Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే
ఆంధ్ర వచన ఋగ్వేద సహింత
ఆరవ అష్టకము
ఎనిమిదవ మండలము
మొదటి అధ్యాము రెండవ అనువాకము
పన్నెండవ సూక్తము
ఋషి - కణ్వగోత్రజుడు పర్వతు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు ఉష్ణిక్.
ఓం యింద్ర సోమపాత మోమదః శనిష్ఠ చేతతి
యేనాహంసిన్యశీ త్రిణంతమీమహే
1. ఇంద్రా నీవు మరింత సోమపానము చేయువాడవు. బలవంతులలో బలవంతుడవు. సోమపానమున నీకు మత్తు కలుగును. ప్రసన్నుడవగుదువు. నీ కార్యములను చక్కగా తెలిసికొందువు. సోమపానమున కలిగన మదమున రాక్షసులను సంహరింతువు. నీవు అట్టి మదయుక్తుడయినపుడే నిన్ను మేము యాచింతుము.
2. ఇంద్రా! నీవు సోమపానము చేసినావు. మదయుక్తుడవయినావు. అంగిరగోత్రజ అధ్రిగుని రక్షించినావు. చీకట్లను పారద్రోలువాడును. అందరికి నేతయగు సూర్యుని రక్షించినావు. సముద్రుని రక్షించినావు. నీవు అట్టి మదయుక్తుడవయినపుడే నిన్ను యాచింతుము.
3. ఇంద్రా !సోమపాన జనితమదమున నీవు వర్ణజలమును రథము వలె సంద్రమువైపు పంపుదువు. నీవు అట్టి మదయుక్తుడవైనపుడే మేము నిన్ను యగాధుల ప్రాప్తిని యాచింతుము.
4. ఇంద్రా! ఎస్తోత్రమున స్తుతజవై వెంటనే బలము పొంది మా కోరికలు తీర్చెదవో, అట్టి అభీష్టప్రదాయక, ఘృత సమాన పవిత్ర స్తోత్రమును గ్రహింపుము.
5. ఇంద్రా! నీవు స్తుతులతో ఆరాధనీయుడవు. ఈస్తుతిని స్వీకరింపుము. ఈ స్తోత్రము సంద్రము పగిది పరిఢవిల్లును. ఆ స్తోత్రమును గ్రహించిన నీవు మాకు సకల రక్షణలుగల శుభములను కలిగించుము.
6. ఇంద్రుడు సుదూర ప్రాంతమునుండి వచ్చినాడు మామైత్రి కోరినాడు. మాకు ధనమొసంగినాడు. ఇంద్రా! ద్యులోకమునుండి కలుగు వృష్ఠివలె మాధనమును పెంపొందించుము. మాకు శ్రేయస్సు కలిగింపుము.
7. ఇంద్రుడు అందరకు ప్రేరకుడగు ఆదిత్యునితో సమానుడు. అతడు వర్షదులు కలిగించిద్యావా పృథ్వులను వర్థిల్ల చేయును. అప్పుడు ఇంద్రుని పతాకలు, ఇంద్రుని చేతి వజ్రము మాకు శుభములనొసంగును.
8. ఇంద్రుడు ప్రవృద్ధుడు భక్తులను పాలించువాడు అతడు వేలమంది వృత్రాది అసురులను వధించినాడు. తదనంతరమే అతని బలము ఇంతింతై పెరిగినది.
9. దావానలము అరణ్యములను కాల్చును. ఇంద్రుడు సూర్యకిరణములతో బాధించు శత్రువును దహించును. శత్రుదమనుడగు ఇంద్రుడు ప్రవృద్ధుడగును.
10. ఇది నేను చేయుస్తుతి నీవద్దకు చేరును. ఈ స్తుతి వసంతాది ఋతువులలో యజ్ఞకర్మము వంటిది. అతిఅభినవము పూజనీయము. అత్యంత ప్రసన్నదాయకము.
11. స్తోత ఇంద్రుని యజ్ఞము చేయును. అతడు ఇంద్రుని పానమునకు అనుషంగిసోమమును దశాపవిత్రమున ఇంద్రుని గుణగణములను కీర్తించును.
12. స్తోత ఇంద్రునకు మిత్రుడు. గుణకీర్తనము చేయు అభిషకర్త వాక్యమువలె దాతయగు ఇంద్రుడు తనను ప్రవృద్ధుని చేసుకున్నాడు. ఈ స్తుతి ఇంద్రుని గుణ గణములను కీర్తించును.
13. విప్రుడు, స్తోత్రవాహకుడగు మానవుడు ఇంద్రుని ఉన్మత్తుని చేయును. ఆ ఇంద్రుని నోట ఘృతసమాన హవ్యమును అర్పింతును.
14. అదితి స్వయముగా శోభిల్లు ఇంద్రుని కొరకు అతని రక్షణకు ఇంద్రుని ప్రశంసించు సత్యసంబంధి స్తోత్రములను కల్పించినది.
15. ఋత్విక్కులు యజ్ఞవాహకులు. వారు తమ రక్షణ కొరకు ఇంద్రుని ప్రశంసింతురు స్తుతింతురు. వారి నామకములగు రెండు అశ్వములు వివిధకర్మలు గలవి ప్రస్తుతము యజ్ఞమందున్నవి. ఇంద్రా! అవి నిన్ను వహించును.
16. ఇంద్రా ! నీవు విష్ణు సహితుడవై 'ఆప్తత్రిత' రాజర్ధి యజ్ఞమునకుగాని మరుత్తులతో మరొక యజ్ఞమునకుగాని వెళ్లి సోమపానము చేయుచున్నవాడవైనను మాసోమము సేవింపుము, ప్రమత్తుడవగుము.
17. ఇంద్రా! నీవు సుదూర దేశమున ద్రవరూప సోమపుమమత్తులో మునిగి ఉండవచ్చును. అతినాను మేము సోమము సమర్పించినపుడు దానితో ఆనందించుము.
18. ఇంద్రా నీవు సత్యపాలకుడవు. నీవు సోమాభిషవ కర్త యజమానిని వర్ధిల్ల చేయువాడవు. నీవు ఏయజమాని ఉక్థమంత్రమున ప్రసన్నుడవు అగుదువో ఆయజమాని సోమమున ప్రసన్నుడవగుము.
19. ఋత్విక్కులారా! మీ రక్షణలకుగాను నేను ఇంద్రుని స్తుతించుచున్నాను. ఇంద్రుడు నాస్తుతులను గ్రహించవలెను వానిని యజ్ఞము కొరకు పరివ్యాప్తము చేయవలెను.
20. ఇంద్రుడు యజ్ఞయోగ్యుడు. అందరిని తలతన్నిన సోమపాయ. స్తోతులు హవ్యము, స్తుతి, సోమములతో ఇంద్రుని వర్థిల్ల చేయుదురు వ్యాపింప చేయుదురు.
21. ఇంద్రుని ధనము ప్రధానము ప్రచురము. ఇంద్రుని కీర్తి బహుళము. అతడు హవ్యదాత యజమానికొరకు సమస్త సంపదలను పరివ్యాప్తము చేయును.
22. వృత్రవధ ఇంద్రుని దేవతలు తమస్వామిగా అంగీకరించినారు. అతని బలము కొరకు స్తుతివచనములతో స్తుతించినారు.
23. ఇంద్రుడు మహామహిమాన్వితుడు. ఆహ్వానములు ఆలకించువాడు. స్తోతలు ఇంద్రుని స్తుతించియు, పూజించియు అతని బలవర్ధనమునకుగాను. తేప తేప స్తుతించుచుందురు.
24. ఇంద్రుడు వజ్రధరుడు. ద్యావాపృథ్వులు, అంతరిక్షము అతనిని తమనుండి వీడదీయజాలవు. అట్టి ఇంద్రుని జలమునుండి బలము గ్రహించుటకుగాను. లోకములు ప్రదీప్తములగును.
25. ఇంద్రా! యుద్ధములందు దేవతలు నిన్ను పురోగామిని చేసినారు. అదిగో అప్పుడే అందమయిన హర్యశ్యములు నిన్ను వహించినవి.
26. వజ్రధరింద్రా! నీటిని నిలిపిపెట్టిన వృత్రుని నీబలమున వధించినపుడు రమణీయ హర్యశ్వేములు నిన్ను తెచ్చినవి.
27. నీవు విష్ణువు తనమూడు అడుగులతో ముల్లోకములను కొలిచినపుడు కమనీయములను నీ హర్యశ్వములు నిన్ను తోడ్కొని వచ్చినవి.
28. ఇంద్రా! రమణీయములగు నీ హర్యశ్వములు నిత్యము ఎదిగినపుడు. అప్పుడే నీవు సకలలోకములను నియమించినావు.
29. ఇంద్రా! మరుద్రూపులగు నీప్రజ సకల భూతములను నియమించినపుడు అప్పుడే నీవు సకల లోకములను నియమించినావు.
30. ఇంద్రా! నిర్మల జ్యోతిర్మూర్తి సూర్యుని నీవు ద్యులోకమున స్థాపించినపుడు అప్పుడే నీవు సకల లోకములను నియమించినావు.
31. ఇంద్రా ! లోకమున జనులు తమ బంధువులను ఉచ్ఛస్థానములకు చేర్చెదరు. అట్లే విప్రస్తోతలు అనందకరము, అందముగు ఈస్తోత్రమును భక్తి పూర్వకముగా నీ వద్దకు పంపుదురు.
32. యజ్ఞమున ఇంద్రుని తేజస్సు ప్రీతినొందును అప్పుడు స్తోతలు ఒక చోట చేరి ఉత్తమరీతినిస్తుతింతురు. అట్టి తరి ఇంద్రా! నాభిస్వరూప యభిషవస్థాన వేదిన మాకు ధనములను ప్రసాదించుము.
33. ఇంద్రా! నేను తొలుతనే జ్ఞానార్జన హోతవలె యజ్ఞమున స్తుతించినాను. నాకు ఉత్తమ వీర్యము ఉత్తమగోవులు, ఉత్తమ అశ్వయుక్త ధనమును ప్రసాదించుము.
(ఆంధ్రవచన ఋగ్వేద సంహిత ఆరవ అష్టకము, ఎనిమిదవ మండలమున రెండవ అనువాకము సమాప్తము.)
మూడవ అనువాకము పదమూడవ సూక్తము
ఋషి - 'కాణ్వనారదుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - ఉప్తిక్
1. సోమము సమర్పించిన యజ్ఞకర్తను, స్తోత ఇంద్రుడు పవిత్రుని చేయును. ఇంద్రుడు తాను వర్థిల్లు బలముననే మహామహుడయనాడు.
2. తొలుత వర్థిల్లిన వ్యోమమును, స్వర్గమును ఇంద్రుడు యజమానుల కొరకని వర్థిల్ల చేసినాడు. ఇంద్రుడు కార్యములకు ప్రారంభకుడు సమాపకుడగును. ఇంద్రుడు అత్యంత యశోయుక్తి జలములకుగాను వృత్రుని గెలుచును.
3. ఇంద్రుడు బలవంతుడు. అతని బలమును మరింత పెంచుదును. యుద్ధములందు ఆహ్వనింతును. ఇంద్రా! నీవు ధనాభిలాషివయనపుడు వర్థిల్లుటకుగాను మాకు మిత్రుడవగుము.
4. ఇంద్రా! నీవు స్తుతులలో పూజింపదగిన వాడవు. సోమాభిషవ కర్త యజమాని అహుతి నిన్నుచేరును. మత్తుడవగుము. ఈ యజ్ఞమునకు విచ్చేయుము.
5. ఇంద్రా! సోమాభిషవకర్తలు నీ నుంచి ఆశించునట్టి ధనమును నీవు మాకు తప్పక అందించుము. విచిత్రము, స్వర్గప్రాపకధనమును సహితము తీసికొనిరమ్ము.
6. ఇంద్రా ! విశేష దర్శి స్తోత నీ కొరకు శత్రు పరాజయస్తుతి చేసినపుడు సకల వాక్యములు నిన్ను ప్రసన్నుని చేసినపుడు అప్పుడు కొమ్మను ఎక్కునట్లు సకల గుణములు నిన్ను ఆరోహించును.
7. ఇంద్రా ! పూర్వస్తుతులకు సమానములగు స్తుతులను కల్పింపుము. స్తోతల పిలుపు వినుము. నీవు సోమపానమున ముత్తుడనైనపుడే శుభకార్యములు చేయు యజమానికి ఫలము ప్రసాదింతువు.
8. ఇంద్రుని సత్యవాక్కు పల్లపునీరువలె పారును. స్వర్గపతి ఇంద్రుని ఈస్తోత్రము కీర్తించును.
9. వశవంతుడగు ఇంద్రుడు ఒక్కడే మానవ పాలకుడని చెప్పినారు. ఇంద్రా! నిన్ను స్తోత్రములతో వర్థిల్ల చేయువారితోను, తమ రక్షణలు కోరుకొను సోమాభిషహవ కర్తలతోను రమింపుము.
10. స్తోతా! విద్వాంసుడు, విఖ్యాతుడగు ఇంద్రుని స్తుతింపుము. శత్రువిజేతలు ఇంద్రుని అశ్వములు. అవి ఇంద్రుని నమస్కరించి హవి అర్పించువాని ఇంటికి చేర్చును.
11. ఇంద్రా! నీ బుద్ధి మహాఫలదాయకము నీవు స్నిద్ధుడవు. ఈ యజ్ఞముననే నీకు సుఖమున్నది కావున వడిగల గుఱ్ఱములతో ఈ జన్నమున కేతెంచుము.
12. ఇంద్రా ! నీవు ఉత్తముడవు. బలవంతుడవు. సాధురక్షకుడవు. మేము నిన్ను స్తుతించు చున్నాము. మాకు ధనములనిమ్ము. స్తోతలకు అవివాశ్యము, వ్యాపకమగు అన్నమును, యశమును ఇమ్ము.
13. ఇంద్రా! సూర్యోదయమైనపుడు నిన్ను నేను ఆహ్వానింతును. మధ్నాహ్నము ఆహ్వానింతును. నీవు ప్రసన్నుడవగుము. నీ అశ్వములు గతివేలములు. వానిపై ఇక్కడికి రమ్ము.
14. ఇంద్రా ! లెమ్ము త్వరగా సాగుము. సోమముగల చోటికి త్వర త్వరగా చేరుము. పాలు కలిపినా అభిషుత సోమమున ఆనందించుము. అనంతరము నాకు తెలిసినంత పూర్వము చేసిన యజ్ఞములను ఫలప్రదము చేయుము.
15. శుక్రా! వృత్రఘ్నా! ఇంద్రా! నీవు దూరదేశమున ఉన్నను, దగ్గరలో ఉన్నను. అంతరిక్షమున ఉన్నాను అన్నిచోట్ల నుంచి ఇచ్చటికి రమ్ము. సోమపానము చేయుము మమ్ము రక్షింపుము.
16. హవిష్మంతులగు మనుష్యులు ఇంద్రుని మాత్రమే తృప్తుని చేయుదురు. అతనికి ఆహుతులు అర్పింతురు. వర్థిల్ల చేయవలెను. అభిషుత సోమము ఇంద్రుని వర్థిల్ల చేయవలెను.
17. విప్రులు, రక్షణాభిలాషులు ఇంద్రుని మాత్రమే తృప్తుని చేయుదురు. అతనికి ఆహుతులు అర్పింతురు. వర్థిల్ల చేయుదురు. భూమి మీది సమస్త ప్రాణులు చెట్టు కొమ్మనువలె ఇంద్రుని పెంపొందింతురు.
18. త్రికద్రుక్, నామక యజ్ఞమున చైతన్య ప్రదాత ఇంద్రుని దేవతలు సమ్మానించినారు. మా స్తుతులు నిత్యము వర్థిల్లు అట్టి ఇంద్రుని వర్థిల్ల చేయవలెను.
19. ఇంద్రా! నీ స్తోతలు అనుకూల కర్ములగుదురు అప్పుడప్పుడు ఉక్థులు ఉచ్చరింతురు. నీవు అద్భుతుడవు. పరిశుద్ధడవు. పావకుడవు. అందువలన నే స్తుతించ బడుదువు.





