Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
6. మిత్రావరుణులారా ! మీరు ధనదాతలు నేలలోపండు నట్టి దివ్య అన్నప్రదాతలు, జలవతి వర్షము మీ వద్ద ఉండవలెను.
7. మిత్రా వరణులారా! మీరు సత్యవంతులు, సామ్రాట్టులు హవిప్రియులు. మీరు దేవతలను ప్రసన్నము చేయదలచి గోయూధములను వృషభమువలె - వారిని చూచెదరు.
8. సత్యవంతులు, సుకర్ములగు మిత్రావరుణులు సామ్రాజ్యము కొరకు నిలువవలెను. ధృతవ్రతులు, బలశాలురు మిత్రా వరుణులు బలము కొరకు నిలువ వలెను.
9. కంటి కన్నముందు ప్రాణిజాలమును కనగలవారు, సకలజన ప్రేరకులు, చిరంతనులగు మిత్రావరుణులు దుస్సహ తేజోబలమున శోభిల్లుదురు.
10. అదితి మమ్ము రక్షించ వలెను అశ్వినులు మమ్ము రక్షించవలెను. అతివేగవంతులు మరుత్తులు మమ్ము రక్షించవలెను.
11. మరుత్తులారా ! మీరు శుభప్రదాతలు అహింసితులు. మీరు రాత్రింబవళ్లు మానావను రక్షించండి. మీపాలనలో మేము ఏకత్రితులము కాగలము.
12. మేము వ్యధితులముకాక - హింసాశూన్యుడు, సుదాత అగు విష్టువుణు స్తుతింతుము. వంటరిగానే యుద్ధము చేయగల విష్ణువు స్తోతలకు ధనము ప్రదానము చేయవలెను. కర్మప్రారంభకుడగు యజమాని స్తుతిని విష్ణువు వినవలెను.
13. మేము - శ్రేష్ఠము, సర్వరక్షకము, వరణే యధనమును ఆశ్రయింతుము. మిత్రావరుణులు, ఆర్యమ ఆ ధనమును రక్షింతురు.
14. మాధనమును పర్జన్యుడు రక్షించవలెను మరుత్తులు, అశ్వినులు రక్షించవలెను ఇంద్రుడు, విష్ణువు, కోరికలు తీర్చు సమస్తదేవతలు రక్షించవలెను.
15. ఆ దేవతలు పూజ్యులు, నాయకులు వరదవచ్చి చెట్లను పెకిలించినట్లు వారు శత్రువులను కూల్చగలరు.
16. మిత్రుడు లోకపతి ప్రధాన పదార్థములందు అనేకములను అతడు తన తేజస్సుణు చూడగలడు మేము మిత్రా వరుణులతో మిత్రుని వ్రతము ఆచరింతుము.
17. మేము సామ్రాజ్య సంపన్నుడగు వరుణుని గృహమునకు చేరుదుము. ప్రసిద్ధమిత్రుని వ్రతము సహితము చేయుదుము.
18. మిత్రుడు స్వర్గమును, భూలోకపు అంచులను తనకిరణములతో వెలిగించును. తన మహిమతో ఆ రెండు లోకములను నింపును.
19. మిత్రావరుణులు మంచి శౌర్యవంతులు. ఆదిత్యుని ఆకాశమును వెలుగులతో విస్తరింపచేయుదురు తదుపరి అగ్నివలె శుభ్రవర్ణులై, అందరిచేత ఆహ్వానించబడి, అవతరింతురు.
20. స్తోతలారా ! విశాల గృహముగల యజ్ఞమున మిత్రా వరుణులను స్తుతించండి. వరుణుడు పశుయుక్త అన్నములకు ప్రభువు ప్రసన్న కారకమగు అన్నము అందించు సమర్థుడు.
21. నేను మిత్రావరుణుల తేజస్సును, ద్యావాపృథ్వులను స్తుతింతును. వరుణుడు ఎల్లప్పుడు దాతగా మాముందు నిలువ వలెను.
22. ఉక్షగోత్రజుడు 'సుషామ' పుత్రుడు 'వరు' రాజు దానము వలన నాకు సరళగామి, రజతసమము, అశ్వయుక్తమగు రథము లభించినది. సుషామ్ పుత్రుని రథము శుత్రువుల జీవనమును, ఐశ్వర్యమును హరించగలది.
23. వరురాజు మాకు రెండు అశ్వములు ఇచ్చినాడు. అవి హరిత వర్షలు, శత్రు బాధకములు మంచి మనుష్యులను మోయునవి.
24. అభినవస్తుతులతో స్తుతించినపుడు మాకు చక్కని త్రాళ్లు, కొరడా కలిగి, సంతోష ప్రదములై, శీఘ్ర గాములగు రెండు అశ్వములు లభించినవి.
ఇరువది ఆరవ సూక్తము
ఋషి - అంగిరసులగు ఇద్దరు వ్యశ్వులు లేక వైయశ్యులు లేక వైయశ్వుడు
లేక విశ్వమనువు. దేవత - అశవినులు - వాయువు ఛందస్సు - గాయత్రి - ఉష్ణిక్
1. అశ్వినులారా ! మీరు వర్షకులు ధనదాతలు మీ బలమును బాధించగలవాడు లేడు మిమ్ము స్తోతల మధ్యకు చేర్చుటకు శిఘ్రగమనముగల రథమును పిలుస్తాను.
2. అశ్వినులారా ! మీరు సత్యస్వరూపులు, వరప్రదులు ధనశాలురు సుషామ పుత్రుడు వరురాజుకు ధనము ఇచ్చుటకు ఏతెంచినట్లే సకల రక్షణలతో విచ్చేయుడు. వరు రాజా! వారికి ఒకమాట చెప్పుము.
3. అన్నము, ధనము, బృహదన్నముగల అశ్వినులారా! నేడు ప్రాతఃకాలమే మిమ్ము హవ్యముతో ఆహ్వానింతుము.
4. నేతలగు అశ్వినులారా ! మీ రథము అన్నింటిని మించి బరువు మోయగలది ఆ ప్రసిద్ధరథమున విచ్చేయండి స్తోతకు సంపదలిచ్చుటకు అతని స్తోత్రములను గ్రహించండి.
5. వరప్రదులు, ధనవంతులగు అశ్వినులారా! కుటిల కార్య శత్రువులు మీ ముందే ఉన్నారనుకోండి మీరు రుద్రులు ద్వేషించు శత్రువును కష్టాల పాలుచేయండి.
6. అశ్వినులారా ! మీరు సర్వదర్శనీయులు కర్మప్రియులు మదకర కాంతివంతులు జల పోషకులు మీరు వడిగల గుఱ్ఱముల మీద రెండు సమస్త యజ్ఞములకు విచ్చేయండి.
7. అశ్వినులారా! మీరు ధనికులు శూరులు అజేయులు లోకపాలక ధనముతో మా యజ్ఞమునకు విచ్చేయండి.
8. ఇంద్ర, అశ్వినులారా ! మీరు ఎంతో సేవింపదగినవారు, నేడు నాయజ్ఞమునకు దేవతల సహితులై విచ్చేయండి.
9. అశ్వినులారా! మీరు 'వ్యశ్వ' సములు ధనదాన ప్రాప్తి కలుగవలెనని మిమ్ము ఆహ్వానించు చున్నాము. మేధావులారా! దయచేసి మా వద్దకు విచ్చేయండి.
10. ఋషీ ! నీవు అశ్వినులను స్తుతించుము మాటిమాటికి మీ పిలుపు విన్న అశ్వినులు దగ్గరలోనున్న శత్రువులను, పణులను వధించెదరు.
11. నేతలారా ! వైయవును ఆహ్వానము ఆలకించండి. నా ఆహ్వానమును గ్రహించండి వరుణ, మిత్ర, ఆర్యము ఎల్లప్పుడు కలసియే ఉందురు.
12. స్తవనీయులు, వరదులగు అశ్వినులారా ! మీరు స్తోతలకు ఇచ్చునట్టిదియు - వారి కొరకు తెచ్చునదియు నిత్యము నాకు అందించుము.
13. వధువు వస్త్ర్తము చుట్టుకున్నట్లు - యజ్ఞములు చుట్టుకున్నవాని మంచి చెడ్డలు అశ్వినులుచూచుచు అతనికి శుభములు కలిగింతురు.
14. అశ్వినులారా ! మీరు అత్యంత వ్యాపకులు నేతలు పానయోగ్యమగు సోమము సమర్పించువారున్నారు. ఆవిషయము ఎరిగిన నన్ను అనుగ్రహించుటకు మా ఇంటికి విచ్చేయండి.
15. వరదులు, ధనికులగు అశ్వినులారా! నేతలకు పానయోగ్యమగు సోమమునకుగాను మా ఇంటికి విచ్చేయండి శత్రువును వధించు శరసమమగు స్తుతివాక్యములతో యజ్ఞమును చేయండి.
16. అందరినేతలగు అశ్వినులారా! స్తోత్రములందలి స్తుతి విశేషము మిమ్ము చేరవలెను పిలువవలెను - ప్రసన్నులను చేయవలెను.
17. అశ్విద్వయమా ! ద్యులోకపు దిగువనున్న సముద్రమునందు మీరు మత్తులై ఉన్నచో మా ఈ స్తోత్రమును వినండి.
18. 'శ్వేతయావరి' నదులలో స్పందనశీల - హిరణ్యమార్గ ఆమె మిమ్ము స్తుతించుచు మీ వద్దకు చేరును.
19. సుందర గమనులగు అవిద్వయమా! కీర్తివంతము, శ్వేతవర్ణము, పుష్టి కారకమగు 'శ్వేతయావరి' నదిని ప్రవహింప చేయండి.
20. వాయువా! రథమును లాగు రెండు అశ్వములను జోడించుము. పోషించగల అవినులను యుద్ధమున తెమ్ము తదుపరి మేము సమర్పించు సోమమును పానము చేయుము మూడు సవనములకు విచ్చేయుము.
21. యజ్ఞపతియగు త్వషకు అల్లుడవు, విచిత్రకర్మలుగల వాయువా ! నీ పాలన్ పోషణ మాకు లభించవలెను.
22. త్వష్ణకు జామాత, సర్వసమర్థుడగు వాయువు కొరకు మేము సోమము అభిహవింతుము. ధనము యాచింతుము. అతని ధనదనమున మేము ధనవంతులమగుదుము.
23. వాయువా ! ద్యులోకమునకు శుభములు చేర్చుము. నీవు మహానుభావుడవు మంచి కొక్కలుగల గుఱ్ఱములను రథమునకు పూన్చుము. రథమును నడిపించుము.
24. వాయువా ! నీవు అత్యంత సుందరరూపుడవు నీ సమస్త అవయవములందు మహిమలు ఉన్నవి సోమాభిషన శిలలను పోలిన యజ్ఞమునకు నిన్ను ఆహ్వానించుచున్నాము.
25. వాయుదేవా ! నీవు దేవతలందు ముఖ్యుడవు మనసా ప్రసన్నుడవగుము. మాకు అన్నము, నీరు, కర్మము ప్రదానము చేయుము.
ఇరువది ఏడవ సూక్తము
ఋషి - వైవస్వత మనువు, దేవత - విశ్వదేవతలు, ఛందస్సు - బృహతి
1. ఇది స్తోత్రాత్మక యజ్ఞము సోమాభిషవమునకు ప్రస్తరములు మరియు కుశల అగ్రభాగమున అగ్నిస్థాపించ బడినాడు మరుద్గణములు, బ్రాహ్మణస్వతియు ఇతరదేవతలను స్తుతింతుము. రక్షణలకొరకు ప్రార్థింతుము.
2. అగ్నీ! మా యజ్ఞమున పశువు వద్దకు చేరుదువు భూమి, వనస్పతుల వద్దకు చేరుదువు. ఉదయములందును రాత్రులందును సోమాభిషన ప్రస్తరము వద్దకు చేరుదువు సర్వజ్ఞాతలగు విశ్వదేవతలారా! మా కర్మములకు రక్షణ కల్పించండి.
3. ఇది ప్రాచీన యజ్ఞము. ఇందు అగ్ని ఉత్తమగతితో దేవతల వద్దకు చేరవలెను. ఆదిత్యులు, ధృతవ్రత వరుణుడు, తేజస్వులగు మరుత్తుల వద్దకు చేరవలెను.
4. బహుధన శాలురు, శత్రునాశకులగు వివిధ దేవతలు మనువును వర్థిల్ల చేయవలెను సర్వజ్ఞాతలగు దేవతలారా ! మమ్ము బాధలు లేకుండునట్లు పాలించండి దుఃఖములు ఎరుగని గృహము ప్రసాదించండి.
5. విశ్వదేవతలారా ! మాస్తోత్రములందు సమానమనస్కులు కండి పరస్పరము కలిసి ఉండండి. ఈ యజ్ఞదినము వచనము, ఋక్కులతో సాగుచున్నది. ఇక్కడికి విచ్చేయండి మరుత్తులారా! మహత్తుగల అదితిదేవీ! మాగృహమునకు విచ్చేయండి.
6. మరుత్తులారా ! మీ ప్రియ అశ్వయుక్తులై యజ్ఞమునకు విచ్చేయండి మిత్రా ! హవ్యము కొరకు రమ్ము ఇంద్ర, వరుణులు, యుద్ధమందు శత్రువధకు తొందరపడు ఆదిత్య గణములు మా కుశల మీద ఆసీనులు కావలెను.
7. వరుణా! మేము మను సములము - మను వంశీయులము. సోమాభిషవము చేసినాము. అగ్నికి సమిధలందించినాము హవిని స్థాపించినాము కుశలు విరిచినాము మిమ్ము పిలుచుచున్నాము.
8.మరుద్గణములు, విష్ణువు, అశ్వినులు, పూష నా స్తుతులు వినవలెను. యజ్ఞమునకు విచ్చేయవలెను. దేవతలతో ప్రథముడు ఇంద్రుడు రావలెను ఇంద్రాభిలాషులగు స్తోతలు ఇంద్రుని వృత్రహంత అందురు.
9. దేవతలారా ! మీరు ద్రోహము ఎరుగనివారు మాకు బాధలు కలుగని గృహమును ప్రసాదించండి నివాస దాతలగు దేవతలారా ! దూరదేశమునుండి వచ్చినవాడుగాని దగ్గరలో ఉన్నవాడుగాని వరించదిగిన ఇంటిని బాధించడు.
10. శత్రుహంత దేవతలారా! మీకు స్వజాతి భావము, బంధుభావము ఉన్నవి తొలి అభ్యుదయము, నవీన ధనమును గురించి మాకు త్వరగా చెప్పండి.
11.సర్వధనవంతులగు దేవతలారా! నేను మిమ్ము అన్నము అడుగుచున్నాను. మీనుండి రమణీయ ధనము పొందుటకుగాను ఎవ్వడు ఎరుగని స్తుతులతో స్తుతింతును.
12. చక్కని స్తుతి మరుత్తులారా ! మీలో ఊర్ధ్వగామము సర్వసేవనీయుడు సవిత అతడు పొడిచినప్పుడు మనుష్యులు, పశువులు, పక్షులు తమతమ పనులలో లగ్నమగుదురు.
13. మేము మిమ్ము వెలుగుల స్తుతుల స్తుతులతో స్తుతింతుము. మీలో దివ్యదేవతలను మా క్రమ రక్షణకు ఆహ్వానించుచున్నాము. కోరికలు తీర్చమని దీప్తిమంతులగు దేవతను పిలుచుచున్నాము. అన్నలాభమునకు దివ్యదేవతను పిలుచుచున్నాము.
14. సమాన మనస్కులగు విశ్వదేవతలారా ! 'మనువు'నకు ధనాదులు ఇచ్చుటకు అందరు కూడ విచ్చేయండి. నేడు, రేపు అన్నిరోజులలో నాకు, నాపుత్రులకు వరించదగిన ధనమును ప్రసాదించండి.
15. బాధింపరాని దేవతలారా ! స్తోత్ర ఆధారమగు యజ్ఞమున మిమ్ము ఎంతో స్తుతింతును. మిత్రా వరుణులారా ! మీకు సమర్పించు హవి - శత్రువును బాధించుటకు ఆటంకముకాదు.
16. దేవతలారా! తమకు వరదేయ ధనము కలుగుటకు మీకు హవ్యము సమర్పించువాని అన్నము వర్థిల్లును గృహము వర్ధిల్లును. యజ్ఞము వలన సంతానము వర్దిల్లును అతనిని ఎవరును బాధించజాలరు అతడు సమృద్ధుడగును.
17. అతనికి యుద్ధములేకనే ధనము లభించును అతడు నడకలుగల గుఱ్ఱములతో దారులు దాటును. మిత్ర వరుణులు, ఆర్య కలసి అతనిని సమాన దానయుక్తుని చేయుదురు రక్షింతురు.
18. దేవతలారా! అగమ్య, దరిమ మార్గములను సుగమములు చేయండి. ఈ ఆయుధము దేనిని హింసించకుండనే నశించవలెను.
19. బలప్రియ దేవతలారా! సూర్యోదయమైనంత నేడు శుభావహమగు గృహమున ప్రవేశించండి సాయంత్రము ప్రవేశించండి మధ్యాహ్నము మనువు కొరకు ధనము గ్రహించండి.





