Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    జీవితంలో ఒక స్థానం లభిస్తుంది. ఎందుకు కాలదన్నాలి ? స్వనాశం ఎందుకు చేసుకోవాలి? మోతీచంద్ ను పెళ్లాడితే తన తండ్రి వాత్సల్య రుణం కూడా తీర్చుకోవచ్చు. అంతంలో తనకు స్వేచ్చ సహితం లభిస్తుంది.
    తన ముందున్నది బతుకు - చావు కాదు. అజ్ఞాత భవిష్యత్తును ఎదుర్కోవడానికి ఆమెకు ఒక కొత్త శక్తీ జ్ఞానమూ వచ్చాయి.
    నాటి రాత్రి తన నిర్ణయం తండ్రికి తెలియజేసింది. తండ్రి దిగ్బ్రమ చెందాడు.
    "ఈ ఆలోచనను ఎలా దరి చేరనిచ్చావ్? వాడు ..........ఆ ముసలి ..........వెధవ! వాడు విడిచివేసిన........."
    "ఇలాంటి అందకత్తెలు పదివేల్లో ఒక్కరు..... గుడ్లగూబ కళ్ళు ఆమెను తినేస్తున్నాయి...... తేలవేసిన కళ్ళు గల మూడు పంది పిల్లల మీద తలక్రిందులుగా పడి ఉన్న ఎర్రని ఏనుగు ........."
    "అయితే ఎప్పటికీ నేను ఈ దేవాలయాన్ని అంటి పెట్టుకొని ఉండాలంటావు. అంతేకదూ?"
    "చంద్రలేఖా, నా అభిప్రాయం నీకు తెలియదా? మళ్ళీ చెప్పాలా?"
    "ఏమిటి? బాపడ్ని చేసుకొమ్మనేనా? సగౌరవంగానూ, సమానంగానూ జీవించాల్సిన వ్యక్తితో జీవితాంతం ఈ నాటకం ఆడలేను" ఆమె ధ్వనిలో ఉద్రేకం ఉంది.
    ఆ మాటలు లేఖ మనసును కాలూకు అద్దంలా చూపాయి. ఆమె మోతీచంద్ ను పెళ్ళి చేసుకుంటుంది. కాని అందులో గౌరవానికి సంబంధం ఏమీ లేదు. ఆమె బ్రహ్మాన్ని -మోతీచంద్ ను - తేలిగ్గా మోసగించగలదు.
    అతని అభిప్రాయాలనే అప్పగిస్తున్నట్లుగా మాట్లాడింది.
    "నీవు ఇందుకు అంగీకరించాలి. చివరకు నేను నీతో పాటు పోరాటంలోకి దిగినట్లు కూడా అవుతుంది. ఆ గర్వబోతుకు కులం లేని పెళ్ళాం దొరుకుతుంది! కులం లేని దాని చేతి వంట తింటాడు. తరువాత .......... ' ఆమె ముఖంలో ఏదో కరకు పోరాటం కనిపించింది. "తరువాత ఈ గౌరవాన్ని పూర్తీ చేయడానికి ఒక బిడ్డ."
    "చంద్రలేఖా!" అరచాడు.
    "ఇదే కదూ నువ్వు నా నుండి ఆశించింది? అందువల్ల కలిగే లాభాలు కనిపించడం లేదా? నాకు సిరిగల మగడు దొరుకుతాడు, నువ్వూ నీ గుడీ క్షేమంగా ఉంటారు. జిత్ - జిత్ ఒక బ్రాహ్మణ కుర్రాడై మన దగ్గరే ఉండిపోతాడు ."
    అభిజిత్ బ్రాహ్మణ కుర్రాడా? తన తండ్రి , తాతల్నుంచి వచ్చిన కమ్మరితనానికి వారసుడు కాడా? అతడు నిప్పుతోనూ ఇనుముతోనూ డొక్క నింపుకోడా?
    "ఎప్పుడో ఒకప్పుడు నా మగడు నా నోటనే వాస్తవం వింటాడు. మందిపోతాడు. అంతే ఏం చేయగలడు? లోకానికి చెప్పుకుంటాడా?"
    కాలూ ఏదో గునిగాడు. కాని లేఖ చెప్పుకొని పోయింది.
    "ఇదేమీ అసామాన్యం కాదు. మామూలే. గుండె దిటవు చేసుకో. అసంతోషాన్ని దగ్గరికి రానియ్యకు. హాయిగా ఉండు. పెళ్ళి ప్రయత్నాలు చేయి. యజ్ఞం ఇంకొక్క వారం మాత్రమె ఉంది. ఈ దశలో దాన్ని మానడం అసాధ్యం. అందరికీ ఆహ్వానాలు కూడా పంపబదినాయి. అనుకున్న ప్రకారం యజ్ఞ కుండంలో అగ్ని రాగలాల్సిందే. లాంచనంగా జగన్మాత ఆవిష్కరణ కూడా జరగనీ. ఇంకో రంగంలో పాత్ర ధరించే ముందు పూర్వ రంగాన్ని చూసి సంతొషించనైనా సంతోషిస్తాను."
    'చంద్రలేఖా!.........."
    కోపతరంగం అతని దుఃఖాన్ని పారద్రోలింది. ముఖం మున్నెన్నడూ చూడనంత భయకరంగా తయారైంది. ముకుపుటాలు అదిరాయి. కళ్ళలో మంటలు మండాయి. అది చూచి ఆమె అదిరిపోయింది. కాని ఆ అదురు అట్టే కాలం ఉండలేదు. కొద్దిసేపట్లోనే పక్కున నవ్వింది.
    "బాబాకు నిద్రవస్తుంది. పడుకో. అన్నీ సవ్యంగానే జరుగుతాయి." స్వరం తగ్గింది. గొంతు బొంగురు బోయింది. ఆమె వెళ్ళిపోతూ "అన్నీ సవ్యంగానే జరుగుతాయి." అని అంటూ వెళ్ళిపోయింది.

                                   27


    యజ్ఞం సూర్యోదయంతో ప్రారంభం అవుతుంది. ఏర్పాట్లన్నీ ఒకరోజు ముందుగానే జరిగిపోయాయి. దొరకడం కరువైన వేయి వందల కొద్ది బిందెలతో వచ్చింది. అదంతా జాగ్రత్త చేయబడింది. పుల్లలు కుప్పలు వేయబడినాయి. పూర్ణాహుతి స్వచ్చమైన నీతితో జరుగుతుంది. కమ్మని నేతి వాసనలతో యజ్ఞ కుండం లోంచి పొగలు లేస్తూ ఉండగా  పూజారి యజ్ఞం ప్రారంభించాడు. ఎనిమిది మంది పురోహితులు యజ్ఞ గుండం చుట్టూ కూర్చొని మంత్రాలు చదువుతూ నిప్పులో నెయ్యీ ఇతర పదార్ధాలూ వేస్తూ ఉంటారు.
    జగన్మాత పసుపు బట్టలు ధరిస్తుంది. ఆమె ముంజేతులకు విలువైన శంఖపు గాజులు తోడగబడ్తాయి. ఏడు పేటల స్వచ్చమైన రత్నాహారం ఆమె గళ సీమన మెరిసిపోతుంది. అగ్ని కుండం పక్కనే ఒక చిన్న తివాసీ మీద తల్లి అసీనురాలు అవుతుంది. అగ్నికుండం నుంచి ఏలువడే అగ్ని జ్వాలలు ఆమె ముఖాన్ని అసూరునిలా ఎర్రగా చేస్తాయి. ఆజ్య దూమాలు ఆమె ఊపిరిలో భాగం అయి , శరీరంలో ప్రవేశించి రక్తంలో కలిసిపోతాయి. అవిచ్చిన్నంగా యజ్ఞం ఉదయ సంధ్యా నుంచి సాయంసంధ్యా దాకా కొనసాగుతుంది.
    లాంచనంగా దేవాలయన్నింటికీ ఆహ్వానాలూ పంపబడినాయి. వేద వేదంగ పారంగతులైన పండితులు ప్రత్యేకంగా ఆహ్వానించబడినారు. బ్రహ్మలంతా యజ్ఞాన్ని చూడ్డానికి రావచ్చునని ప్రకటించబడింది. ఆ నగరపు పార లౌకిక జీవితంలో అది ప్రభావాత్మకమైన దినం. మోతీచంద్ తెచ్చి పెట్టుకున్న నిగర్వంతో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడు.
    ఎండకూ, వానకూ ఎండి తడిసి ఎర్రవారిన కన్వాసుతో పందిళ్ళు చేయబడ్డాయి. పద్మమండప పుటంచు దాకా, సెంట్రల్ జెలులో వేసిన జంబుఖానాలు పరచబడ్డాయి. గౌరవనీయులైన అతిధుల కోసం మండపం కేటాయించబడింది. దాని మీద నీలిరంగు కాశ్మీరపు తివాసీలు పరచ బడ్డాయి. చేతులూ, వీపులూ అనుకోవడానికి పెద్ద పెద్ద పట్టు దిండ్లు ఏర్పాటు చేయబడినాయి. అలాంటి పవిత్ర ఉత్సవాల్లో పాశ్చాత్యపద్దతి ఆసనాలు పరిత్యాజ్యాలు, ఒక్క విషయములో తప్ప అన్ని విషయాల్లోనూ, సనాతనాదారాలు అవలంభించాల్సిందే. అ ఒక విషయం పాశ్చాత్యఫక్కీ ఉపన్యాసాలు, అవి మోతీచంద్ కు రాజకీయ జీవితంలో చాలా లాభలిచ్చాయి. శాసనమండలిలో అతనికి ఒక స్థానం కూడా సాధించి పెట్టాయి. అతడు మంచి వక్తే అయినా ఈ సమయంలో మొట్టమొదటి ఉపన్యాసం ఇచ్చే అధికారం కాలూకే ఇవ్వదల్చుకున్నాడు. మోతీచంద్ అంత్యోపన్యాసం ఇస్తాడు. అతని ప్రతిభాయుతమైన ఉపన్యాసం వినడానికి జనం తహతహలాడుతుంటారు. అసలు ఆనాటి ప్రధాన పాత్ర మోతీచంద్ దే. మోతీచంద్ వంద ఊడలు గల మహాపటం కాగా,  మంగల్ అధికారి పటచ్చాయ మాత్రమే. మోతీచంద్ సారధి. అతనికి చేతి చబుకు మంగల్ అధికారి అయిన అధికారికి విలువ ఉంది. మంగల్ మోతువాడే. అయినా కొన్ని విషయాల్లో అతడు అతి చతురుడు. మంగల్ మోతీచంద్ మామ అయ్యే రోజులు అట్టే దూరం లేవు.
    తాను ఆడుతున్న నాటకం చూస్తె మోతీచంద్ కి సిగ్గు అవుతుంది. లేఖను జగన్మాతగా చేస్తామన్నప్పుడు ధర్మకర్తలకు వ్యతిరేకంగా తాను పల్లెత్తూ మాట కూడా మాట్లాడలేదు. ఈ యజ్ఞాన్ని విజయవంతం చేయడానికి తాను హృదయపూర్వకంగా కోరుతున్నాడు. ధర్మకర్తలు చకితులయ్యే రోజు రాబోతుంది. వారు ఇందుకు అంగీకరిస్తారా? అంగీకరించరు. అయితే మాత్రం? తనకు జూదంలో స్వంత పావులు కన్పించడం బాగా తెలుసు.
    తన గుండె లేఖ కోసం పరితపిస్తుంది. తాను ఆమెను పెళ్ళాడ్టాడు.ఆమె కూడా ఇందుకు అంగీకరించిందని తెలిసింది. తన చెవుల్లేని చోటంటూ ఉంటె కదా విషయాలు తెలియకపోవడానికి! మట్టి బుర్ర మంగల్ ముందు బుద్ది తక్కువగా మాట్లాడాడు. కాని అనివార్య పరిస్తితులు అతన్ని లొంగదీశాయి. ఈ విషయంలో ధర్మకర్తలూ, మంగల్ ఒకటి అవుతారని అనుకోవడం అట్టే సమంజసం ఏమీ కాదు. మోతీచంద్ జగన్మాతను ఉన్నదున్నట్లుగా పెళ్ళి చేసుకుంటే అలా కావచ్చు. కాని తాను దైవత్వాన్ని ఊడకొట్టి జగన్మాతను ఆమె నుండి ఊడగొట్టి మరీ పెళ్ళి చేసుకుంటాడు.
    ఆమె చక్కని నిర్ణయం చేసుకుంది. అంత చిన్న వయసులో అచ్చపు ఆడదానిలా ప్రవర్తించడం ఆశ్చర్యం! ఆమెకు తాను అత్యంత నైతిక నియమం గలవాడి భార్య కాబోతుందని తెలుస్తే ?
    రాధ భవిష్యత్తును గురించి ఇంకా నిర్ణయం కాలేదు. ఈ సమస్య పరిష్కరించుకావాల్సింది తన కొత్త పెళ్ళామేనని ఇప్పటికీ తన అభిప్రాయం. తన చాకచక్యంతో మగవాణ్ణి ముడివేసుకోవడం ఆమె పని కాదూ మరి?




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.