Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ||
ఇరువది మూడవ అధ్యాయము
1. హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్యజాతః పతిరేక ఆసీత్ |
సదాధార పృథివీం ద్యాముతేమాం కస్మైదేవాయ హవిషా విధేమ||
సృష్టికి ఆదికాలమున ఒక్క హిరణ్యగర్భుడు మాత్రము ఉండెను. అతడే సకల భూతజాతములకు అధిపతి యైనాడు. అతడే ఈ ద్యావాపృథ్వులను భరించినాడు. అట్టి ప్రజాపతికి హవిస్సులు సమర్పింతుము.
2. (మహిమ గ్రహమును అందుకొనవలెను)
గ్రహమా! నీవు ఉపయామ పాత్రద్వారా గ్రహించబడినావు. ప్రజాపతికి ప్రియమవగు నిన్ను అందుకొనుచున్నాను.
(గ్రహమును వేదిపై ఉంచవలెను) ఇది నీ స్థానము.
నీ మహిమ దినములందు. సంవత్సరములందు. వాయువునందు. అంతరిక్షమునందు. ద్యులోకమందు. సూర్యునియందున్నది. అట్టి నీ మహిమకు, ప్రజాపతికి, అన్యదేవతలకు స్వాహా.
3. ఏ ప్రజాపతి తన మహిమ వలన సమస్త జగత్తునకు స్వామి అయినాడో - ఎవడు సమస్త ద్విపాద చతుష్పాద సంపదకు స్వామియో అట్టి ప్రజాపతికి హవిస్సులు అర్పింతుము.
4. గ్రహమా! నీవు ఉపయామ పాత్రద్వారా గ్రహించబడినావు. నీవు ప్రజాపతికి ప్రియమవు. అట్టి నిను అందుకొనుచున్నాను. (గ్రహమున వేదిపై ఉంచవలెను_ ఇది నీ స్థానము.
గ్రహమా! చంద్రుడు నీ మహిమయే. నీ మహిమ రాత్రులందును - సంవత్సరములందును నక్షత్రచంద్రులందును - ఉత్పన్నమైనది. అట్టి నీ మహిమకు - ప్రజాపతికి - అన్యదేవతలకు స్వాహా.
5. సూర్యుడు ఈ మహాజగత్తుమీద రోషరహితుడై భ్రమించుచున్నాడు. ఋత్విజులు సూర్యుని నుతించుచున్నారు. స్వకార్యరతుని చేయుచున్నారు. ఆ సూర్యుని వలననే ద్యులోకము గ్రహనక్షత్రాదులు వెలుగొందుచున్నవి.
6. సూర్యుని అశ్వములు కమనీయ రథమున పూన్చబడునవి. శోణవర్ణలు. శత్రుదమనలు. సూర్యుని వహించుసమర్థలు. అట్టి వానిని ఋత్విజులు తమ స్తుతులచే రాతుమున పూన్చెదరు.
7. (అధ్వర్యు యజమాని రథమున కూర్చుందురు. రథమ యజ్ఞభూమిదాటి నీటిలో నిలుచును. యజమాని అధ్వర్యుతో ఇట్లనును)
అధ్వర్యులారా! ఈ అశ్వములు ఇంద్రుని దేహము. ఇవి ఎంతో దూరము నీటి వరకు వచ్చినవి. వీనిని మరల అదే మార్గమున మరలించండి.
8. (రథము తిరిగి వచ్చును. గుర్రమును విప్పుదురు. అప్పుడు యాజమాన పత్ని అశ్వపు తల, మధ్యభాగము, పృష్ట భాగమునకు ఆజ్యము అంటించును)
అశ్వమా! వసుగణములు గాయత్రీఛందమున నీ తలకు నేయి అటుందురు గాత.
అశ్వమా! రుద్రగణములు త్రిష్టుప్ చంధమున నీ మధ్యభాగామునకు నేయి అంటుదురు గాత.
అశ్వమా! ఆదిత్యగణములు జగతీ ఛందమున నీ వెనుక భాగమునకు నేయి అంటుదురు గాథ.
అశ్వమా! భూర్భువస్వః పేలాలు, పిండి, యవలు, దధి మున్నగునవి తినుము.
ప్రజపతీ! దేవతలారా! భుక్తశేషమును ఆరగించండి.
9. (బ్రహ్మహోతల మధ్య సంభాషణ)
బ్రహ్మఅడుగుచున్నాడు:-
హోతా! వంటరిగా పరిభ్రమించువాడెవడు? మరల పుట్టునట్టి వాడెవడు? చలికి మందు ఏది? మహా ఆవపనమేది?
10. హోత చెప్పుచున్నాడు:-
బ్రహ్మా! వంటరిగా ఆకాశమున భ్రమించువాడు సూర్యుడు. మరల పుట్టునట్టి వాడు చంద్రుడు. చలికి మందు నిప్పు అగును. మహా ఆవపనము చేయునది భూమి.
11. బ్రహ్మ అడుగుచున్నాడు:-
హోతా! పూర్వచిత్తి ఏది? బృహత్ పక్షి ఏది? పిలిప్పిలా ఏమి? పిశంగిల ఏమి?
12. హోత చెప్పుచున్నాడు:-
బ్రహ్మా! ద్యులోకము, వర్షము, పూర్వచిత్తి యగును. అశ్వము బృహత్ పక్షియగును పృథివి పిలిప్పిల యగును. రాత్రి పిశంగిల యగును.
13. అశ్వమా! వాయువు నిన్ను పచనము నుండి రక్షించును గాత. ధూమగ్రీవాగ్ని నిన్ను మేకల నుండి రక్షించును గాత. మర్రి సోమపాత్రలతోను, బూరుగు వృక్షవృద్ధితోను, నిన్ను రక్షింతురు గాథ. రథమును లాగునది నాలుగు కాళ్లతో సాగును. చంద్రుడు మమ్ము రక్షించును గాథ నమ్కోగ్నయే - అగ్నికి నమస్సు.
14. రథము కళ్లెమున శోభిల్లును. కళ్లెము గుర్రమును శోభిల్లును. జలములందు పుట్టిన అశ్వము జలములందు శోభిల్లును. బ్రహ్మ సోమమున శోభిల్లి పురోగమించును.
15. అశ్వమేధాశ్వమా! నీవు స్వచ్ఛంముగా శరీరములను ఏర్పరచుకొనుము. స్వచ్ఛందముగా దేవతలను యజింపుము. అభీష్ట పదార్థములను సేవించుము. నీ మహిమ ఇతరులలో కనిపించదు.
16. అశ్వమా! మేము నిన్ను వధించుట నీకు మరణము కాదు - నష్టముకాదు. ఇక నీవు దేవయాన మార్గమున దేవతలను చేరుకుందువు. అచట పుణ్యవంతులు ఉందురు. వారు చేరిన చోట సవితా దేవత నిన్ను చేర్చుకొనును.
17. పూర్వము అగ్నియే పశువైయుండెను. దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు. అగ్ని భూలోకమును జయించినాడు. అగ్నియే భూమికి అధిపతియైనాడు.
అశ్వమా! యజ్ఞమున వధించబడిన నీదే ఈ పృథ్వి అగును. నీవే ఈ పృథ్విని జయించగలవు. పోక్షణీ జలమును త్రాగుము. (ప్రోక్షణీ జలమును గుర్రపు నోటికి అందించవలెను)
వాయువు పశువై ఉండెను. దేవతలు వాయు పశువుతోనే యజ్ఞము చేసినారు. వాయువు అంతరిక్షమును జయించినాడు. అగ్నియే భూమికి అధిపతియైనాడు.
అశ్వమా! యజ్ఞమున వధించబడిన నీదే ఈ పృథ్వి అగును. నీవే ఈ పృథ్విని జయించగలవు. పోక్షణీ జలమును త్రాగుము. (ప్రోక్షణీ జలమును గుర్రపు నోటికి అందించవలెను)
వాయువు పశువై ఉండెను. దేవతలు వాయు పశువుతోనే యజ్ఞము చేసినారు. వాయువు అంతరిక్షమును జయించినాడు. వాయువే అంతరిక్షమునకు అధిపతియైనాడు.
అశ్వమా! యజ్ఞమున వధించబడిన నీదే అంతరిక్షమగును. నీవే ఈ అంతరిక్షమును జయించగలవు. ఈ ప్రోక్షణీ జలములను త్రాగుము.
సూర్యుడు పశువై యుండెను. దేవతలు సూర్య పశువుతోనే యజ్ఞము చేసినారు. సూర్యుడు ద్యులోకమును జయించినాడు. సూర్యుడే అంతరిక్షమునకు అధిపతి అయినాడు.
అశ్వమా! యజ్ఞమున వధించబడిన నీదే ద్యులోకమగును. నీవే ద్యులోకమును జయించగలవు. ప్రోక్షణీజలము త్రాగుము.
18. ప్రాణాయ స్వాహా. అపానాయ స్వాహా. వ్యానాయస్వాహా. (పత్నులు పరస్పరము అనుకొనుచున్నారు.) అంబ, అంబిక, అంబాలికలారా! ఏ పురుషుడును మమ్ము త్వరగా అశ్వము వద్దకు చేర్చకున్నాడు. నేను ఆలస్యమైనందున ఈ దుష్ట అశ్వము కాంపీల దేశపు సుభద్రికయను దానిని పెట్టుకొని పడుకున్నది.
19. (పత్నులు అశ్వమును చేరి తొమ్మిది ప్రదక్షిణలు చేయుదురు)
గణములందు శ్రేష్ఠుడవగు గణపతివగు నిన్ను యాచించుచున్నాము. ప్రియులందు ప్రియపతివగు నిన్ను మేము యచించుచున్నాము. సుఖనిధులందు శ్రేష్ఠసుఖముల అధిపతివగు నిన్ను యాచించుచున్నాము.
వసురూప అశ్వమా! నీవే మాపతివి. (అశ్వమహిషి అశ్వము వద్ద పడుకొనును.) గర్భమును కలిగించు ణీ తేజమును గుంజి నా యోనియందుంచుకొనుచున్నాను. నీవు గర్భము కలిగించు నీతేజమును నాయోనియందుంచుము.
20. అశ్వమా! రమ్ము మేము, నీవు మన నాలుగు నాలుగు కాళ్లను చూచుదము.
అధ్వర్యు అనుచున్నాడు: అశ్వమహిషీ! ఇది స్వర్గతుల్యమగు యజ్ఞ భూమి. దుప్పటి కప్పుకొనుము.
(అశ్వశిశ్న ముపస్థే కురుతే, అశ్వశిశ్నమును యోని యందుంచుకొనును.)
నేను రేతము ధరించు దానను. నాలో రేతమును చేర్చుము.
21. యజమాని అశ్వముతో అనుచున్నాడు:-
సేచక అశ్వమా! లేపిన కాళ్లతో ఈ అశ్వమహిషి యోని యందు ణీ లింగమును ఉంచి వెనుకకు ముందుకు కదలించుము. అదియే స్త్రీలను జీవన భోజనములగును. యః స్త్రీణాం జీవభోజనః.
22. (అధ్వర్యు అంగుళ్యా యోని ప్రదర్శన్నాహ అధ్వర్యు కన్య యోనిని వ్రేలుచే చూపి అనుచున్నాడు)
ఈ యోని 'ఆహలగ్' అని శబ్దము చేయుచు గెంతుపక్షియా? భాగమును శిశ్నము కొట్టినపుడు యోని అమ్గామును మింగినట్లనిపించును.
23. (కన్య అధ్వర్యునకు ఇచ్చిన సమాధానము:-)
నీకు ముందు 'ఆహలగ్' అనుచు పాకుచున్న పక్షి ఏది? ఇది నీనోటి వలె ఏదో చెప్పుచున్నట్లున్నది. అధ్వర్యులారా! ఇక మాట్లాడకండి.
24. (బ్రహ్మ మహిషితో అనుచున్నాడు:-)
మహిషీ! నీ తల్లితండ్రులు మంచము మీద ఉందురు. అప్పుడు నీ తండ్రి స్నేహము చేయుదును, అని పిడికిలితో శిశ్నమును పట్టి భగములోనికి త్రోయును.
25. (మహిషి అనుచున్నది:-)
బ్రహ్మా! నీతల్లితండ్రులు కూడా మంచము మీద రతి క్రీడ......నీ నోరు మరేదో చెప్పనున్నది. అధిక ప్రసంగము మానుము. "మాత్వం వదో బహు"
26. (ఉద్గాత వావాతను గూర్చి)
బరువులు మోసి అలసిన వానిని లేపినట్లు - ఈ వావాతను పైకి లేపుము. అందువలన యోని మధ్యభాగము, చలిగాలికి ధాన్యము తూర్పారబట్టు రైతువలె వికసించును.
27. (వావాత ఉద్గాతను గూర్చి)
బరువులు మోసి అలసిన వానిని లేపినిలిపినట్లు, ఈ ఉద్గాతను లేపి నిలబెట్టండి. ఇతని మధ్య లింగాభాగము చలిగాలికి ధాన్యము తూర్పారాబట్టురైతు చేతివలె వడకుచున్నది.
("వావాతాదేహ మధ్యం ఇతిమహీధరః" వావాతమన దేహమధ్యమని మహీధరవ్యాఖ్య)
28. (హోత 'పరివృక్త'ను గూర్చి)
చిన్నయోని గలదాని భగమున చిన్న లింగము దూరినపుడు అండకోశము దానియోనిపై నీటిలోనిగోవు పాదము వద్ద చేపలవలె కదలాడుచుండును.
29. (పరివృక్త హోతను గూర్చి)
దేవతలు శ్లేష్మము స్రవించు లింగమును బలముగా యోని యందు ప్రవేశపెట్టినపుడు స్త్రీసర్వాంగములందు- ఇదికన్ను చూచిన సత్యము వంటిది- ఉరునారి యనిపించుకొనును.
30.(క్షత్తాపాలాగలీమాహ)
రైతు పొలమున జింకదూరి పొలము మేయునప్పుడు రైతు, పశువు పంటతిని బలిసినది అనుకొనడు. పంటపోయినందుకు దుఃఖించును. అట్లే శూద్ర వనిత ధనికుని ఉంపుడు కత్తె అయినపుడు, దాని భర్త ధనము వచ్చునని సంతసించడు. తన భార్య వ్యభిచారిణి అయినందుకు దుఃఖించును.
31. (పాలాగలీ ప్రత్యాహ)
హరిణము పొలము మేసినపుడు పశువు బలిసినదని రైతు సంతసించడు. అట్లే శూద్రుడు ధనిక స్త్రీకి జారుడైనపుడు ధనికుడు సంతసించడు. దుఃఖించును.
32. (అశ్వము వద్ద పడుకొనియున్న మహిషిని లేపవలెను)





