండు హంసలు మార్గము వైపు, ఇద్దరుబాటసారులు జలము వైపు నకు వలె అశ్వినులారా! అభిషుత సోమాభిముఖులు కండు. రెండు మహిషములు వలె సోమమును తెలిసి కొనండి. ఉష, సూర్యులతో కూడి త్రిమార్గమున సాగండి.





