Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
20
ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. ఉరుముల యుక్తంగా వచ్చిన వాన ఉక్కపోతను కడిగేసింది. బంగాళా ఖాతం నుంచి వీచిన గాలికి వీధులు గుఁయిఁ మంటున్నాయి. తెప్పలు తెప్పలుగా వర్షం వర్షించింది. కాలూ ఆలోచనా నిమగ్నుడై అలాగే మంచం మీద వాలిపోయాడు.
లేఖ బిటెన్ను పెళ్ళి చేసుకుంది. అదీ అతని మనోఫలకం మీద చిత్రితం అవుతున్న చిత్రం. అది చెడు చిత్రం ఏమీ కాదు. బిటేన్ జందెం వేసుకొని ద్విజుడు అయిపోతే చిక్కేమి లేదు.
ప్రేమ ఇంద్రజాలం చేసి మంకు పట్టును లొంగతీసింది. ప్రస్తుతం బిటేన్ ముందున్నవి రెండే రెండు సమస్యలు. అతి కఠినమైన షరతులకు అంగీకరించడం లేదా లేఖను వదులుకోవడం, ఆమెను వేరొకడు పెళ్ళాడ్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడం.
బిటేన్ కు మాత్రం అట్టే బాధ ఏముంటుంది? ఆచారాలు, కట్టుబాట్లంటే అతనికి లెక్కేలేదు. రంగం రెడీగా ఉంది. అడుగు పెట్టడమే ఆలస్యం. జందెం వేసుకోవడం అంటే అతనికి టోపీ తగిలించుకోవడం కంటే ఎక్కువేమీ కాదు. అలాంటప్పుడు అతడు భయపడాల్సిందేముంది?
కాలూ అవకాశాలన్నింటిని అవలోకనం చేసుకున్నాడు. తాను అనుకున్నట్లు లేఖను సుఖ జీవనం గడవడం కల్ల. అది ఆమెకు సంబంధించిన విషయం. అయినా బిటేన్ తో ఆమె అట్టే గడ్డ్డు రోజులు గడపాల్సిన అవసరం ఉండదు. గుడి ఉండనే ఉంది.
"నీవు కులమాదాందుల్నే కాక, నీ వాళ్ళను, నీ రక్తాన్ని , చీమునే మోసగిస్తున్నావు" అదీ ఇబ్బంది. అందుకు ఏదైనా ఉపాయం కనిపెట్టాలి. పేదవాడు ఏమీ సమర్పించకుండానే పుణ్యం సంపాదించుకోవచ్చుననీ ప్రకటిస్తే సరిపోతుంది. ధనికులు మాత్రమే డబ్బు చెల్లించి పుణ్యం కొనుక్కోవాలి. ఈ విషయం ప్రజల మనసులో నాటడానికి కొంత కాలం పట్టవచ్చు. అయినా చివరకు ఇది వారికి నచ్చిపోతుంది.
మళ్ళీ కల నుంచే ప్రారంభిస్తే? మంగల్ అధికారికి కలలో శివుడు ప్రత్యేక్షం అయి "నేను పేదల దైవాన్ని , వారు స్వేదంతో ఆర్జించిన రాగి డబ్బులు నాకు అవసరం లేదు. నాక్కావలసిందల్లా వారి హృదయ కుసుమాలె" అంటాడు. అంతటితో అన్నీ సరిపడిపోతాయి.
గుడి చేతులో పట్టుకొని బిటేన్ గారడీ చేయొచ్చు. ఆదాయం పెంచడానికి కాలూకు ఒక ఆలోచన తట్టింది. సంవత్సరానికి ఉత్సవ దినాల్లో ఒక వారం రోజులు తిరునాళ్ళు ఏర్పాటు చేయాలి. అలా చేస్తే ఆ సమయంలో దుకాణాలు ఏర్పాటు చేయదలచుకున్న వారి నుండి స్థలానికి గాను అద్దె వసూలు చేయవచ్చు. పది పన్నెండు వరుసలు 150 దుకాణాలు ఏర్పాటు చేయించవచ్చు. వర్తకుల్ను ఆకర్షించడాని గ్గాను దుకాణం ఒక్కంటికి 25 రూపాయల చొప్పున అద్దె నిర్ణయిస్తే సరిపోతుందా? ఆ వారం మొత్తంలోనూ పదివేల మంది శివుణ్ణి దర్శించుకుంటారు. దేవునికి కానుకలు సమర్పించుకుంటారు. ఈ అదనపు ఆదాయంలో గుడికి భాగం లేకుండేట్లు ఏర్పాటు చేసుకోవాలి. ధర్మకర్తల ముందుకు వెళ్ళాలంటే కాలూకు జంకు. కాని బిటేన్ వారి కళ్ళల్లోకి సూటిగా చూసి "ఇది మేం చేసిన ఉపాయం. మా అవును పాలు పిండుకునే హక్కు మీకెలా వస్తుంది?" అంటాడు.
ధర్మకర్తల్తో అలా కచ్చితంగా మాట్లాడ్డం వల్ల ఫలితం శూన్యం. వారి మీద గుడ్లేర్రచేస్తే లాభం లేదు. వారికి నచ్చ చెప్పాలి. సంతోషపెట్టాలి. గట్టి మాటలు పని చేయనప్పుడు సయితం ఉపాయంగా వారిని జయించవచ్చు. అంతేకాదు, ధర్మకర్తల్లో తన క్షేమం కోరే మోతీ చంద్ ఉండనే ఉన్నాడు.
గడచిన వారం లేఖ పెళ్ళిని గురించి మాట్లాడినప్పుడు మోతీచంద్ ఆ విషయం పక్కకు నెట్టేశాడు. అతని మాటలు విచిత్రంగా ఉండినాయి.
"లేఖను పెళ్ళాడెంత గుండె ఎవనికుంది?"
కాలూ శ్వాస ఆగిపోయినంత పనీ అయింది. మోతీచంద్ మాటలు అర్ధం కాలేదు.
"ఆమెను తగినవరుడేడి?" మోతీచంద్ వివరించాడు.
కాలూ మనసు కుదుటపడింది.
"కొంతమంది వస్తున్నారు. మీరు చూడాలంటే ......" తన క్షేమం కోరే వారికి సంసార విషయాలు తెలియడం తప్పేమీ కాదు.
"తొందరపడకు. చంద్ర లేఖకు ఏదో అదృష్టం రాబోతుందని నా హృదయం చెబుతుంది."
"అదృష్టమా ?"
"అవును, అదృష్టమే నాకలా అనిపిస్తుంది. " అన్నాడు. ఏదో పెద్ద రహస్యాన్ని బయట పెడుతున్నట్లు. "తొందరెందుకు ? నా దృష్టిలోనే ఒక సంబంధం ఉంది."
"ఎవరిది?"
"అన్నీ సమయం వచ్చినప్పుడు చెపుతా."
మోతీచంద్ తన సమస్యల్ను అర్ధం చేసుకుంటాడు. తన నిర్ణయాన్ని ఆమోదిస్తాడు. లేఖ అనందం భగ్నం అయ్యేట్లుంది. ఆమె హృదయ పూర్వకంగా బిటెన్ను ప్రేమించింది.
బిటేన్ లేఖకు తన గుండెలో స్థానం ఇచ్చాడు. కాబట్టి అతని ఆదర్శాలను అడుగంటింప చేయవచ్చు. అప్పుడు తన షరతులకు అంగీకరించి తీరాల్సి వస్తుంది.
బిటేన్ తో మాట్లాడి , అతని అంగీకారం పొందిన తరువాత కూతురు దగ్గరికి వెళ్ళి "చంద్రలేఖా! ముహూర్తం చూసే శుభసమయం వచ్చేసింది" అంటాడు.
ఆమె అంతులేని ఆశ్చర్యంతో మునకలు వేస్తుంది.
"నీకోసం వరుణ్ణి చూశాను."
అప్పుడామె ముఖం ఎలా ఉంటుంది?"
నిముషం కంటే ఎక్కువ ఆమెను సస్పెన్సు లో ఉంచడు.
"బిటేన్ అతడు మంచి భర్త కాదూ?" ఆ మాట చెవిని పడగానే ఆమె ముఖం ఎలా అవుతుంది?
అతనికి సంతృప్తి కలిగింది. కళ్ళు మూసుకుని మంచం మీద వాలే వరకల్లా మంచపు కుసులు కిర్రుమన్నాయి.
ఆ రోజు సాంతం అతడు తన నిర్ణయాన్ని గురించి ఆలోచించాడు. అనేకసార్లు తన నిర్ణయాన్ని గట్టి పర్చుకున్నాడు. వంటింట్లో ఉన్న అతని కూతురు వైపు చూశాడు. గొంతులో వెలక్కాయ పడింది. ఆమె ఒక చాప మీద కూర్చుంది. చేతులు వళ్ళో పెట్టుకొని గాజుల మీద తన దృష్టినిగిడ్చింది. తల్లి ఎర్రని అద్దపు గాజులు తప్ప వేరే ఏమీ ఆమె వంటి మీద పెట్టుకోదు.
ఎంతలో ఎంత పెద్దదైంది! హృదయంలో ప్రేమాంకురం అంకురించెంత పెద్దది అయింది. మనసు రెక్కలు కట్టుకొని వెనక్కు ఎగిరిపోయింది. అవి కాలూ పెళ్ళైన కొత్త రోజులు. అప్పటికి లేఖ తల్లికి పదహారేళ్ళున్నాయి. తానింకో పదేళ్ళు పెద్ద. ఆమె సౌందర్యానికి అతడు ముగ్ధుడయ్యె వాడు. అలాంటి అందం అతని సొత్తు అయినందుకు గర్వించేవాడు. కాని ఆమెకు తన సొగసు గురించి తెలియనే తెలియదు. ఆమె కమ్మరి ఆడది. చేయాల్సిన చాకిరి అంతా చేసేది. ఎప్పుడు చూచినా ఆమె పెదవుల మీద చిరునవ్వు చిందులు తొక్కుతూ ఉండేది. ఆమె నవ్వు విచిత్రంగా ఉండేది. నవ్వినప్పుడు పెదవుల మూలాలు ఒత్తుకునేవి. నోరు కొద్దిగా మాత్రమే తెరచేది.
ఒకనాడు తనకు పిచ్చెక్కినంత పని అయింది. ఊళ్ళో జాతర జరుగుతుంది. ఊరూరికీ తిరిగే వీధి నాటకాలవాళ్ళు స్కూలు పక్కన ఉన్న మైదానంలో అడ్తారని తెలిసింది. రాత్రి తొమ్మిది గంటల నుంచి పొద్దు పొడిచిందాకా ఆడ్తారు. ఆ నాటకపు పిచ్చిలో పెళ్ళానికేమీ చెప్పకుండానే పొద్దుకుంకగానే ఇంటి నుంచి జారుకున్నాడు. కాల్చిన రొట్టె కూర కొనుక్కు తిన్నాడు. అందుకు అర్ధ రూపాయి ఖర్చు చేశాడు. అక్కడి నుంచి పాకీవారి గుడిసెల దగ్గర ఉన్న కల్లు కొట్టుకు వెళ్ళాడు. ముగ్గురు మిత్రులతో సహా కళ్ళు తాగుతూ కూర్చున్నాడు. వారు సోలుతూ సోక్కుతూ అట దగ్గరికి చేరేవరకు ఆలస్యం అయిపొయింది. పెట్రో మాక్సులైట్లతో ఆ స్థలమంతా వెలిగిపోతుంది. జతరకావడం మూలాన జనం క్రిక్కిరిసి గుండ్రంగా కూర్చున్నారు. ఆ వర్తులం మధ్య నుంచి నటకులు రావడానికీ పోవడానికీ స్థలం వదిలి వేయబడింది. జనం మధ్య రంగస్థలం.
కధ పాతదే. పురణకాలం నాటిది. కృష్ణుడు వీణ వాయిస్తాడు. రాధ శరీరం పులకరిస్తుంది. గుండె జలదరిస్తుంది. నటకుల్లో ప్రజ్ఞా ఉంది. ఆటకు తగిన మాట. మాటకు తగిన పాట. చక్కగా నటించారు. నిశ్సబ్దంగా కూర్చున్న ప్రేక్షకులు కన్నీరు తుడుచుకున్నారు.
తూర్పు యెర్రవారుతుంది. అట పూర్తీ అయింది. కాలూ ఇంటితోవ పట్టాడు. తానేదో తప్పు చేసినట్లు అతని గుండె బరువైంది. తప్పు బయట పడకుండా గాలి పోగు చేయాలి. ఎందుకలా చేయాలి? తనకేమన్నా భార్యంటే భయమా? ఆమె కనుసన్నల్లో మెలుగుతున్నాడా? తాళం చెవుల గుత్తితో సహా తన్ను కొంగుకు కట్టుకోనిచ్చే మగాడు కాదు తాను. తాను స్వతంత్రుడు . ఇష్టం వచ్చినట్లు చేస్తాడు.





